సంతృప్త కొవ్వు ఆమ్లం
కొవ్వు ఆమ్లం లోని హైడ్రొకార్బను గొలుసులోని కార్బను-కార్బనుల మధ్య ఎటువంటి ద్విబంధం లేని కొవ్వుఆమ్లంలను సంతృప్త కొవ్వుఆమ్లం (Saturated Fatty Acid) లందురు. కొవ్వుఆమ్లం ఒక చివర మిథైల్(CH3), రెండో చివర కార్బొహైడ్రొక్షిల్ (COOH) వుండి, ప్రతి కార్బను రెండు హైడ్రొజనులతో, రెండుకార్బనులతో ఎకబంధం కల్గివుండును. సంతృప్త కొవ్వుఆమ్లాలు శాకనూనెల కన్న జంతుదేహ కొవ్వులలో అధికంగా వుండును. ఆలాగే క్షీరదంల పాలలో కూడా అధికమొత్తంలో వుండును.
విషయ సూచిక |
[మార్చు] సంతృప్త ఫ్యాటి ఆమ్లములు
[మార్చు] 1. బుట్రిక్ ఆసిడ్:
బుట్రిక్ ఆమ్లం (Butyric acid) నాలుగు కార్బనులను కలిగివున్నది. క్షీరదాల (mammals) పాలలలో 2-4% వరకు వుండును.
| సౌష్టవ ఫార్ములా | CH3(CH2)2COOH |
| అణుఫార్ములా | C4H8O2 |
| అణుభారము | 88.11 గ్రాం./మోల్ |
| సాంద్రత | 959.5 గ్రాం./లీ |
| మెల్టింగ్‌పాయింట్ | -7.90C |
| బాయిలింగ్ పాయింట్ | 163.50C |
| స్నిగ్ధత | 0.1529cp |
| (auto ignition temparature) | 520C |
బుట్రిక్ ఆసిడ్ నీటిలో కలుస్తుంది. 'బుటిరో' అనగా వెన్న (Butter) అని అర్ధము. యిది వెన్నలో ఎక్కువ గా వుండటం వలన దీనికి బుట్రిక్ ఆసిడ్ అనే పేరు వచ్చినది. బుట్రిక్ ఆసిడ్ వెగటు వాసన (unpleasant smell), రుచి (taste) కలిగి వుండును. నీటిలో, ఇధనోల్ (ethanol). మరియు ఈధరులో కరుగును. బుటిక్ ఆసిడ్ 2-మిథైల్ ప్రొపనొయిక్ ఆసిడ్ (2-methyl pro panoic acid) అనే ఐసోమర్ రూపములో కూడా లభిస్తుంది. బుట్రిక్ ఆసిడ్ ను బుటనోట్ యిస్టరుల తయారిలో ఉపయోగిస్తారు.
[మార్చు] 2. కాప్రోయిక్ ఆమ్లం
కాప్రోయిక్ ఆమ్లం (Caproic acid) 6 కార్బనులను కలిగివున్న సంతృప్త కొవ్వు ఆమ్లం.
| పార్ముల | CH3(CH2)4COOH. |
| శాస్త్రీయ నామము | హెక్సానొయిక్ ఆసిడ్(hexanoic acid) |
| అణుభారము | 116.158గ్రాం./మోల్ |
| సాంద్రత(density) | 920గ్రాం./లీ |
| మెల్టింగ్‌పాయింట్ | -3.40C |
| బాయిలింగ్‌పాయింట్ | 202-2030C |
కాప్రొయిక్ ఆసిడ్ పాల కొవ్వులలో 1-3% వరకు, కొబ్బరినూనె, మరియు పామ్‌కెర్నల్ నూనెలలో3-10% వరకు వుండును. లాటిన్ భాషలో కాప్రిక్ అనే పదము మేకకు (Goat) సంభంధించిన పదము. కాప్రిక్ ఆసిడ్ లూ మేకపాల వాసన కలిగి వుండటం వలన 6-10 కార్బనులను కలిగిన ఫ్యాటి ఆమ్లముల పేర్లు 'కాప్రి'తో మొదలగును. మేకపాలలో6-10 కార్బనులున్న ఫ్యాటి ఆసిడ్ లు 15% వరకు వున్నాయి. ఈ ఫ్యాటి ఆమ్లముల చవణములను (salts), ఈస్టరులను హెక్షనొఎట్స్ (hexanoates) కాప్రొఏట్స్ (caproates) అందురు.
