షాక్ (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
షాక్ (2006)
TeluguFilm Shock 2006.jpg
దర్శకత్వం హరీష్ శంకర్
నిర్మాణం రామ్ గోపాల్ వర్మ
కథ హరీష్ శంకర్, కోన వెంకట్
చిత్రానువాదం హరీష్ శంకర్
తారాగణం రవితేజ,
జ్యోతిక,
టబు,
సుబ్బరాజు,
బ్రహ్మానందం,
కోట శ్రీనివాసరావు,
నాగేంద్ర బాబు
సంగీతం అజయ్-అతుల్
సంభాషణలు కోన వెంకట్
ఛాయాగ్రహణం సర్వేష్
కూర్పు భానోదయ
నిర్మాణ సంస్థ రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ అండ్ ఎంటర్టైన్‌మెంట్
విడుదల తేదీ ఫిబ్రవరి 9 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా రవితేజ, జ్యోతిక ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.

కథ[మార్చు]

శేఖర్ అని పిలవబడే చంద్ర శేఖర్ (రవితేజ), మధురిమ (జ్యోతిక) ప్రేమించి పెళ్ళి చేసుకుని సంతోషంగా జీవనాన్ని వెళ్ళదీస్తుంటారు. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తుంటారు. నగేష్ (సుబ్బరాజు), దివాకర్ (రవి కాలె) పోలీస్ డిపార్ట్‌మెంట్ లో పేరొందిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులు. ఏజెంట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు శేఖర్ ను నక్సలైటు గా పొరబడి కాల్పులు జరుపుతారు. తరువాత జరిగిన పొరపాటును దాచిపెట్టడానికి శేఖర్ నిజంగా నక్సలైటే నని తప్పుడు ఆధారాలు సృష్టించి అతన్ని జైలుపాలు చేస్తారు. శేఖర్ తరపు లాయర్ ధర్మారెడ్డి (కోట శ్రీనివాస రావు) కూడా పోలీసులతో కుమ్ముక్కయి శేఖర్ కు ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తాడు.

ఒక వైపు మధురిమ కు జర్నలిస్టు యైన గీత (టబు) తో పరిచయం ఏర్పడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి నిజాల్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే గీత లేని సమయంలో నగేష్, దివాకర్ లిద్దరూ కలిసి మధురిమను హత్య చేస్తారు. గీత జరిగిన విషయాన్ని శేఖర్ కు చెబుతుంది. జైల్లో తన సెల్ మేట్ అయిన లబ్బీపేట తిలక్ (రాజారవీంద్ర) సాయంతో చిన్న గొడవ సృష్టించి అక్కణ్ణుంచి తప్పించుకుంటాడు. తరువాత కథంతా హీరో తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఎలా పగ తీర్చుకుంటాడనేదే.

విశేషాలు[మార్చు]

కథనం కొత్తగా అనిపించినా కథ మాత్రం నరేష్ హీరోగా నటించిన హలో డార్లింగ్ లేచిపోదామా, జగపతి బాబు హీరోగా నటించిన మనోహరం సినిమాలకు అక్కడక్కడా పోలికలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో జైలు నుంచి తప్పించుకుని ప్రతీకారం తీర్చుకోవడం లాంటి సన్నివేశాలు.

పాటలు[మార్చు]

సినిమాలో నాలుగు పాటలున్నాయి.

  1. మధురం మధురం