సంగీత వాద్యాలు

వికీపీడియా నుండి
(సంగీత వాయిద్యము నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆంధ్ర ప్రదేశ్‌లో వాడే కొన్ని సంగీత వాయిద్యాలు

సంగీత వాద్యాలు (Musical Instruments) భారతీయ సంగీతంలో గాయకునికి సహాయకారిగా గాని లేదా కొన్ని వాద్యాల సమూహంగా గాని ఉపయోగించే పరికరాలు.

సంగీత వాద్యాలయందు వివిధ రకాలు[మార్చు]

వాద్యాలు ముఖ్యముగా నాలుగు రకాలు

  1. తత వాద్యాలు : తంత్రులు లేదా తీగ (String) లతో వాయించేవి (ఉదా: వీణ, తంబూరా, సంతూర్, వయోలీన్, సరోద్, సితార, సారంగి మొదలైనవి)
  2. సుషిర వాద్యాలు : గాలి (Wind) వాద్యాలు లేదా ఊది వాయించేవి (ఉదా: వేణువు, సన్నాయి, కొమ్ము, నాదస్వరం, షహనాయ్, శంఖువు, నరశింగ్ మొదలైనవి)
  3. అవనద్ధ వాద్యాలు : చర్మాన్ని ఉపయోగించి వాటిని కొట్టి వాయించేవి (ఉదా: మృదంగం, డోలు, ఢమరుకం, మద్దెలు, తబలా, తప్పెట, దుందుభి, నగారా, డోలక్, పంచముఖ వాద్యం మొదలైనవి)
  4. ఘన వాద్యాలు : ఘనం అనగా గట్టిగా ఉండేవి. ఇవి తాళము ననుసరించు వాద్యములు (ఉదా: తాళాలు, గంటలు, గజ్జెలు, ఘటం, చిరుతలు, మోర్సింగ్ మంజిర మొదలైనవి)

ఇవి కూడా చూడండి[మార్చు]