[మార్చు] 3. కాప్రిలిక్ ఆమ్లం
CH3(CH2)6COOH కాప్రిలిక్ ఆమ్లం (Caprylic acid) 8 కార్బనులను కలిగి వున్న సంతృప్త ఫ్యాటి ఆమ్లం.
| శాస్త్రీయ నామము | ఆక్టనొయిక్(octanoic)ఆసిడ్. |
| ఆణుపార్ములా | C8H16O2, |
| అణుభారము | 154.21 గ్రాం./మోల్ |
| సాంద్రత | 910గ్రాం./లీ |
| మెల్టింగ్‌పాయింట్ | 16.70C |
| బాయిలింగ్‌పాయింట్ | 2370C |
ఈ ఆమ్లము రంగులేని జిడ్డు (oily) ద్రవము. క్షీరదాల పాలలో 3-6%, కొబ్బరి, మరియు పామ్‌కెర్నల్ నూనెలలో 3-5% వరకు వున్నది. ఈ ఫ్యాటి ఆసిడ్ జిడ్డులా వుండటం వలన నీటిలో అంతగా కరుగదు. కాప్రిలిక్ ఆసిడ్ల ఈస్టరులను పరిమళ ద్రవ్యాల (perfumery) తయారి మరియు రంగుల (dye) తయరిలో వాడెదరు. ఆ ఆసిడును క్రీమినాశినిగా (disinfectant), మరియు ఆల్గే, ఫంగస్ శీలింధ్ర నాశినిగా కూడా ఉపయోగిస్తారు.
[మార్చు] 4. కాప్రిక్ ఆమ్లం
CH3(CH2)8COOH
కాప్రిక్ ఆమ్లం (Capric acid) 10 కార్బనులను కలిగి వున్నది.
| శాస్త్రియనామము | డెకనొయిక్(decanoic)ఆసిడ్. |
| అణుపార్ములా | C10H20O2. |
| అణుభారము | 172.26 గ్రాం.మోల్. |
| సాంద్రత | 893 గ్రాం./లీ |
| మెల్టింగ్‌పాయింట్ | 31.60C |
| బాయిలింగ్‌పాయింట్ | 269.0C |
నీటిలో కరగదు. ఘాటైన వాసనతో స్పటిక (crystal)రూపములో వుండును. ఆ ఫ్యాటి ఆమ్లము కొబ్బరి, పామ్ కెర్నల్ నూనెలలో 4-8% వరకు, క్షీరదపాలలో 2-4% వరకు లభించును. మిగత నూనెలలో అంతగా కన్పించదు. ఈమ్ (elm) చెట్టు విత్తన నూనెలో40-50% వరకు వున్నది. కాప్రిక్ ఆసిడ్ ను పరిమళ ద్రవ్యాల (perfumes), కందెనల (lubricants), రంగుల (dyes), రబ్బరు, ప్లాస్టిక్, మరియు ఔషదాల (pharmaceuticals) తయారిలో ఉపయోగిస్తారు.
[మార్చు] 5. లారిక్ ఆమ్లం
CH3(CH2)10COOH లారిక్ ఆమ్లం (Lauric acid) 12 కార్బనులను కలిగి వున్న సంతృప్త కొవ్వు ఆమ్లం.
