సామర్లకోట
| ?సామర్లకోట మండలం తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | సామర్లకోట |
| జిల్లా(లు) | తూర్పు గోదావరి |
| గ్రామాలు | 17 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
1,31,548 (2001) • 65769 • 65779 • 63.49 • 67.87 • 59.13 |
సామర్లకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు శ్యామలదేవికోట. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ వూరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది పంచారామాలలో ఒకటి. దీనిని కుమార భీముడనే చాళుక్య రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. కందుకూరి వీరేశలింగం పంతులు వ్రాసిన రాజశేఖర చరిత్రం అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర వుంది.
విషయ సూచిక |
[మార్చు] భౌగోళికం
సామర్లకోట .[1] సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 9 మీటర్లు (32 అడుగులు)
[మార్చు] జనవిస్తరణ
2001 జనగణన ప్రకారం సామర్లకోట పట్టణం జనాభా 53,402. ఇందులో మగవారు 50%, ఆడువారు 50%. ఇక్కడి సగటు అక్షరాస్యత 60%. అందులో మగవారి అక్షరాస్యత 65% మరియు ఆడువారి అక్షరాస్యత 56%. మొత్తం జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోపు పిల్లలు.
[మార్చు] రవాణా
హౌరా - చెన్నై రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది. కాకినాడ నుండి జగ్గంపేట, ప్రత్తిపాడు, రాజానగరం మరియు రాజమండ్రి లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది.
[మార్చు] దర్శనీయ స్థలాలు
1. కుమరారామ మందిరం(శ్రీ భీమేశ్వరాలయం) 2. శ్రీ మాండవ నారాయణస్వామి ఆలయం 3. శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం
[మార్చు] కుమారారామ మందిరం
- ప్రధాన వ్యాసం: కుమారభీమారామము
పంచారామాలలో ఒకటయిన ఈ కుమారభీమారామము క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. మహాశివరాత్రి ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. ద్రాక్షరామ దేవాలయాన్నీ ఆయనే నిర్మించాడు. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడ ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.
ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇంకా ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.
[మార్చు] పరిశ్రమలు
- రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ వారి 220 మెగావాట్ల విద్యుత్ కేంద్రము
- నవభారత్ వెంచర్స్ వారి దక్కన్ షుగర్స్
- శ్రీ వెంకటా్రమా ఆయిల్ ఇండసీ్ట్రస్ - రైస్ బ్రాన్ నూనె తయారీ
- అంబటి సుబ్బన్న అండ్ కో - నూనె తయారీ
- పి.ఎస్. తార్పాలిన్స్ - పి.ఎస్. బ్రాండ్ తార్పాలిన్స్
1949 నుండి అభిసారిక అనే తెలుగు లైంగిక సమాచార పత్రిక ఇక్కడినుండి ప్రచురింపబడుతున్నది.
[మార్చు] ప్రముఖులు
- ప్రతివాది భయంకరాచారి - స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు.
- చాగంటి సన్యాసిరాజు - నాటకరంగం
- దర్భా వెంకట రామ శాస్త్రి (రాంషా)- రచయత, అభిసారిక పత్రిక ఎడిటర్
- సమయం వీర్రాజు - ఉపన్యాసకుడు
- డా.బేతిన వెంకటరాజు, డా. చాగంటి శ్రీరామరత్నరాజు, డా. అప్పల వెంకటశేషగిరిరావు, డా. చందలాడ అనంతపద్మనాభం, డా. దర్భా వి.ఆర్. పూషా - అభిసారిక ఎడిటర్
- చందా్రభట్ల చింతామణి గణపతి శాస్త్రి - ఆధ్యాత్మిక గురువు
- నేమాని భూషయ్య - పారిశ్రామికవేత్త
- బొడ్డు భాస్కర్రామారావు - ఎమ్.ఎల్.సి.(టి.డి.పి.)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- సామర్లకోట
- పెదబ్రహ్మదేవం
- జి. మేడపాడు
- వేట్లపాలెం
- జగ్గమ్మగారిపేట (గ్రామీణ)
- కాపవరం
- పవర
- పంద్రవాడ
- నవర
- పీ.వేమవరం
- ఉండూరు
- వల్లూరు
- పనసపాడు
- కొప్పవరం
- మామిళ్లదొడ్డి
- వెంకట కృష్ణరాయపురం
- బోయనపూడి
- మాధవపట్నం
|
|||||||