శ్రేయ ఘోషాల్ (నేపథ్య గాయిని)

వికీపీడియా నుండి
శ్రేయ ఘోషాల్

2008 లో శ్రేయ ఘోషాల్
నేపథ్యం
జన్మనామం శ్రేయ ఘోషాల్
జననం 12-03-1984
మూలం దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్, భారతదేశం
సాహిత్యం ఘజల్, సినిమా, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం
వృత్తులు గాయని/నేపధ్య గాయని
వాయిద్యాలు గాత్రం
క్రియాశీలక కాలం 2002-నేటి వరకు
వెబ్ సైటు shreyaghoshal.com

శ్రేయ ఘోషాల్ (బెంగాళీ: শ্রেয়া ঘোষাল; జననం : 12 మార్చి 1984) భారత గాయని. హిందీ చిత్రసీమయైన బాలీవుడ్ లో ప్రముఖ నేపధ్య గాయని, హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ మరియు మళయాళం లో ఎన్నో పాటలు పాడారు.

శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం "దేవదాస్" తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా ఇప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు , 4 దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి.



[మార్చు] పుట్టు పూర్వత్రాలు

శ్రేయ ఘోషాల్ పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. తన బాల్యం రాజస్థాన్ రాష్ట్రం యందున్న "కోట" పట్టణానికి సమీపంలో కల "రావత్ భాట" అనే చిన్న పట్టణంలో సాగింది. ఆమె తండ్రి శ్రీ బిశ్వజీత్ ఘోషాల్, "న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" (భారతీయ అణుధార్మిక శక్త్యుత్పాదక సంస్థ) లో ఇంజనీరు గా పని చేసేవారు. ఆమె తల్లి సాహిత్యం లో పోస్ట్ - గ్రాడ్యూయేట్.

తన నాల్గవ ఏట నుంచే శ్రేయ ఆమె తల్లి దగ్గరి హార్మోనియం పట్ల ఆసక్తి చూపించారు. ఆమె శ్రీ మహేష్ చంద్ర శర్మ దగ్గర హిందుస్థానీ సంగీతాన్ని అభ్యసించారు. ఆమె 1996 వ సంవత్సరంలో జీ టీవీ లో ప్రసారమయ్యే "స రె గ మ" (ఇప్పటి స రె గ మ ప) 75 వ పిల్లల ప్రత్యేక సంచిక (Children's special episode) విజేత. ఆ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన శ్రీ కల్యాణ్ జీ వీర్ జీ షాహ్ ఆమె తల్లిదండ్రులను ముంబై కి రమ్మని ఒప్పించారు. 1997 వ సంవత్సరంలో ఆమె తండ్రికి ఉద్యోగరీత్యా బదిలీ అయ్యి కుటుంబమంతా ముంబై కి వచ్చింది. శ్రేయ శ్రీ కల్యాణ్ జీ దగ్గర 18 నెలలు శిక్షణ పొంది సాంప్రదాయ సంగీతాభ్యాసాన్ని శ్రీ ముక్తా భీదే దగ్గర కొనసాగించారు.

[మార్చు] సంగీత ప్రస్థానం

ఆమె మరల "స రె గ మ ప" లో ప్రవేశించినపుడు శ్రీ సంజయ్ లీలా భంసాలీ (న్యాయనిర్ణేత మరియు ప్రఖ్యాత దర్శకుడు) ని తన గాత్రం తో ఆకట్టుకున్నారు. క్రీ.శ || 2000 లో శ్రీ భంసాలీ శ్రేయకు "దేవదాసు" చిత్రం ప్రధాన కథానాయిక పాత్ర "పారు"(పార్వతి)కు గాత్ర దానం చేసే అవకాశం ఇచ్చారు. ఆమె ఆ చలన చిత్రం లో 5 పాటలను ఆలపించారు. ఆ చిత్రంలో "బైరి పియా " పాటకు గాను ఆమెకు భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. అదే చిత్రానికి ఆమెకు ఉత్తమ నేపథ్య గాయినిగా ఉత్తరాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం లభించింది.

[మార్చు] సంగీత రంగంలో పురోగతి

ఆమె హిందీ లోనే కాకుండా దక్షిణాది భాషలలో ఎన్నో పాటలు ఆలపించారు. ఆమె , తమిళ్ చిత్రం 'ఆల్బం' లోని "చెల్లామే చెల్లామ్" అనే పాట తో దక్షిణ భారత చలన చిత్ర సీమ లోకి రంగప్రవేశం చేశారు. 'ఒక్కడు' చిత్రం లో "నువ్వేం మాయ చేసావో గాని " ఆమె మొదటి తెలుగు పాట. 'బిగ్ బి' చిత్రంలో "విదా పరయుకాయనో " శ్రేయ పాడిన మొట్ట మొదటి మలయాళ పాట. ఆమెకు ఇప్పటిదాకా ఆమె పాడిన హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ పాటలకు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు మరియు మలయాళం , తమిళ్ రాష్ట్ర పురస్కారాలు లభించాయి. 2010 సంవత్సరంలో ఆంగ్ల చిత్రమైన వెన్ హేరీ ట్రైస్ టు మేరీ('When Harry Tries to Marry') లో ఆమె పాడారు. ఆమె ఈ మధ్య తెలుగు లో 'శ్రీ రామ రాజ్యం' చిత్రం లో పాడిన పాటలు చాలా ప్రఖ్యాతి పొంది వివిధ రకాల శ్రోతల మన్ననలను అందుకున్నాయి.

Sony TV లో ప్రసారమయ్యే "ఎక్స్ ఫ్యాక్టర్" అనే ఒక స్వర సంగ్రామానికి సోను నిగమ్(ప్రఖ్యాత నేపథ్య గాయకుడు), శ్రీ సంజయ్ లీలా భంసాలీ లతో కలిసి న్యాయ నిర్ణేతగా శ్రేయ వ్యవహరించారు. అలాగే మ్యూజిక్ కా మహా మూకాబలా అనే పోటీ లో ఆమె తన బృందానికి నాయకురాలిగా చాలా చక్కని పాత్ర పోషించారు.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు