శివమొగ్గ
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
| ?శివమొగ్గ జిల్లా (షిమోగా,ಶಿವಮೊಗ್ಗ) కర్ణాటక • భారతదేశం |
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| విస్తీర్ణం | 8,465 కి.మీ² (3,268 చ.మై) |
| ముఖ్య పట్టణము | శివమొగ్గ (నగరం) |
| తాలూకాలు | భద్రావతి, హొసనగర, సాగర, శిఖరిపుర, శివమొగ్గ, సోరబ్, తీర్థహళ్ళి |
| జనాభా • జనసాంద్రత |
16,42,545 (2007) • 194.04/కి.మీ² (503/చ.మై) |
| డెప్యూటీ కమిషనర్ | టి.కె. అనిల్ కుమార్ |
| కోడులు • పిన్‌కోడు • టెలిఫోను • వాహనం |
• 577202, 577204 • +08182 • KA-14 |
శివమొగ్గ లేదా షిమోగా (కన్నడం:ಶಿವಮೊಗ್ಗ), కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లా మరియు ఆ జిల్లా పాలనా కేంద్రమైన పట్టణం. ఇది తుంగ నది ఒడ్డున ఉంది.
"శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కేలడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. శివప్ప నాయకుని కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం మరియు జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు.
విషయ సూచిక |
జిల్లా సరిహద్దులు [మార్చు]
ఈ జిల్లాకు తూర్పున దావణగెరి జిల్లా, ఆగ్నేయాన చిక్‌మగళూరు జిల్లా, నైరుతిన ఉడిపి జిల్లా, వాయువ్యాన ఉత్తర కన్నడ జిల్లా, ఈశాన్యాన హవేలి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు [మార్చు]
- రైలు రవాణా
ఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది.
- రోడ్డు రవాణా
ఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి. 13వ నెంబరు జాతీయ రహదారి మరియు 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 6632 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండగా అందులో 222 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 402 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కూడా ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి.
- వాయు రవాణా
ప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.
పరిశ్రమలు [మార్చు]
- దేశంలోని ప్రముఖ ఇనుము-ఉక్కు పరిశ్రమలలో ఒకటైన విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు పరిశ్రమ ఈ జిల్లాలో ఈశాన్యాన భద్రావతి వద్ద ఉంది. ఈ పారిశ్రామిక పట్టణంనకు మంచి రైలు, రోడ్డు సౌకర్యం ఉంది. ప్రముఖ ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకాలపై ఏర్పడిన ఈ కర్మాగారపు ప్రారంభనామం మైసూర్ ఇనుము-ఉక్కు పరిశ్రమ. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తుంది.
- భద్రావతిలోనే మరో ముఖ్యమైన పరిశ్రమ భద్రావతి పేపర్ మిల్స్ లిమిటెడ్. ISO 14001 ధృవపత్రం పొందిన ఈ కంపెనీ అన్నిరకాల పేపరును ఉత్పత్తి చేయుటలో ప్రసిద్ధి.
- ఇవే కాకుండా పలు వ్యవసాయ ఆధారిత, ఇంజనీరింగ్ ఉత్పత్తుల, ఆటోమోబైల్, ఆహార, పానీయాలకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లు ఈ జిల్లాలో కలవు.
ముఖ్య పట్టణాలు [మార్చు]
|
|
|
అవీ ఇవీ [మార్చు]
- కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది.
- భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ ఈ జిల్లాలోని భద్రావతిలో జన్మించాడు.
- జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి తీర్థహళ్ళి తాలుకాలోని మెలిగె గ్రామంలో జన్మించాడు.
- శరావతిలోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సాగర్ తాలుకాలో ఉన్నది.
బయటి లింకులు [మార్చు]
- కువెంపు విశ్వవిద్యాలయం
- షిమోగా జిల్లా పంచాయితీ
- షిమోగా గురించి
- షిమోగా ఆన్లైన్
- పడమటి కనుమలు
- షిమోగా నగరం
- శివప్ప నాయక రాజప్రాసాదం ఫొటోలు
కర్ణాటక జిల్లాలు
బగల్ కోట | బెంగుళూరు | బెంగుళూరు గ్రామీణ | బెల్గాం | బళ్లారి | బీదరు | బీజాపూర్ | చామరాజనగర్ | చికమగలూరు | చిత్రదుర్గ | దక్షిణ కన్నడ | దావణగెరె | ధార్వాడ | గదగ్ | గుల్బర్గా | హసన్ | హవేరి | కొడగు | కోలార్ | కొప్పళ | మాండ్య | మైసూరు | రాయచూరు | షిమోగా | తుముకూరు | ఉడిపి | ఉత్తర కన్నడ