సంతోషం (2002 సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సంతోషం
దర్శకత్వం దశరధ్
నిర్మాత కె. ఎల్. నారాయణ
రచన గోపీ మోహన్
సంగీతం ఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణం ఎస్. గోపాల్ రెడ్డి
కూర్పు కె.వి.కృష్ణారెడ్డి
స్టూడియో అన్నపూర్ణా స్టూడియోస్
సుప్రీం ఆడియో
విడుదలైన తేదీ 9 మే 2002
నిడివి 150 నిమిషాలు
దేశం భారత్
భాష తెలుగు

సంతోషం 2002 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్ర సంగీతం మంచి ప్రేక్షకాదరణ పొందింది.

కథ[మార్చు]

కార్తీక్ (అక్కినేని నాగార్జున), ఊటీ లో స్థితిమంతుడైన ఒక ఆర్కిటెక్ట్. అతడు పద్మావతి (గ్రేసీ సింగ్) తో ప్రేమలో పడతాడు. అతను ప్రేమకు పచ్చజెండా ఊపడానికి ఆమె కొంచెం సమయం తీసుకుంటుంది. పద్మావతికి ఒక అందమైన చెల్లి (చిన్నాన్న కూతురు) భాను (శ్రియా సరన్) ఉంటుంది. వీరి ప్రేమకు పద్మావతి తండ్రి రామచంద్రయ్య (కె.విశ్వనాథ్) అంగీకరించడు. తను ఎంపికచేసిన అబ్బాయినే వివాహమాడమని పద్మావతిని ఆదేశిస్తాడు. దీనితో పద్మావతి ఇంటి నుండి పారిపోయి కార్తీక్ ని వివాహం చేసుకుంటుంది. కానీ తన తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందడానికి తహతహలాడుతుంటుంది. వీరు న్యూజిలాండ్ వెళ్ళిపోయి అక్కడే స్థిరపడిపోతారు. వీరికి ఒక అబ్బాయు లక్కీ కలుగుతాడు. తర్వాత జరిగే ఒక ప్రమాదంలో పద్మావతి చనిపోతుంది. రామచంద్రయ్య వారిది ఉమ్మడి కుటుంబం. వీరి కుటుంబంలో జరిగే ఒక వివాహ వేడుకకు కార్తీక్, పద్మావతి లను కూడా ఆహ్వానించాలను కొందరు ప్రతిపాదిస్తారు. వారి కోరిక ప్రకారం వివాహానికి వచ్చిన కార్తీక్ కి మిశ్రమ స్పందన ఎదురవుతుంది. అందరూ అతడిని ఇష్టపడినా రామచంద్రయ్య మాత్రం మాట్లాడడు. కార్తీక్ తన మంచి స్వభావంతో రామచంద్రయ్య మనసును గెలుచుకోగలుగుతాడు. దీనితో అతడిని అల్లుడిగా అంగీకరిస్తాడు. ఈ క్రమంలో భాను, కార్తీక్ ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. కానీ భాను ను పవన్ (ప్రభుదేవా) ప్రేమిస్తుంటాడు. చివరికి భాను ఎవరిని పెళ్ళాడింది అనేది ముగింపు.

హాస్య సన్నివేశాలు[మార్చు]

  • కోట శ్రీనివాసరావు మరియు కన్నెగంటి బ్రహ్మానందం ల మధ్య హాస్య సన్నివేశం చాలా బాగుంటుంది. ఒక పార్టీలో ఇద్దరూ కలిసినప్పుడు కోట గురించి బ్రహ్మానందం ఒకే డైలాగ్ ను ఒక పదిసార్లు వివిధ మోడ్యులేషన్ తో చెప్పి అందర్నీ నవ్విస్తాడు. "He is very strong man. మీరు ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ కాలంలో చించేశేవారు" అనేది ఆ డైలాగు. ఇది చెబుతున్నప్పుడు వినేవారిలో ఒకడు చెవిటివాడు; అప్పుడు బ్రహ్మానందం ఎక్స్‌ప్రెషన్ అల్టిమేట్ గా ఉంటుంది. కడుపుబ్బ నవ్వుతాము.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]