సలీం దుర్రానీ

వికీపీడియా నుండి

డిసెంబర్ 11, 1934న అఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో జన్మించిన సలీం దుర్రానీ (Salim Aziz Durani) భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 1960 నుంచి 1973 మధ్య కాలంలో భారత్ తరఫున 29 టెస్టులకు ప్రాతినిధ్యం వహించాడు. అప్ఘనిస్తాన్‌లో జన్మించి టెస్ట్ క్రికెట్ ఆడిన ఏకైక క్రీడాకారుడైన[1] దుర్రానీ బ్యాటింగ్ మరియు బౌలింగ్‌లలో మంచి ప్రావీణ్యం కల ఆల్‌రౌండర్.

1961-62లో ఇంగ్లాండుతో జరిగిన టెస్ట్ సీరీస్‌లో కలకత్తా, మద్రాసు టెస్టులలో 8 మరియు 10 వికెట్లు చొప్పున పడగొట్టి భారత విజయానికి దోహదపడ్డాడు. దుర్రానీ భారత్ తరఫున 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 25.04 సగటుతో 1202 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ మరియు 7 అర్థసెంచరీలు కలవు. అతడి అత్యధిక స్కోరు వెస్ట్‌ఇండీస్ పై 1962లో సాధించిన 104 పరుగులు. బౌలింగ్‌లో కూడా 35.42 సగటుతో 75 వికెట్లు తీశాడు. అందులో ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 సార్లు, ఒకే టెస్టులో 10 వికెట్లను ఒకసారి సాధించాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 73 పరుగులకు 6 వికెట్లు.

క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ పొందిన తరువాత పర్వీన్ బాబీ సినిమాలో నటించాడు.

బయటి లింకులు [మార్చు]

మూలాలు [మార్చు]

  1. http://users.skynet.be/hermandw/cricket/testntlt.html