సప్తస్వరాలు

వికీపీడియా నుండి
భారతీయ సంగీతము
భారతీయ సాంప్రదాయ సంగీతము
కర్ణాటక సంగీతము
వాగ్గేయకారులు
కర్ణాటక సంగీత వాగ్గేయకారులు
గాయకులు
కర్ణాటక సంగీత గాయకులు
హిందుస్థానీ సంగీతము
వాగ్గేయకారులు
హిందుస్థానీ సంగీత వాగ్గేయకారులు
గాయకులు
హిందుస్థానీ సంగీత గాయకులు
ఆధునిక సంగీతము
చలన చిత్ర సంగీతము
భారతీయ జానపద సంగీతము
Concepts
శృతి
రాగము
మేళకర్త
కాటపయాడి సంఖ్య
స్వరం
తాళము
ముద్రలు

భారతీయ సంగీతంలో సప్తస్వరాలు: స, రి, గ, మ, ప, ధ, ని. వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పక్షి కూత లేక జంతువు అరుపు నుంచి పుట్టినది.

'స ' షడ్జమము, 'రి ' రిషభం, 'గ ' గాంధారం, 'మ ' మధ్యమము, 'ప ' పంచమం, 'ద 'దైవదం, 'ని ' నిషధం, అని సప్తస్వరాల పేర్లు. ఈ సప్త స్వరాలను అనేక రీతులు తప్పని మేళవించడం వల్ల రాగాలు ఏర్పడతాయి. అయితే ఒక రాగంలో సప్త స్వరాలు తప్పని సరిగా ఉందాలన్న నియమం లేదు.

సాధారణంగా ఒక రాగంలో కనీసం ఐదు స్వరాలు ఉండాలన్న ఒక నియమం ఉంది. కానీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నాలుగు స్వరాలనే వినియోగించుకోని రాగాలను కూర్చారు.ఈ రాగాల కూర్పుతోనే భారతీయ సంగీతం, సంగీత ప్రపంచంలో తనదైన ప్రత్యకతను నిలుపుకోగల్గుతున్నదని పరిశీలకుల భావన. స్వరాలకు ఆధారం శృతులు. ,శృతి అంటే ధ్వని విశేషం.సంగీతానికి పనికి వచ్చే శృతులు 22. వీనికి సిద్ధ, ప్రభావతి, కాంత, సుప్రభ, శిఖ, దీప్తిమతి, ఉగ్ర, హలది, నివ్రి, ధీర, క్షాంతి, విభూతి, మాలని, చపల వంటి పేర్లున్నాయి. పాశ్ఛాత్య సంగీతంలో 12 శ్రుతులతో సంగీత ఉచ్చస్థితి (అష్టమ స్వరం)కి చేరుకోగా భారతీయ సంగీతంలో 22 శ్రుతులతో తారాస్థాయి చేరుకుంటుంది.


స = షడ్జమం (నెమలి క్రేంకారం)

రి = రిషభం (ఎద్దు రంకె)

గ = గాంధర్వం (మేక అరుపు)

మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

ప = పంచమం (కోయిల కూత)

ధ = ధైవతం (గుర్రం సకిలింత)

ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)


  • ఆరోహణ: తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
    • ఉదా: స రి గ మ ప ధ ని స.
  • అవరోహణ: ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
    • ఉదా: స ని ధ ప మ గ రి స.

[మార్చు] కర్ణాటక సంగీత స్వరాలు

కర్ణాటక సంగీతంలో రిషభం, గాంధారం, ధైవతం మరియు నిషాదంలో మూడు, మధ్యమంలో రెండు మరియు పంచమం, షడ్జంలో ఒక్కొక్కటి చొప్పున 12 స్వరాలు ఉన్నాయి.

స్థానము స్వరము Short name Notation Mnemonic
1 షడ్జము S sa
2 శుద్ధ ఋషభము రి R1 ra
3 చతుశ్రుతి ఋషభము రి R2 ri
3 శుద్ధ గాంధారము G1 ga
4 షట్చ్రుతి ఋషభము రి R3 ru
4 సాధారణ గాంధారము G2 gi
5 అంతర గాంధారము G3 gu
6 శుద్ధ మధ్యమము M1 ma
7 ప్రతి మధ్యమము M2 mi
8 పంచమము P pa
9 శుద్ధ ధైవతము D1 dha
10 చతుశ్రుతి ధైవతము D2 dhi
10 శుద్ధ నిషాదము ని N1 na
11 షట్చ్రుతి ధైవతము D3 dhu
11 కైసికి నిషాదము ని N2 ni
12 కాకలి నిషాదము ని N3 nu

As you can see above, Chathusruthi Rishabha and Shuddha Gandhara share the same pitch (3rd key/ position). Hence if C is chosen as Shadja, D would be both Chathusruthi Rishabha and Shuddha Gandhara. Hence they will not occur in same raga together. Similarly for two swaras each at notes 4, 10 and 11.

[మార్చు] స్వరాల అర్ధ వివరణ

ప్రతి శుద్ధ స్వరం (i.e., స, రి, గ, మ, ప, ధ, మరియు ని) సాంప్రదాయం ప్రకారం వివిధ జంతువుల కూతల నుండి ఆవిర్భవించినట్లు భావిస్తారు. కొన్నిటికి ఇతర అర్ధాలు కూడా ఉన్నాయి. ప్రతి స్వరం మన శరీరంలోని ఏడు చక్రాలతో సంధించబడ్డాయి. సప్తస్వరాలు అరోహణ పద్ధతిలో చక్రాలు కూడా అరోహణ లోనే చెప్పబడ్డాయి. కోమల స్వరాలు ఎడమవైపు చక్రాలతో (ఇడ, పింగళ, శుషుమ) సంధించబడితే శుద్ధ మరియు తీవ్ర స్వరాలు కుడివైపు చక్రలతో అనుసంధానించబడ్డాయి. అందువలన ప్రతి రాగం దానికి అనుసంధించబడిన చక్రం ప్రకారం ప్రభావం చూపుతాయి.

స్వరం వివరణ అర్ధం జంతువు చక్రం దేవుడు
షడ్జం (षड्जं) Sagar నెమలి mūlādhāra मूलाधार (anus) బ్రహ్మ
రి రిషభం (रिषभं) bull ఎద్దు svādhiṣṭhāna स्वाधिष्ठान (genitals) అగ్ని
గాంధారం (गान्धारं) Gagan మేక maṇipūra मणिपूर (solar plexus and stomach) రుద్రుడు
మధ్యమం (मध्यमं) middle క్రౌంచపక్షి anāhata अनाहत (heart and lungs) విష్ణువు
పంచమం (पंचमं) fifth కోయిల viśuddha विशुद्ध (throat) నారదుడు
ధైవతం (धैवतं) Dharti గుర్రం ājñā आज्ञा (third eye) వినాయకుడు
ని నిషాదం (निषादं) outcast/hunter ఏనుగు sahasrāra सहस्रार (crown of the head) సూర్యుడు
Wiktionary-logo-en.png
సప్తస్వరాలు గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు