సవాయి
వికీపీడియా నుండి
| Image of spiral-shaped organisms responsible for causing syphilis | |
| ICD-10 | A50.-A53. |
| ICD-9 | 090-097 |
| MedlinePlus | 001327 |
| eMedicine | med/2224 emerg/563 derm/413 |
| MeSH | D013587 |
సవాయి లేదా సవాయి రోగం (ఆంగ్లం: Syphilis)[1] అనేది ఒక బాక్టీరియా వలన కలిగే అంటు వ్యాధి. ఇదొక రకమైన సుఖ వ్యాధి (sexually transmitted disease). ఇది ట్రిపనీమా పాలిడమ్ (Treponema pallidum) అనే స్పైరోకీట్ బాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ఎక్కువగా రతి ద్వారా వ్యాప్తిచెందుతుంది. అరుదుగా తల్లినుండి బిడ్డకు కూడా సంక్రమించవచ్చును. సవాయి రోగ లక్షణాలు చాలా రకాలుగా ఉండి ప్రాచీన కాలంలో వ్యాధి నిర్ధారణ కష్టంగా ఉండేది.
సవాయి రోగాన్ని చాలా సులభంగా పెనిసిలిన్ వంటి ఏంటీబయోటిక్స్ ద్వారా నయంచేయవచ్చును. వైద్యం చేయని పక్షంలో ఇది గుండె, పెద్ద రక్తనాళాలు, మెదడు, ఎముకలు, కన్ను మొదలైన అవయవాలకు సోకి ప్రాణాపాయం అయే ప్రమాదం ఉన్నది.
మూలాలు [మార్చు]
- ↑ Syphilis:సవాయి రోగం, పారిభాషిక పదకోశం, వైద్యశాస్త్రం, తెలుగు అకాడమీ,పేజీ.65
గ్యాలరీ [మార్చు]
-
Gumma of the nose due to long standing tertiary syphilis