| శాస్త్రీయ నామము | డొడెకనొయిక్ ఆసిడ్(dodecanoic acid). |
| అణుఫార్ముల | C12H24O2 |
| అణుభారము | 200.317 గ్రాం./మోల్ |
| సాంద్రత | 880గ్రాం./లీ |
| మెల్టింగ్‌పాయింట్ | 43.20C |
| బాయిలింగ్‌పాయింట్ | 298.90C |
బేఆయిల్ (bay oil) వాసన కలిగి, తెల్లని పౌడరు రూపములొ వుండును. చాలా నూనెలలో, కొవ్వులలో ప్రముఖముగా కన్పించె మూడు సంతృప్త ఫ్యాటి ఆమ్లములలో లారిక్ ఆసిడ్ ఒకటి. మిగతా రెండు పామిటిక్ మరియు స్టియరిక్ ఆసిడ్‌లు. లారెల్ (Laurel) కుటుంబానికి చెందిన విత్తననూనెలలో ఈ ఫ్యాటి ఆసిడ్ విస్రుతముగా వుండటం వలన ఈ ఫ్యాటి ఆసిడ్‌కు లారిక్ ఆసిడ్ అనే పేరు వచ్చినది. లారిక్ ఆసిడ్ కొబ్బరి, పామ్‌కెర్నల్, మరియు బబసు (babassu butter)లో 40-50% వరకు వున్నది. అలాగే పాలలో కూడా 2-8% వరకు లభ్యము. ఆవుపాలలో2.9%, మేకపాలలో3.1% మానవపాలలో6-7% (పాలలోని కొవ్వుశాతములో) ఈ ఫ్యాటి ఆమ్లము వున్నది. లారిక్‌ఆసిడ్‌ను ప్రత్యైక వాసన, రుచి (flavourings) యిచ్చు పధార్దములలో, కొకొబట్టరు, మార్గరిన్,సబ్బులు, శ్యాంపోల తయారిలో వాడెదరు. ప్రత్యైక కందెనలు (lubricants) తయారిలో ఉపయోగించెదరు.
[మార్చు] 6. మిరిస్టిక్ ఆమ్లం
మిరిస్టిక్ ఆమ్లం (Myristic acid) 14 కార్బనులను కలిగివున్నది.
| శాస్త్రీయ నామము టెట్రాడెకనొయిక్‌ఆసిడ్ | (tetra decanoic acid) |
| అణుపార్ముల(molecular formula) | C14H28O2. |
| అణుభారము(molecular weight) | 228.37గ్రాం./మోల్ |
| సాంద్రత(Density) | 862.2 గ్రాం./లీ |
| మెల్టింగ్‌పాయింట్(melting point) | 54.40C |
| బాయిలింగ్‌పాయింట్(boiling point) | 250.50C(100mmHg ప్రసరు వద్ద) |
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే జాజికాయ (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈ ఆసిడ్‌కు మిరిస్టిక్ ఆసిడ్ అనే పేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్ ఆసిడ్ అధిక శాతము సింపుల్ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తలనూనెలో మిరిస్టిక్ ఆసిడు 15% వున్నది. అధికముగా (excess) మిరిస్టిక్ ఆసిడ్‌ను ఆహరములో తీసుకున్నఫ్లాస్మా కొలెస్ట్రాల్ పెరిగె ప్రమాదము వున్నది. సాచురెటెడ్ ఫ్యాటి ఆసిడ్లలో మిరిస్టిక్ ఆసిడ్ మాత్రమే కణమాంసకృత్తుల (cellular proteins)లో అమైడ్‌లింకు ఏర్పరచగలదు. పాలకొవ్వులలో ఈ ఆసిడ్ 8-12% వరకు వున్నది. కొబ్బరి, పామ్‌కెర్నల్ నూనెలలోకూడా 1-5% వరలు వుండును. ఈ ఫ్యాటిఆసిడ్ నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారు చెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ఆసిడ్‌ను క్షయికరణచర్య (reduction)కు గురికావించి మిరిస్టి అల్డిహైడ్ (myristyl aldehyde), మరియు మిరిస్టిల్ అల్కహల్ (myristyl alcohol)ను ఉత్పన్నం చెయుదురు.
[మార్చు] 7. పామిటిక్ ఆమ్లం
పామిటిక్ ఆమ్లం (Palmitic acid) లో 16 కార్బనులు వున్నవి.
