సంస్కృతము

వికీపీడియా నుండి
(సంస్కృత భాష నుండి దారిమార్పు చెందింది)
సంస్కృతము
संस्कृतम् saṃskṛtam 
ఉచ్ఛారణ: సంస్కృతం
మాట్లాడే దేశాలు: భారతదేశం
మాట్లాడేవారి సంఖ్య: 2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 14,135 మంది సంస్కృతాన్ని అనర్గళంగా మాట్లాడగలరు.[1]
భాషా కుటుంబము:
 Indo-Iranian
  Indo-Aryan
   సంస్కృతము 
వ్రాసే పద్ధతి: దేవనాగరి (de facto), various బ్రాహ్మీ లిపి-based scripts, and Latin alphabet 
అధికారిక స్థాయి
అధికార భాష: భారతదేశ అధికారిక భాషలు
నియంత్రణ: అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1: sa
ISO 639-2: san
ISO 639-3: san
Indic script
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...
Phrase sanskrit.png

సంస్కృతము (संस्कृतम्) భారతదేశానికి చెందిన ప్రాచీన భాష మరియు భారతదేశ 23 అధికారిక భాషలలో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మహేశ్వర సూత్రములందురు. సంస్కృతం హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ప్రధాన భాష. నేపాల్లో కూడా సంస్కృతానికి భారతదేశములో ఉన్నటువంటి స్థాయే కలదు. జనాభాలెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవారి జనాభా: * 1971-->2212 * 1981-->6106 * 1991-->10000 * 2001-->14135.
సంస్కృతం అంటే సంస్కరించబడిన, ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పడిన అని అర్థం. సంస్కృతమునకు అమరవాణి, దేవభాష, సురభాష, గైర్వాణి మొదలగు పేర్లు కలవు. శౌరసేని, పైశాచి, మాగధి మొదలగు ప్రాకృత భాషలు కూడా సంస్కృతము నుండియే పుట్టినవి. సంస్కృతమునందు ఏకవచనము, ద్వివచనము, బహువచనము అను మూడు వచనములు కలవు. సంస్కృతమునందు నామవాచకములను విశేష్యములనియు శబ్దములనియును క్రియాపదముల యొక్క మూలరూపములను ధాతువులని వ్యవహరింతురు. సంస్కృతాన్ని మొదట సరస్వతీ లిపిలో రాసేవారు. కాలక్రమేణ ఇది బ్రాహ్మీ లిపి గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత దేవనాగరి లిపిగా పరివర్తనం చెందింది. ఇదే విధంగా తెలుగు లిపి, తమిళ లిపి, బెంగాలీ లిపి, గుజరాతీ లిపి, శారదా లిపి మరియు అనేక ఇతర లిపులు ఉద్భవించాయి. క్రీయా పదముల యొక్క లింగ, వచన, విభక్తులు నామవాచకమును అనుసరించి ఉండును.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] సాహిత్యం

ప్రాచీన జ్ఞాన సంపదయైన వేదాలు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మను స్మృతి, వాస్తు శాస్త్రం, అర్థ శాస్త్రం మొదలైనవన్నీ సంస్కృతంలో రాయబడినవే. ఇంకా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, శూధ్రకుడు రచించిన మృచ్చకటిక, భాసుడు రచించిన స్వప్న వాసవదత్తం, శ్రీహర్షుడు రాసిన రత్నావళి, వాత్సాయనుడు రాసిన కామసూత్ర మొదలైనవి సంస్కృతంలో ప్రసిద్ధి చెందిన గ్రంధాలు.

[మార్చు] చూడండి

[మార్చు] మూలాలు

  1. 2001 భారత జనాభా లెక్కలు[1]

[మార్చు] బయటి లింకులు

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Sanskrit Documents
Primers
Grammars


"http://te.wikipedia.org/w/index.php?title=సంస్కృతము&oldid=723095" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు