శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్
| శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ | |
![]() |
|
| Type | ఉపగ్రహ టెలివిజన్ |
| Branding | శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ |
| Availability | భారతదేశం, |
| Founder | తితిదే |
| Launch date | 7 జులై 2008 |
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ [1]24 గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారంచేసే ఒక టెలివిజన్ సంస్థ. తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నడుపబడుతుంది. తిరుమలలో శ్రీవారికి జరిగే వివిధ ముఖ్యమైన పూజా కార్యక్రమాలను మరియు వివిధచోట్ల దేవాలయాలలో జరిగే ముఖ్యమైన ఉత్సవ కార్యక్రమాలను ఈ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ ఛానల్ కు సంబంధించిన ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉన్నది.
శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ను భారత రాష్ట్రపతి ప్రతిభాపటేల్ 7 జులై 2008న ప్రారంభించారు. ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్ధేశ్యం ఆధ్యాత్మిక సంబంధమైన హిందూ కార్యక్రమాలను ప్రసారం చేయడం. ఈ ఛానల్ ప్రసారం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతిరోజు పర్యవేక్షిస్తారు. ప్రతి సంవత్సరం శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో జరిగె వివిధ వాహన సేవల మరియు రథోత్సవంలను ఈ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. శ్రీవారి భక్తులకు అంకితం చేయబడిన ఈ ఛానల్ తెలుగు భాషతో పాటు దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో కూడా ప్రసారం చేస్తుంది.
ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ప్రసారం చేసే ఈ ఛానల్ 2009లో నంది టివి అవార్డ్స్ గెలుపొందింది. ఈ ఛానల్ భారతదేశంలో అన్ని కేబుల్ మరియు డిష్ టివి లకు ఉచితంగా తన ప్రసారాలను అందిస్తుంది. ఇంటర్నెట్లో కూడా ఈ ఛానల్ తన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