| శాస్త్రీయనామము | హెక్సాడెకనోయిక్ ఆసిడ్,(hexadecanoic acid) |
| అణుపార్ములా | C16H32O2.లేదా CH3(CH2)14COOH |
| సాంద్రత | 853గ్రాం/లీ 620Cవద్ద |
| మెల్టింగ్‌పాయింట్ | 62.50C |
| బాయిలింగ్‌పాయింట్ | 3520C,(215C-15mm/Hg వద్ద) |
పామిటిక్ ఆసిడ్ తెల్లని స్పటీకములు (crystals)గా వుండును. పామ్ ఆయిల్‌లో ఈ ఫ్యాటి్‌ఆసిడ్ 45-50% వరకు వుండటం వలన ఈ ఆసిడ్‌ను పామిటిక్ ఆసిడ్ అని పిలిచెదరు. క్రీ.శ.1840లో మొదటగా ఎడ్మండ్ ఫ్రెమి (edmond fremy) ఈ ఆసిడ్‌ను పామ్ ఆయిల్‌లో గుర్తించాడు. అన్నినూనెలలో ఎంతో కొంత శాతము(5-10%) కన్పించె సంతృప్త ఫ్యాటి్‌ఆసిడ్ పామిటిక్ ఆసిడ్. కొబ్బరి, పామ్‌కెర్నల్ నూనెలలో వున్నది. లార్డ్ (lard), టాలో(tallow), మరియు కొకొబట్టరు (cocoa butter) లలో25-45% వరకు వున్నది. సముద్ర జల జీవుల (marine) కొవ్వులలో కూడా అల్పస్దాయిలో పామిటిక్ ఆసిడ్ను గుర్తించడం జరిగినది. వేరుశనగ (peanut)), సోయాబీన్ (soya bean), మొక్కజొన్న (corn) తవుడు (Rice bran) పత్తిగింజల (cotton seed) నూనెలలో10-20% వరకు ఈ ఫ్యాటి ఆసిడ్ కలదు. లిపొజెనెసిస్ (lipogenesis) అనగా ఫ్యాటీమలముల ఉత్పన్న సమయములో మొదట పమిటిక్ ఆసిడ్ ఏర్పడి, దానినుండి పొడవైన హైడ్రొకార్బను గొలుసు (long chained hydrocarbons) వున్న ఫ్యాటిఆసిడులు 'మలొనిల్్‌కొ ఎంజైమ్' (malonyl-CoA) చర్య వలన తయారు అగును. జీవొత్పత్తి (biosynthesis) సమయములో అసెటైల్ కొ ఎంజైమ్ ( acetyl-CoA)నుండి ఉత్పత్తి అయిన మలొనిల్ కొ ఎంజైమ్ ఫ్యాటిఆమలముల హైడ్రొకార్బను గొలుసు (hydrocarbonchain)కు మిధైలెట్ (CH2) గ్రూపును చేర్చి ఫ్యాటిఆమ్లముల ఛైన్‌పొడవును పెంచును. పామిటిక్ ఆసిడ్‌ను క్షయికరించిన సెటైల్ అల్కహల్ (cetyl alchol) ఏర్పడును. పామిటిక్ ఆసిడ్ లవణములను (salts), ఈస్టరులను పామిటెట్స్ (palmitates) అందురు.
[మార్చు] 8. స్టియరిక్ ఆమ్లం
స్టియరిక్ ఆమ్లం (Stearic acid) 18 కార్బనులను కలిగివున్న సంతృప్త ఫ్యాటి ఆసిడ్.
