సాలార్ ‌జంగ్ మ్యూజియం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Coordinates: 17°22′17″N 78°28′49″E / 17.371426°N 78.480347°E / 17.371426; 78.480347

Hyderabadmuseum.jpg
సాలార్జంగ్ మ్యూజియం భవనం

సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము.[1] హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున గలదు. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు.

చరిత్ర[మార్చు]

1951 డిసెంబరు 16 న ఈ సంగ్రహాలయం ప్రజలకొరకు తెరవబడినది; హైదరాబాదుకు చెందిన నిజామ్ పరిపాలకుల "సాలార్ జంగ్ కుటుంబం" ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామగ్రి, కళాఖండాలు సేకరించింది. ఇందులో ఇస్లామీయ కళాఖండాలు, ప్రాచీన ఖురాన్ ప్రతులూ, నగలూ, నగిషీలూ, యుద్ధసామగ్రీ, పర్షియా తివాసీలు మొదలగునవి కలవు. ఈ సేకరణలన్నీ దాదాపు మీర్ యూసుఫ్ అలీ ఖాన్ సేకరించినవే, ఇతను సాలార్ జంగ్ III గా ప్రసిధ్ధి. కొన్ని సేకరణలు ఇతడి తండ్రియైన "మీర్ లయీఖ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ II" మరియు "నవాబ్ మీర్ తురాబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ I" కు చెందినవి.

సేకరణలు[మార్చు]

సాలార్ జంగ్ కు చెందిన నగరమహలులో 78 గదులలో 40,000 వస్తువులు గలవు. ఇందులో ప్రముఖంగా : పరదాలో యున్న "రెబెక్కా", జహాంగీర్ చురకత్తి, నూర్జహాను పండ్లుకోసే కత్తి, 12వ శతాబ్దానికి చెందిన "యాఖూతి ఉల్-మస్తామీ" యొక్క ఖురాన్ ప్రతి, గడియారం మరియు "స్త్రీ-పురుష శిల్పం" ప్రధానమైనవి.

సేకరణల్లో గ్రంధాలు, పోర్సిలీన్, తుపాకులు, ఖడ్గాలు, శిల్పాలు ప్రపంచపు నలుమూలలనుండి తెప్పించి భద్రపరచబడినవి.

భారత పార్లమెంటు, ఈ సంగ్రహాలయాన్ని "జాతీయ ప్రాముఖ్యం" గల సంగ్రహాలయంగా గుర్తించినది.

ఈ మ్యూజియం ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకూ సందర్శకులకొరకు తెరవబడి యుంటుంది. (శుక్రవారం శెలవు).

బయటి లింకులు[మార్చు]

వనరులు[మార్చు]

  1. సాలార్ జంగ్ మ్యూజియం జాలస్థలి