సత్యమేవ జయతే

వికీపీడియా నుండి

సత్యమేవ జయతే (ఆంగ్లం : "Satyameva Jayate") (సంస్కృతం : सत्यमेव जयते) : "సత్యం మాత్రమే జయిస్తుంది") ఇది భారత జాతీయ నినాదం. ఇది దేవనాగరి భాషలో యున్నది. ఈ నినాదాన్ని ఉత్తరప్రదేశ్, సారనాధ్ లోని అశోకుడి ఏక సింహ రాజధాని నుండి సేకరించారు. ఈ నినాద మూలాలు ముండక ఉపనిషత్తు లోని మంత్రం 3.1.6 నుండి గ్రహించారు. ఈ మంత్రం ఇలా సాగుతుంది.


సత్యమేవ జయతే నానృతమ్
సత్యేనా పాంథా వితాతో దేవాయాన॰
యేనా క్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
యాత్రా తత్ సత్యాస్య పరమం నిధానమ్


అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.
  • ఖురాన్ సూక్తి "నస్‌రుమ్ మినల్లాహి వ ఫతహ్ ఉన్ ఖరీబ్", సత్యం (అల్లాహ్) యొక్క జయం, అతి దగ్గరలో వుంటుంది. (ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది)
  • చెక్ రిపబ్లిక్ దేశ నినాదం "ప్రావ్‌దా విటేజీ" (సత్యమే ఉంటుంది). (ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది.)
పేజీకి సంభందించిన లింకులు