| శాస్త్రీయ నామము | అక్టడెకనొయిక్ ఆసిడ్ (octadecanoic) |
| అణుపార్ముల | C18H36O2,లేదా CH3(CH2)16COOH |
| అణుభారము | 284.48 గ్రాం/మోల్ |
| సాంద్రత | 847గ్రాం/లీ(700Cవద్ద) |
| మెల్టింగ్‌పాయింట్ | 69.60C |
| బాయిలింగ్‌పాయింట్ | 3830 C |
గ్రీకులో స్టియరో అనగా టాలో (tallow) అని అర్దము. దీనిని మొదటగా టాలో లో గుర్తించడం వలన శ్తియరిక్ ఆసిడ్ ఆనే పేరు స్దిరపడినది. స్ట్యరిక్ ఆసిడ్ మైనము (wax) లాంటి ఘన (solid ) రూపములో వుండును. స్టియరిక్ ఆసిడ్ కూడా పలు నూనెలలో జంతు కొవ్వు (animal fat) లలో తప్పనిసరిగా వుండు ఫ్యాటి ఆసిడ్. శాకనూనెలలో (vegetable oils) 1-5% వున్నది. కొకొ (cocoa), షీయా (shea) బట్టరు ఫ్యాట్‌లలో 28-45% వరకు వున్నది. 18 కార్బనులను కలిగి వున్న అసంతృప్త ఫ్యాటి ఆసిడ్‌లను పూర్తిగా హైడ్రొజనెసన్ (Total hydrogenation) చేసినప్పుడు అవి స్టియరిక్ ఆసిడ్ గా మార్పుచెందును. స్టియరిక్‌ఆసిడ్‌ను కొవ్వొత్తులు (candles), సబ్బులు, ప్లాస్టికులు, సౌందర్య లేపనము (cosmetics)లు, షీవింగ్ క్రీములు తయారుచెయ్యుటకు ఉపయోగిస్తారు. బాణాసంచ (fire works) తయారిలోవాడు అల్యుమినియం, ఐరన్ లోహాలు ఆక్షీకరణ చెందకుండ ఎక్కువకాలము నిల్వవుండుటకై పైపూతగా స్టియరిక్ ఆసిడ్ను ఉపయోగిస్తారు. ప్లాస్టరు కాస్టింగ్‌లో స్టియరిక్ ఆసిడ్‌ను పార్టింగ్ కాంపౌండ్ (parting com pound)గా వాడెదరు. ఇంజెక్షను మౌల్డింగ్్‌లో (injection moulding), సెరమిక్్ పౌడరును (ceramic powder)ను ప్రెస్సింగ్ చెయ్యుటకు స్టియరిక్ ఆసిడ్‌ను లూబ్రికెంట్‌గా వాడెదరు. అలాగే మిఠాయి (candy),మరియు చాకోలెట్‌ల ల తయారిలో కూడా స్టియరిక్ ఆసిడ్ను ఉపయోగిస్తారు.
[మార్చు] 9. అరచిడిక్ ఆమ్లం
అరచిడిక్ ఆమ్లం (Arachidic acid) 20 కార్బనులను కలిగివున్నది.
| శాస్త్రీయనామము | ఎయ్‌కొసనొయిక్ ఆసిడ్ (eicosanoic acid) |
| అణుపార్ములా | C20H40O2లేదాCH3(CH2)18COOH |
| అణుభారము | 312.5గ్రాం/మోల్ |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 75.40C |
ఈ ఫ్యాటీఅమ్లము అపరాల ((legumes) కు చెందిన నూనెలలొ కన్పించును. వేరుశెనగ నూనెలో1-2% వరకు వున్నది.
[మార్చు] 10. బెహెనిక్ ఆమ్లం
బెహెనిక్ ఆమ్లం (Behenic acid) 22 కార్బనులను కలిగివున్న సంతృప్త ఫ్యాటి ఆమ్లం.
| శాస్త్రీయనామము | డొకసనొయిక్‌ఆసిడ్( docosanoic acid) |
| మోలిక్యులర్‌పార్ముల | C22H44O2 లేదా CH3(CH2)20COOH |
| అణుభారము | 340.58 గ్రాం/మోల్ |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 800C |
| మరుగు ఉష్ణోగ్రత | 3060C |
తెల్లగా లేదా క్రీమ్ రంగులో స్పటిక ఋపములో లేదా పౌడరు రూపములో వుండును. ఈ ఫ్యాటి ఆసిడ్ను మొదటగా బెహెన్ ట్రీ (moringo oleifera) ఆయిల్‌లో గుర్తించారు. వేరుశనగ, ఆవాలు (mustard) నునెలో 1-2% వరకు గుర్తించారు. బెహెనిక్ అసిడ్ ను హెయిర్ కండిషనరులలో ఉపయోగిస్తారు.
[మార్చు] 11. లిగ్నోసెరిక్ ఆమ్లం
లిగ్నోసెరిక్ ఆమ్లం (Lignoceric acid) 24 కర్బనులను కలిగివున్న ఫ్యాటి ఆమ్లం.
| శాస్త్రీయనామం | టెట్రకొసనొయిక్‌ఆసిడ్. |
| ఆణుఫార్ములా | C23H47COOH |
| అణుభారం | 368.63 |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 84.20C |
వేరుశనగ నూనెలో1.1-2.2% వరకు వుండును. లిగ్నిన్‌ను తయారుచెయ్యునప్పుడు ఉప ఉత్పత్తిగా, లిగ్నొసెరిక్ ఆసిడు ఏర్పడును. అల్కహలసిస్ ద్వారా లిగ్నొసెరిల్ అల్కహల్ తయారుచేయుదురు.
