సాలాసర్ బాలాజీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?Salasar Balaji
Rajasthan • భారతదేశం
Salasar Balaji
అక్షాంశరేఖాంశాలు: 27°43′N 74°43′E / 27.72°N 74.71°E / 27.72; 74.71
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం Sikar
జిల్లా(లు) Churu జిల్లా

సాలాసర్ బాలాజీ (Salasar Balaji) అనేది ఒక పుణ్యక్షేత్రం, భక్తులు దీనిని భగవంతుడు హనుమాన్ కొలువైవున్న ఒక ధార్మిక ప్రదేశంగా గుర్తిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లాలో ఈ ప్రదేశం ఉంది. సాలాసర్ ధామ్ ఏడాది పొడవునా అసంఖ్యాక భారతీయ భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ ప్రతి ఏడాది చైత్ర పూర్ణిమ మరియు అశ్వినీ పూర్ణిమ రోజుల్లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తారు, ఈ వేడుకల సందర్భంగా దేవునికి జరిగే పూజల్లో 6 నుంచి 7 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఆలయం మరియు ఆలయ సంబంధ వేడుకల నిర్వహణను హనుమాన్ సేవా సమితి పర్యవేక్షిస్తుంది. ఇక్కడ బస చేయడం కోసం అనేక ధర్మశాలలు మరియు ఆహారం కోసం అనేక ఫలహారశాలలు ఉన్నాయి. శ్రీ హనుమాన్ ఆలయం సాలాసర్ పట్టణం నడిబొడ్డున ఉంది. ప్రధానపుట:- సాలాసర్ బాలాజీ

ప్రదేశం[మార్చు]

సాలాసర్ పట్టణం రాజస్థాన్‌లోని చురు జిల్లాలో జైపూర్-బీకానీర్ రహదారిపై ఉంది. ఇది సికర్ నుంచి 57 కిలోమీటర్లు, సుజన్‌గర్‌‌కు 24 కిలోమీటర్లు, లక్ష్మణ్‌గర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాలాసర్ పట్టణం సుజన్‌గర్ పంచాయితీ సమితి పరిధిలోకి వస్తుంది, రాజస్థాన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ పట్టణం నుంచి ఢిల్లీ, జైపూర్ మరియు బీకానీర్ నగరాలకు నిరంతర బస్సు సేవలు నిర్వహిస్తుంది. ఇండియన్ ఎయిర్‌లైన్స్ మరియు జెట్ ఎయిర్ పౌరవిమానయాన సంస్థలు జైపూర్‌కు విమానాలు నడుపుతున్నాయి, ఇక్కడి నుంచి సాలాసర్ పట్టణానికి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా 3.5 గంటల్లో చేరుకోవచ్చు. సుజన్‌గర్, సికర్, దిద్వానా, జైపూర్ మరియు రతన్‌గర్ రైల్వే స్టేషన్‌లు సాలాసర్ బాలాజీ ఆలయానికి సమీపంలో ఉన్నాయి. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యా సంస్థ ఉన్న పిలానీ నుంచి ఈ పట్టణం 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ - పిలానీ మధ్య మెరుగైన రోడ్డు మార్గం ఉంది, ఢిల్లీవైపు నుంచి వచ్చేవారు ఎక్కువగా ఈ మార్గం ద్వారా బాలాజీ ఆలయానికి వస్తుంటారు.

శనివారం, శ్రావణ శుక్ల-నవమి -సమ్వాత్ 1811న ఒక అద్భుతం జరిగింది. అదేమిటంటే, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఉన్న అసోటా గ్రామానికి చెందిన రైతు జింథాలా-జాత్ నాగలితో తన పొలాన్ని దున్నుతున్నాడు. హఠాత్తుగా ఆయన నాగలికి ఒక గట్టిరాయి తగిలి ప్రతిధ్వని ఏర్పడింది. రాయి తగిలిన ప్రదేశంలో ఆయన భూమిని తవ్వాడు, అక్కడ మట్టితో కప్పబడివున్న రెండు విగ్రహాలు కనిపించాయి. ఆ సమయానికి రైతు భార్య అతనికి మధ్యాహ్న భోజనం తీసుకొని వచ్చారు. తన భార్యకు ఆ రైతు విగ్రహం చూపించాడు. ఆమె చీరతో విగ్రహాన్ని శుభ్రం చేశాడు. ఈ విగ్రహాన్ని బాలాజీ శ్రీ హనుమాన్‌గా గుర్తించారు. బాలాజీకి వారు భక్తితో ప్రణామం చేసి, పూజ చేశారు. భగవంతుడు బాలాజీ కనిపించిన వార్త ఆ తరువాత వెంటనే అసోటా గ్రామమంతా పాకింది. అసోటాకు చెందిన ఠాగూర్ ఈ వార్త విన్నాడు. బాలాజీ ఆయనకు కలలో కనిపించి గ్రామంలో బయటపడిన విగ్రహాన్ని చురు జిల్లాలోని సాలాసర్‌కు పంపాలని ఆదేశించాడు. ఇదే రాత్రి సాలాసర్‌లో హనుమాన్ భక్తుడైన మోహన్ దాస్‌జీ మహారాజ్‌కు కూడా కలలో హనుమాన్ లేదా బాలాజీ కనిపించాడు. ఆయనకు బాలాజీ అసోటాలో విగ్రహం గురించి చెప్పాడు. దీంతో మోహన్ దాస్‌జీ ఈ సందేశాన్ని అసోటాలోని ఠాగూర్‌కు పంపాడు. మోహన్ దాస్‌జీ అసోటాకు రాకుండానే తెలుసుకున్న వివరాలను చూసి ఠాగూర్ ఆశ్చర్యపోయాడు. బహుశా, ఇది మొత్తం సర్వశక్తివంతుడైన బాలాజీ మహిమతో జరిగిందని భావించారు. విగ్రహాన్ని సాలాసర్‌కు పంపారు, ప్రస్తుతం సాలాసర్ ధామ్‌గా తెలిసిన ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.మరో విగ్రహాన్ని ఇక్కడి నుంచి 25 కిమీ దూరంలో ఉన్న పాబోలమ్ (భరత్‌గర్)లో ప్రతిష్టించారు. పాబోలమ్‌లో వేడుకలను ఉదయం పూట మరియు సాలాసర్‌లో వేడుకలను సాయంత్రం పూట ఒకే రోజు నిర్వహించడం జరుగుతుంది. పూజారి శ్రీరామ్ +919982435366

