శ్రీగంధం
| శ్రీగంధం | |
|---|---|
| 'Sandalwood' by Köhler Santalum album |
|
| Conservation status | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | యుడికాట్స్ |
| (unranked): | Core eudicots |
| Order: | Santalales |
| Family: | శాంటాలేసి |
| Genus: | శాంటాలమ్ |
| Species: | ఎస్. ఆల్బమ్ |
| Binomial name | |
| శాంటాలమ్ ఆల్బమ్ లి. |
|
శ్రీగంధం లేదా చందనము ఒక విశిష్టమైన సుగంధాన్నిచ్చే వృక్షం. దీని శాస్త్రీయనామం శాంటాలమ్ ఆల్బమ్ (Santalum album). ఇది శాంటాలేసి (Santalaceae) కుంటుంబానికి చెందినది. ఇది ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన బహువార్షిక వృక్షం. దీనిని భారతదేశంలో ప్రాచీనకాలము నుండి పూజా ద్రవ్యముగా వాడబడుచున్నది.
విషయ సూచిక |
ఉపయోగాలు[మార్చు]
చందనము వ్యాధి నిరోధక శక్తిని మరియు మేధస్సును పెంచే గుణము కలది. చందనపుచెక్కనుండి తీసిన తైలం మంచి సువాసన కలిగియుండి పరిమళ ద్రవ్యముల తయారీలో బాగా వాడుతున్నారు. ఇది మెదడు, హృదయమునకు సంబంధించిన వ్యాధులకు, కడుపులో మంట, జ్వరము, తలనొప్పి, జలుబు, శ్వాసకోశ, మూత్రకోశ, అతిసార వ్యాధులకు, మశూచి, స్ఫోటకము మరియు ఇతర చర్మవ్యాధులకు సంబంధించిన మందుల తయారీలో ఉపయోగపడును. వేరు నుండి లభించే తైలాన్ని అత్తరు, అగరుబత్తి, సబ్బులలో ఉపయోగిస్తారు.
సాగువిధానం[మార్చు]
ఇసుకతో కూడిన ఎర్రమట్టి నేలలు చందనము సాగుకు అనుకూలమైనవి. ఇది ఉష్ణమండల పంట. దీనికి తేమగల పొడి నేలలు అవసరము.
శ్రీగంధం చెట్టు ఒక పరాన్న జీవన వృక్షం. అనగా ఇది భూమి నుండి నేరుగా నీటిని, పోషకాలను గ్రహించలేదు. వేరే మొక్కల వేర్లతో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకొని నీటిని, పోషకాలను గ్రహిస్తుంది. అందువలన శ్రీగంధం మొక్కలతో పాటు వేరే అతిథేయి మొక్కలను పెంచవలసి ఉంటుంది. అతిథేయి మొక్కలుగా కంది, ఉసిరి, సరుగుడు, కానుగ, మిరప, కరివేపాకు మొదలైనవాటిని పంచవచ్చును.
ఉపయోగాలు[మార్చు]
దీన్ని సిరి గందం చెట్టు అని కూడ అంటారు. బాగ ముదిరిన ఈ చెట్టు కర్ర మంచి సువాసన కలిగి వుంటుంది. అటు వంటి కర్రలను రాతి బండలపై నీళ్లు చిలకరిస్తూ రుద్దుటుంటె గందం వస్తుంది. దీని దేవునికి పూస్తారు. తిరుమల లోని శ్రీ వేంకటేస్వరాలయంలో ఈ విధంగా గందం తీయడానికి ఒక గది వున్నది. (గందపు గది) ఈ చెట్లు ఎక్కువగా నల్ల మడ అడవులో పెరుగు తాయి. తిరుమల కొండ పైన ఈ చెట్లు విస్తారంగా కనిపిస్తాయి. ఇక్కడ గందపు చెక్కలను కూడ బజారులో అమ్ముతుంటారు. ఇవి చాల విలువైనవి. అందు చేత వీటిని స్మగ్లర్లు దొంగ రవాణ చేస్తుంటారు. రాయల సీమ ప్రాంతంలో ఈ చెట్లు ఎక్కువగా కనబడతాయి. ప్రత్యేకంగా వీటిని పెంచరు. పొలాల గట్ల మీద తోటలలో వాటంతట అవే పడి పెరుగు తుంటాయి. వీటిని ప్రత్యేకంగా పెంచడము, కొట్టడము, అమ్మడం నిషేదం. అంచు చేత దొంగలు వీటిని రాత్రికి రాత్రే కొట్టుకొని పోతుంటారు.