షష్టిపూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దంపతులలో భర్తకు ఆరు పదులు వయసు నిండినప్పుడు జరుపుకొను వేడుక లేదా ఉత్సవాలను షష్టిపూర్తి అని అంటారు. కాని దాన్ని 60 సంవత్సరాలు పూర్తి అయిన స్త్రీ పురుషులు ఎవరయిననూ చేసుకోవచ్చు. ఎందుకంటే, షష్టిపూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తి కావటం అని కనుక. సాధారణంగా పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే కనుక స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చెయ్యరు.

  • నిజానికి మనిషికి సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెపుతోంది. అందులో సగం అంటే 60 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. అంటే ఒక లెక్క ప్రకారం మనిషి 60 సంవత్సరాలలో తన జీవితంలో జరగవలసిన ముఖ్యఘట్టాలనన్నింటినీ పూర్తి చేసుకుని తన జీవితంలో రెండవ అర్థభాగాన్ని ప్రారంభిస్తాడు. అయితే, ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథునిగా, 70 వ యేట భీమరథునిగా, 78 వ యేట విజయరథునిగా, పొంచి ఉంటాడు. ఈ వయస్సులలో కాళ్ళు, చేతులు లాంటి బాహ్యావయవాలు, గుండె, ఊపిరితిత్తులు వంటి అంతరావయవాలు శారీరక యంత్రపరికరాలలో పెనుమార్పులు సంభవిస్తాయి. ఆయా కుదుపులకు తట్టుకుని, మళ్ళీ శక్తిని పుంజుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.
  • జ్యోతిషశాస్త్ర రీత్యా బృహస్పతి పన్నెండు సంవత్సరాల కొకసారి తిరిగి తాను బయలుదేరిన స్థానానికి చేరుకుంటాడు. అలాగే శని 30 సంవత్సరాలకు ఒకసారి 12 రాశులను చుట్టివస్తాడు. వీరిద్దరూ జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. మానవజీవితంలో జరిగేమార్పులనన్నింటినీ మనం ఈ రెండు గ్రహాల గోచారం ద్వారా తెలుసుకోవచ్చు. శని గురువులు తాము బయలుదేరిన రాశికి చేరుకోవటం తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.

ఇంకొక విధంగా ఒక మనిషి పుట్టిన సంవత్సరం నుండి 60 తెలుగు సంవత్సరాల ప్రకారం తిరిగి మరలా అదే సంవత్సరములో ప్రవేశించే రోజు షష్టిపూర్తి అని కూడా అంటారు. అంటే తన జీవిత కాలంలో ఒక అంకం ముగిసినట్లుగా అనుకోవచ్చు.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]