సాదా దోసె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మినప అట్లు
సాదా దోసె

దోసెలలో అన్ని రకాలకు మూలమైనది సాదా దోసె (Plain dosa).

కావలసిన పదార్ధాలు[మార్చు]

తయారుచేయు విధానం[మార్చు]

  • బియ్యం, మినప పప్పు, ఉప్పుడు నూక లను విడివిడిగా నానబెట్టాలి.
  • ఈ మూడింటిని విడిగా శుభ్రంగా కడగాలి. ఉప్పుడు బియ్యం కొంచెం నలిగాక, బియ్యం వేసి కాటుకలా రుబ్బాలి. మినుప పప్పును విడిగా రుబ్బాలి.
  • మినప పిండి, బియ్యం పిండి కలిపి తగినంత ఉప్పు వేసి ఒక కళాయి గిన్నెలో సగం వరకు వచ్చేటట్లు తీసుకొని మూత పెట్టాలి. దీనిని దోసెల పిండి అంటారు. ఇది కనీసం ఎనిమిది గంటలైనా ఊరాలి.
  • దోసెల పెనం పొయ్యి మీద వేసి బాగా కాలాక, కాస్త నూనె రాసి ఒక గరిటె దోసెల పిండి తీసుకొని పలచగా సమంగా పరచాలి. ఆ పైన చుట్టూ రెండు చెంచాలు నూనె వెయ్యాలి. 3-5 నిమిషాలు అయిన తర్వాత దోసెను అట్లకాడతో తిరగేసి, మళ్ళీ ఒక చెంచా నూనె వేసి రెండవ పక్కన కూడా బంగారు రంగు వచ్చేదాకా కాలనివ్వాలి.

చిట్కాలు[మార్చు]

  • మినప పప్పు కన్నా బియ్యం, నూక నానడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీటిని ముందు రోజు రాత్రి నాన బెట్టుకోవాలి.
  • మినప పప్పు, బియ్యం, నూకలు చాలా మెత్తగా రుబ్బాలి. గరుకుతనం ఉండకూడదు.
  • దోసెల పెనం మందంగా, మెరకగా పెద్దగా ఉండాలి. పెనం పల్లంగా ఉంటే మధ్యలో మందంగా వస్తాయి. పెనం పలచగా ఉంటే దోసె తొందరగా మాడిపోతుంది.
  • నూనె వేసిన తర్వాత పూర్తిగా కాలకుండా తిరగవెయ్యడానికి ప్రయత్నిస్తే దోసె విరిగిపోతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

సూచికలు[మార్చు]

యితర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సాదా_దోసె&oldid=3159361" నుండి వెలికితీశారు