షట్టరు వేగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కదులుతున్న వస్తువుల పై షట్టరు వేగం నాటకీయ ప్రభావాన్ని తెస్తుంది. నేపథ్య కళంకాలలో స్పష్టత తీసుకురావటానికి, సరైన బహిర్గతం కోసం సూక్ష్మరంధ్రాన్ని సరిచేయవలసిన అవసరం ఉంటుంది

ఛాయాచిత్రకళలో షట్టరు వేగం లేదా బహిర్గత సమయం ఫోటోని చిత్రీకరించే సమయంలో షట్టరు తెరచి ఉంచవలసిన కాల పరిమాణం. ఫోటోగ్రఫిక్ ఫిలిం/ఇమేజ్ సెన్సర్ పైకి చేరబడే కాంతి బహిర్గత సమయానికి అనుపాతంలో ఉంటుంది.

పరిచయం[మార్చు]

ఛాయాచిత్రకళలో సృజనాత్మక వినియోగం[మార్చు]

వివిధ షట్టరు వేగాలతో తిరుగుతూ ఉన్న ఒక సీలింగ్ ఫ్యాన్ యొక్క ఛాయాచిత్రాలు[మార్చు]

ఒకే సూక్ష్మరంధ్రంతో షట్టరు వేగం ఎక్కువ ఉంటే (తక్కువ సమయం తెరచి ఉంచబడుతుంది కాబట్టి), కదిలే వస్తువులు ఆగిపోయినట్లుగా చిత్రీకరించవచ్చు. షట్టరు వేగం తక్కువ ఉంటే (ఎక్కువ సమయం తెరచి ఉంచబడుతుంది కాబట్టి), వస్తువుల కదులుతోన్నట్లుగా చిత్రీకరించవచ్చు. ఉదాహరణకు, ఒక గదిలో ఒకే వేగంతో తిరుగుతోన్న సీలింగు ఫ్యానును వివిధ షట్టరు వేగాలతో చిత్రీకరించినట్లయితే, షట్టరు వేగం ఎక్కువగా ఉన్న ఛాయాచిత్రాలలో ఫ్యాను అసలు తిరగనట్లుగా ఉంటే, షట్టరు వేగం తక్కువగా ఉన్న ఛాయాచిత్రాలలో ఫ్యాన్య్ యొక్క రెక్కల వేగం తెలుస్తుంది.

ఒకే సూక్ష్మరంధ్రంతో షట్టరు వేగం తగ్గే కొద్దీ, నమోదు అయ్యే కాంతి పెరుగుతూ పోతుంది, కావున, ఐ ఎస్ ఓ వేగం తగ్గిస్తూ రావాలి.

సినిమాటోగ్రఫిక్ షట్టరు సూత్రం[మార్చు]

మూలాలు[మార్చు]