సాగర సంగమం
| సాగర సంగమం (1983) | |
| దర్శకత్వం | కె.విశ్వనాధ్ |
|---|---|
| నిర్మాణం | ఏడిద నాగేశ్వరరావు |
| రచన | కె. విశ్వనాధ్ |
| తారాగణం | కమల్ హాసన్, జయప్రద, డబ్బింగ్ జానకి, గీత, శరత్ బాబు, ఎస్.పి. శైలజ |
| సంగీతం | ఇళయరాజా |
| నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, ఎస్.పి.శైలజ |
| గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
| ఛాయాగ్రహణం | పి.ఎస్. నివాస్ |
| నిర్మాణ సంస్థ | పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ |
| నిడివి | 160నిముషాలు |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
సాగరసంగమం, 1983లో విడుదలైన ఒక తెలుగు చిత్రము. అంతకు ముందే విశ్వనాధ్ దర్శకత్వంలో విడుదలైన శంకరాభరణం చిత్రం విజయనంతమైన నేపధ్యంలో సంగీత, నృత్య కధాత్మక చిత్రాలకు అదరణ హెచ్చింది. ప్రతిభ ఉన్నా గాని గుర్తింపు పొందని, ఒక శాస్త్రీయ నర్తకునిగా కమల్ హాసన్ నటించాడు. కాశీనాధుని విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోకమల్ హాసన్ మరియు జయప్రద జంటగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో శరత్ బాబు మరియు ప్రముఖ గాయని శైలజ నటించారు. స్వరకల్పన ఇళయరాజా. ఇది తమిళంలో "సాలంగై ఓలి" అనే పేరుతో అనువదించబడి ఆ భాషలో కూడా విజయవంతంగా నడిచింది.
విశ్వనాధ్ మరియు కమల్ హాసన్‌ల నట జీవితంలో ఈ చిత్రానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలలో ఇది ఒకటి. స్వాతిముత్యం మరియు శుభ సంకల్పం తక్కిన రెండు చిత్రాలు.
విషయ సూచిక |
కధ [మార్చు]
బాలకృష్ణ (కమల్ హాసన్) అనే పేద యువకుడు స్వయంకృషితో నాట్యం నేర్చుకొంటాడు. కూచిపూడి, భరతనాట్యం, కథక్ రీతులలో ప్రవీణుడౌతాడు. కాని వాణిజ్యం, విచ్చలవిడితనం పెచ్చుమీరిన సినిమా రంగంలో ఇమడలేకపోతాడు. అతని ప్రతిభను గుర్తించిన మాధవి (జయప్రద) అనే యువతి అతనిని ప్రోత్సహిస్తుంది. ఢిల్లీ లో మహామహుల సమక్షంలో జరిగే కార్యక్రమంలో అతని నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తుంది. కాని చివరిక్షణంలో బాలకృష్ణ తల్లి (డబ్బింగ్ జానకి) చనిపోవడంతో అతడు నాట్య ప్రదర్శన పోటీలో పాల్గొనలేకపోయాడు. అతనికి తోడుగా నిలచిన మాధవిపై అతనికి ప్రేమ మొదలౌతుంది కాని మాధవికి చిన్నప్పుడే పెళ్ళవుతుంది. ఆమె భర్త తిరిగి వస్తాడు. దాంతో బాలకృష్ణ దాదాపు దేశదిమ్మరి, తాగుబోతు అవుతాడు.
తరువాతి భాగంలో మాధవి కూతురు (శైలజ)కు బాలకృష్ణ గురువౌతాడు. నాట్య కళ గొప్పతనం గురించి ఆమెకు తెలియజేస్తాడు.ఆపై ఆమె నాట్య ప్రదర్శన పోటీలో ఆమె నర్తిస్తుంది.అప్పటికే బాలకృష్ణ ఆరోగ్యం దెబ్బతింటుంది.నాట్య ప్రదర్శన చివర్లో బాలకృష్ణ మరణించడంతో కథ ముగుస్తుంది.
పురస్కారాలు [మార్చు]
- ఇళయరాజాకు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారం వచ్చింది. అలాగే ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుని పురస్కారం లభించింది.
- ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారం లభించింది.
పాటలు [మార్చు]
- బాలా కనకమయ చేల - యస్. జానకి
- వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే - యస్.పి. శైలజ
- మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి - యస్. జానకి, బాలు
- వేదం అణువణువున నాదం - యస్.పి. శైలజ, బాలు
- ఓం నమశ్శివాయ - యస్. జానకి
- తకిట తథిమి తకిట తథిమి తందాన - బాలు
- నాద వినోదము నాట్యవిలాసము పరమపదము - యస్.పి.బాలు
పాటలు లిరిక్స్ [మార్చు]
తకిట తథిమి తకిట తథిమి తందాన
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శృతిని లయని ఒకటి చేసి
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
నరుడి బ్రతుకు నటన
ఈశ్వరుడి తలపు ఘటన
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల వయసీ వరసా
తెలుసా మనసా నీకిది తెలిసీ అలుసా
తెలిసీ తెలియని ఆశల లలలా లలలా
ఏటిలొని అలలవంటి కంటిలోని కలలు కదిపి
గుండియలను అందియలుగ చేసి
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని .........
తడిసిన పెదవుల రేగిన ఆ... ఆ...
శృతిని లయని ఒకటి చేసి
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
పలుకు రాగ మధురం నీ బ్రతుకు నాట్యశిఖరం
సప్తగిరులుగా వెలిసే సుస్వరాల గోపురం
అలరులు కురియగ నాడెనదే...
అలకల కులుకుల అలమేల్మంగా
అలరులు కురియగ నాడెనదే...
అలకల కులుకుల అలమేల్మంగా
అన్న అన్నమయ్య మాట అచ్చ తేనె తెలుగు పాట
పల్లవించు పదకవితలు పాడీ...
ఆ... ఆ...
ఆ... ఆ...
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన
తడబడు అడుగుల తప్పని .........
తడిసిన పెదవుల రేగిన ఆ... ఆ...
శృతిని లయని ఒకటి చేసి
తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయ లయల జతుల గతుల థిల్లాన