శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి | |
| జననం | 23 ఏప్రిల్, 1891 పొలమూరు |
|---|---|
| స్వస్థలం | మహేంద్రవాడ |
| మరణం | 25 ఫిబ్రవరి, 1961 రాజమండ్రి |
| ఇతర పేర్లు | శాస్త్రి, వాచస్పతి, తార్కికుడు, వసంతుడు, కుమారకవిసింహుడు, భటాచార్యుడు, కౌశికుడు |
| తండ్రి | లక్ష్మీపతి సోమయాజులు |
| తల్లి | మహలక్ష్మీ సోదెమ్మ |
20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఈయన పేరెన్నిక గన్నవాడు. ఆయన జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక పక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక పక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయికని తన రచనలలో ప్రతిభావంతంగా చిత్రించేడీయన.
వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ జ్ఞాపకాలూనూ.
విషయ సూచిక |
జీవిత విశేషాలు [మార్చు]
సుబ్రహ్మణ్యశాస్త్రి 1891 ఏప్రిల్ 23 న తూర్పు గోదావరి జిల్లా పొలమూరులో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు మహలక్ష్మీ సోదెమ్మ, లక్ష్మీపతి సోమయాజులు. వేదం, జ్యోతిష్యం మరియు ధర్మ శాస్త్రాలను చదివారు.
ఈయన గాంధీ, ఖద్దరు, హిందీ - ఈ మూడింటినీ వ్యతిరేకించారు.
సుబ్రహ్మణ్యశాస్త్రి 1961 ఫిబ్రవరి 25 న మరణించారు.
రచనలు [మార్చు]
సుబ్రహ్మణ్య శాస్రి 75 కథలు రాసాడు. ఈయన కథలలో విషయాన్ని ప్రణయం, సంఘసంస్కారం, ప్రబోధం, కుటుంబజీవితం, అపరాధ పరిశోధనం, భాషావివాదాత్మకం, అవహేళనాత్మకం, చారిత్రకం అనే విషయాలుగా విభజించచ్చు. ఇవేకాక శ్రీపాద అనేక పద్య రచనలు,నవలలు,నాటకాలు,అనువాదాలు, వైద్య గ్రంథాలు కూడా రాసాడు.వాటిలో కొన్ని: ఆత్మబలి, రక్షాబంధనం, రాజరాజూ, కలంపోటు, వీరపూజ, వీరాంగనలు, మహాభక్త విజయము, ఆయుర్వేద యోగ ముక్తావళి, వైద్యక పరిభాష వగైరా. శాస్త్రి తన ఆత్మకథ - అనుభవాలూ-జ్ఞాపకాలూనూ ని ఎనిమిది సంపుటాలుగా ప్రచురించదలిచాడు. కానీ శాస్త్రి అకాలమరణంతో అది మూడు సంపుటాల దగ్గర నిలిచిపోయింది. ఈయన రచనలు ఆంధ్రప్రదేశ్ పాఠశాల, కళాశాలలలో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. శాస్త్రి తొమ్మిదేళ్ళ పాటు ప్రబుద్ధాంధ్ర పత్రిక నిర్వహించారు. గిడుగు రామమూర్తి లాగా ప్రముఖ వ్యావహారిక భాషావాది. కలం పేర్లతో శతాధిక వ్యాసాలు రాసారు. అనేక అష్టావధానాలు కుడా చేసారు. 1956లో కనకాభిషేకం అందుకున్నారు.
వ్యక్తిగతం [మార్చు]
సుబ్రహ్మణ్యశాస్త్రి వ్యక్తిగతం గురించి తన స్వీయచరిత్రా పుస్తకాలైన అనుభవాలు,జ్ఞాపకాలు లో వివరంగా రాసుకొన్నాడు. దాని ప్రకారం చిన్నతనం నుండీ బాగా అల్లరి చిల్లరిగా పొలాల వెంట తన స్నేహితుడు ఆనంద్ తో తిరిగేవాడినని రాసాడు. చాలాకాలం మునికూడలి (మురమళ్ళ) లో వారాలు చేసుకొంటూ విధ్యాభ్యాసం కొనసాగించాడు.చిన్న వయసులోనే అత్త కూతురు సోమిదేవమ్మతో వివాహం జరిగింది.
ప్రఖ్యాత సందేశాలు [మార్చు]
- "తెనుగుదేశమే దేశం, తెనుగు భాషే భాష,
తెనుగు మనుష్యులే మనుష్యులు, తెనుగు వేషమే వేషం. ఏ జాతి యెదటా ఏ సందర్భంలోనూ ఎందుకున్నూ నా తెనుగుజాతి తీసిపోదు"
కథలు [మార్చు]
- కలుపు మొక్కలు
- గులాబీ అత్తరు
- శుభికే శిర ఆరోహ
- తాపీమేస్త్రి రామదీక్షితులు బి.ఏ.
- మార్గదర్శి
- ఇలాంటి తవ్వాయి వస్తే
- షట్కర్మయుక్తా
- పుల్లంపేట జరీచీర
- ఇల్లుపట్టిన వెధవాడపడుచు
- అన్నంతపనీ జరిగింది
- విమానం ఎక్కపబోతూనూ
- కీలెరిగిన వాత
- గూడుమారిన కొత్తరికం
- అరికాళ్ళకింద మంటలు
- కన్యాకాలే! యత్నా ద్వరితా!
- కొత్త చూపు
- గుర్రప్పందాలు
- జాగ్రత్త పడవలసిన ఘట్టాలు
- తల్లి ప్రాణం
- కూతుళ్ళ తల్లి
- ముళ్ళచెట్టూ-కమ్మని పువ్వూనూ
- బ్రాహ్మణాగ్రహారం
- యావజ్జీవం హోష్యామి
- విజయనగర కథలు అనే ఈ పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బాలురులకు చరిత్ర లొని నీతి కథలు తెలియటుకు వ్రాసిన విషయాల సంపుటం. ఈ పుస్తకముతో పాటు గోల్కొండనవాబు కథలు, ఓరుగంటి రాజుల కథలు , చిత్తూరు రాజుల కథలు, ఢిల్లీ రాజుల కథలు వెలువడ్డాయి.
నవలలు [మార్చు]
ఇతర రచనలు [మార్చు]
- అనుభవాలు జ్ఞాపకాలు (స్వీయానుభవాలు)
- రాచపీనుగ తోడు లేకుండా వెళ్ళదు (నాటకం)
మూలాలు, వనరులు [మార్చు]
- అక్కిరాజు రమాపతిరావు రాసిన ప్రతిభామూర్తులు, విజ్ఞాన దీపిక ప్రచురణ, 1991
- శ్రీపాద రచనల్లో స్త్రీ పాత్రలు ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రత్యేక సంచిక నుంచి