[మార్చు] సంతృప్త కొవ్వు ఆమ్లాల జాబితా
| Common Name | Systematic Name | Structural Formula | Lipid Numbers |
|---|---|---|---|
| Propionic acid | Propanoic acid | CH3CH2COOH | C3:0 |
| Butyric acid | Butanoic acid | CH3(CH2)2COOH | C4:0 |
| Valeric acid | Pentanoic acid | CH3(CH2)3COOH | C5:0 |
| కాప్రోయిక్ ఆమ్లం | Hexanoic acid | CH3(CH2)4COOH | C6:0 |
| Enanthic acid | Heptanoic acid | CH3(CH2)5)COOH | C7:0 |
| కాప్రిలిక్ ఆమ్లం | Octanoic acid | CH3(CH2)6COOH | C8:0 |
| Pelargonic acid | Nonanoic acid | CH3(CH2)7COOH | C9:0 |
| కాప్రిక్ ఆమ్లం | Decanoic acid | CH3(CH2)8COOH | C10:0 |
| Undecylic acid | Undecanoic acid | CH3(CH2)9COOH | C11:0 |
| లారిక్ ఆమ్లం | Dodecanoic acid | CH3(CH2)10COOH | C12:0 |
| Tridecylic acid | Tridecanoic acid | CH3(CH2)11COOH | C13:0 |
| మిరిస్టిక్ ఆమ్లం | Tetradecanoic acid | CH3(CH2)12COOH | C14:0 |
| Pentadecylic acid | Pentadecanoic acid | CH3(CH2)13COOH | C15:0 |
| పామిటిక్ ఆమ్లం | Hexadecanoic acid | CH3(CH2)14COOH | C16:0 |
| Margaric acid | Heptadecanoic acid | CH3(CH2)15COOH | C17:0 |
| స్టియరిక్ ఆమ్లం | Octadecanoic acid | CH3(CH2)16COOH | C18:0 |
| Nonadecylic acid | Nonadecanoic acid | CH3(CH2)17COOH | C19:0 |
| Arachidic acid | Eicosanoic acid | CH3(CH2)18COOH | C20:0 |
| Heneicosylic acid | Heneicosanoic acid | CH3(CH2)19COOH | C21:0 |
| బెహెనిక్ ఆమ్లం | Docosanoic acid | CH3(CH2)20COOH | C22:0 |
| Tricosylic acid | Tricosanoic acid | CH3(CH2)21COOH | C23:0 |
| లిగ్నోసెరిక్ ఆమ్లం | Tetracosanoic acid | CH3(CH2)22COOH | C24:0 |
| Pentacosylic acid | Pentacosanoic acid | CH3(CH2)23COOH | C25:0 |
| Cerotic acid | Hexacosanoic acid | CH3(CH2)24COOH | C26:0 |
| Heptacosylic acid | Heptacosanoic acid | CH3(CH2)25COOH | C27:0 |
| Montanic acid | Octacosanoic acid | CH3(CH2)26COOH | C28:0 |
| Nonacosylic acid | Nonacosanoic acid | CH3(CH2)27COOH | C29:0 |
| Melissic acid | Triacontanoic acid | CH3(CH2)28COOH | C30:0 |
| Henatriacontylic acid | Henatriacontanoic acid | CH3(CH2)29COOH | C31:0 |
| Lacceroic acid | Dotriacontanoic acid | CH3(CH2)30COOH | C32:0 |
| Psyllic acid | Tritriacontanoic acid | CH3(CH2)31COOH | C33:0 |
| Geddic acid | Tetratriacontanoic acid | CH3(CH2)32COOH | C34:0 |
| Ceroplastic acid | Pentatriacontanoic acid | CH3(CH2)33COOH | C35:0 |
| Hexatriacontylic acid | Hexatriacontanoic acid | CH3(CH2)34COOH | C36:0 |
[మార్చు] మూలాలు
- 1. A. E. Bailey's 'industrial oil & fat products