మార్గాలు (ఢిల్లీ - సాలాసర్ బాలాజీ)[మార్చు]

ఢిల్లీ నుంచి: 1> న్యూఢిల్లీ -> గూర్గావ్ -> రెవారీ -> నార్నాల్ -> చిదావా -> జున్‌జును -> ముకుంద్‌గర్ -> లక్ష్మణ్‌గర్ -> సాలాసర్ బాలాజీ (318 కిమీ) (రెవారీ రోడ్డు వద్ద NH-8ను విడిచిపెట్టాలి, రెవారీ నుంచి జున్‌జును వరకు రోడ్డు అధ్వానంగా ఉంటుంది) (దగ్గరి మార్గం)

2> న్యూఢిల్లీ -> గూర్గావ్ -> బెహ్రోర్ -> నార్నాల్ -> చిదావా -> జున్‌జును -> ముకుంద్‌గర్ -> లక్ష్మణ్‌గర్ -> సాలాసర్ బాలాజీ (335 కిమీ) (బెర్హోర్ నుంచి NH-8ను విడిచిపెట్టాలి, పైమార్గం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది, అయితే బెహ్రోర్-చిదావా-జున్‌జును మధ్య రోడ్లు బాగాలేవు )

3> న్యూఢిల్లీ -> గూర్గావ్ -> బెహ్రోర్ -> కోట్‌పుట్లీ -> నీమ్‌కథనా -> ఉదయ్‌పూర్‌వాటీ -> సికర్ -> సాలాసర్ బాలాజీ (335 కిమీ) (కోట్‌పుట్లీ నుంచి NH-8ని విడిచిపెట్టాలి)

4> న్యూఢిల్లీ -> గూర్గావ్ -> బెహ్రోర్ -> కోట్‌పుట్లీ -> షాపురా -> అజీత్‌గర్ -> సామోద్ -> చోమున్ -> సికర్ -> సాలాసర్ బాలాజీ (392 కిమీ) (షాపురా వద్ద మీరు NH-8ని విడిచిపెట్టాలి) సామోద్ రోడ్డు మార్గంగా కూడా దీనిని పిలుస్తారు

5> న్యూఢిల్లీ -> గూర్గావ్ -> బెహ్రోర్ -> కోట్‌పుట్లీ -> షాపురా -> చంద్‌వాజీ -> చోమున్ -> సికర్ -> సాలాసర్ బాలాజీ (399 కిమీ) (షాపురా వద్ద NH-8ని విడిచిపెట్టాలి) దీనిని చాంద్‌వాజీ రోడ్డు మార్గంగా పిలుస్తారు బాగా ఎక్కువ దూరం ఉన్న మార్గమైనప్పటికీ, దాదాపుగా 225 కిలోమీటర్లు NH8పై సులభంగా ప్రయాణం చేయవచ్చు.

6> న్యూఢిల్లీ -> బహదూర్‌గర్ -> జాజ్‌జహర్ -> చర్కీదాద్రీ -> లోహారు -> చిదావా -> జున్‌జును -> ముకుంద్‌గర్ -> లక్ష్మణ్‌గర్ -> సాలాసర్ బాలాజీ (302 కిమీ) ఇది భక్తులకు ఎక్కువగా తెలియని కొత్త మార్గం

7> న్యూఢిల్లీ -> రోహ్‌తక్ -> హిస్సార్ -> రాజ్‌గర్ -> చురు -> ఫతేపూర్ -> సాలాసర్ బాలాజీ (382 కిమీ)

నిర్వహణ (సాలాసర్ బాలాజీ ట్రస్ట్)[మార్చు]

