సదుం
| ?సదుం మండలం చిత్తూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | సదుం |
| జిల్లా(లు) | చిత్తూరు |
| గ్రామాలు | 13 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
33,771 (2001) • 16984 • 16787 • 63.65 • 76.57 • 50.70 |
సదుం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. సదుం అనె ఒక బ్ర్రితిషర్ ఈ ప్రాంతం లో అభివృద్ధి పనులు చేపట్టడం వలన ఈ పేరు వచ్చింది. తక్కువ వర్ష పాత ప్రాంతం అవటం వలన ఇక్కడ మామిడి తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నివసించే ప్రజలు ఎక్కువగా రైతులు మరియు చిన్న వ్యాపారులు. ఇక్కడ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాల నుండి రైతులు పండించిన కూరగాయలు ఇతరాత్ర సరుకులు కొనటం అమ్ముగోలు చేయటం పరిపాటి. ఇక్కడికి దగ్గర లో గొంగివారిపల్లె అనే గ్రామం లో ప్రసిద్ధి గాంచిన పీపల్ గ్రోవే అనే అంతర్జాతీయ పాఠశాల కలదు. ఈ పాఠశాల ప్రారంభోత్సవం లో మాజీ రాష్ట్రపతి శ్రీ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ గారు పాల్గొన్నారు.
దేవాలయాలు [మార్చు]
- శ్రీ చేన్నకేసవ స్వామి దేవాలయం - ఈ దేవాలయం చాల పురాతనమైనదిగా అభివర్ణిస్తారు . దేవాలయ నిర్మాణము కూడా పురాతన కట్టడాలను తలపిస్తుంది.
- శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం - ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయం సదుం లోని గార్గేయ నది పక్కనే ఉంటుంది.
- శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం - ఈ దేవాలయం సదుం దగ్గర ఎర్రతివారి పల్లె లో కలదు.ఈ దేవాలయాన్ని సదుం శబరిమల గా అభివర్ణిస్తారు . ఏటా శబరిమల కి ఇరుముడి కోసం తరలి వేల్లలేనటువంటి భక్తులు ఈ దేవాలయం ని సందర్సిన్చుకుంటారు . ఈ దేవాలయ కట్టడం శబరిమల దేవస్థానాన్ని పోలినట్టు ఉండటం వలన ప్రసిద్ది గాంచింది.
మండలంలోని గ్రామాలు [మార్చు]
- ఊటుపల్లె
- చింతమాకులపల్లె
- పాలమంద
- కంభంవారిపల్లె
- తాటిగుంటపాళెం
- సదుం
- అమ్మగారిపల్లె
- గొంగివారిపల్లె
- తిమ్మనాయనిపల్లె
- నడిగడ్డ
- ఎర్రతివారిపల్లె
- బూరగమండ
- చెరుకువారిపల్లె
- జోగివారి పల్లె
|
|||||||