సాలాసర్ బాలాజీ ఆలయాన్ని మోహన్‌దాస్‌జీ సాలాసర్ బాలాజీ ట్రస్ట్ నిర్వహిస్తుంది సాలాసర్ బాలాజీ అధికారిక వెబ్‌సైట్: www.sbmsalasar.co.in ఆలయం యొక్క సంప్రదింపు వివరాలు సాలాసర్ బాలాజీ ట్రస్ట్ సాలాసర్, రాజస్థాన్ పూజారి శ్రీరామ్ +919982435366 పూజారి బబ్లూ 0 98 28 43 8000

ఆసక్తికరమైన ప్రదేశాలు[మార్చు]

మోహన్‌దాస్ జీ ధునియా అనే ప్రదేశంలో భగవంతుడు హనుమాన్‌కు మహా భక్తుడైన మోహన్‌దాస్ జీ వెలిగించిన పవిత్రమైన హోమగుండం ఇప్పటికీ మండుతుంది. హిందూ భక్తులు మరియు యాత్రికులు ఇక్కడి నుంచి పవిత్రమైన వీభూతిని తీసుకెళుతుంటారు. శ్రీ మోహన్ మందిరం బాలాజీ ఆలయానికి అతి సమీపంలో ఉంది, మోహన్‌దాస్‌జీ మరియు కనిదాదిల పాదముద్రలు ఇక్కడ ఉండటంతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది ఈ ఇద్దరు పుణ్య భక్తుల సమాధి-స్థలమనే భావన ఉంది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ నిరంతర రామాయణ పఠనం జరుగుతుంది. బాలాజీ ఆలయ ప్రాంగణంలో అఖండ హరి కీర్తన లేదా నిరంతర రామనామ స్మరణ గత ఇరవై సంవత్సరాలుగా జరుగుతుంది. లక్ష్మణ్‌గర్‌వైపు సాలాసర్ ధామ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో అంజనీ మాత ఆలయం ఉంది. భగవంతుడు హనుమాన్ లేదా బాలాజీ తల్లి అంజనీ మాత. గుదావది శ్యామ్ ఆలయం కూడా సాలాసర్ ధామ్‌కు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. మోహన్ దాస్‌జీ సమయం నుంచి రెండు ఎడ్ల బండ్లను బాలాజీ మందిర ప్రాంగణంలో ఉంచుతున్నారు. శయనన్ మాతా మందిరం ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన కొండపై ఎడారి ప్రాంతంలో ఉంది, ఈ ఆలయం 1100 ఏళ్ల క్రితంనాటిదని భావిస్తున్నారు, ఈ ఆలయం కూడా సాలాసర్‌కు సమీపంలో ఉన్న ఒక ఆసక్తికరమైన ప్రదేశంగా గుర్తించబడుతుంది.

శ్రీ హనుమాన్ జయంతి పండుగను ప్రతి ఏడాది చైత్ర శుక్ల చతర్దశి మరియు పూర్ణిమ రోజున జరుపుతారు. శ్రీ హనుమాన్ జయంతి వేడుకల సమయంలో భారతదేశం అన్ని మూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. అశ్వినీ శుక్ల చతుర్దశి మరియు పూర్ణిమ రోజు వేడుకలు నిర్వహిస్తారు, ఈ వేడుకలకు కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. బాధ్రపద శుక్ర చతుర్దశి మరియు పూర్ణిమ రోజు జరిగే వేడుకల కూడా మిగిలిన వేడుకలు మాదిరిగానే కోలాహలంగా జరుగుతాయి. ఈ వేడుకల సమయంలో ఉచిత ఆహారం, మిఠాయిలు మరియు పానీయాలు పంపిణీ చేస్తారు.

సాలాసర్ బాలాజీ ఆలయాన్ని మోహన్‌దాస్‌జీ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఆలయ జనరేటర్‌ల నుంచి విద్యుత్ సరఫరా చేయడం, శుభ్రమైన త్రాగునీరు అందించడంతోపాటు సాలాసర్ పట్టణానికి సాలాసర్ ట్రస్ట్ వివిధ సౌకర్యాలు కల్పిస్తుంది.

బాహ్య లింకులు[మార్చు]

పూజారి బబ్లూ 0 98 28 43 8000

sbmsalasar.co.in

sbmsalasar.co.inతోపాటు, మరే ఇతర వెబ్‌సైట్ ఆన్‌లైన్ విరాళాలను సేకరించదు. ట్రస్ట్ నుంచి ఇదే విషయంపై ధ్రువీకరణ పొందవచ్చు. అందువలన సాలాసర్ బాలాజీ పేరుపై ఆన్‌లైన్ విరాళాలు చేయమని మీ వద్ద చెక్ అడగడం లేదా ఏదైనా అకౌంట్‌కు నగదు పంపమని కోరే ప్రకటనలు నకిలీవని గుర్తించాలి హనుమాన్ ఆలయాలు] పూజారి శ్రీరామ్ +919982435366

పూజారి బబ్లూ 0 98 28 43 8000