సావిత్రీ జిందాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సావిత్రీ జిందాల్
సావిత్రీ జిందాల్
జననం (1950-03-20) 1950 మార్చి 20 (వయసు 74)[1]
తిన్‌సుకియా, అస్సాం, భారత దేశం[1]
జాతీయతభారతీయులు
విద్యడిప్లొమా
వృత్తిచైర్ పర్సన్, ఓ.పి.జిందాల్ గ్రూపు.
నికర విలువDecrease US$ 7.6 billion (2013)
జీవిత భాగస్వామిఓమ్ ప్రకాశ్ జిందాల్ (1930-2005)
పిల్లలు9, పృథ్వీరాజ్ జిందాల్,
సజ్జన్ జిందాల్,
రతన్ జిందాల్,
నవీన్ జిందాల్ లతో సహా మరో ఐదుగురు

సావిత్రీ జిందాల్ (అస్సామీ: সাৱিত্ৰী দেৱী জিন্দাল; ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ లలో ఒకరు.[2] అంతేకాదు, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత.

జీవిత విశేషాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం

ఈమె హర్యానా లోని హిసార్‌లో జన్మించారు. 1970లో ఒ.పి.జిందాల్‌తో ఆమె పెళ్ళి జరిగింది. . భార్యగా, తల్లిగా ఎంతో సంతోషంగా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమెకు నలుగురు అబ్బాయిలూ, అయిదుగురు అమ్మాయిలను పెంచి పెద్దచేసినా ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. బయటి విషయాలూ, వ్యాపార లావాదేవీలన్నీ ఆమె భర్య చూసుకునేవారు. పిల్లలూ, ఇంటికి వచ్చిపోయే బంధువులూ... ఇదే ఆమె లోకం. 2005 లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆమె భర్త మరణించేంతవరకూ ఆమెకు అమెకున్న ఆస్తిపాస్తులు ఏమిటో కూడా తెలియదు. ఆ తర్వాత తన ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె భర్త తదనంతరం ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో వ్యాపార లావాదేవీలకు ఆమె పూర్తిగా కొత్త కావడంతో ఆమె నలుగురు అబ్బాయిలు పృథ్విరాజ్‌, సజ్జన్‌, రతన్‌, నవీన్‌లే అన్ని విషయాలూ చూసుకునేవారు. ఆమె బోర్డు మీటింగులకూ, వాటిలో తీసుకునే నిర్ణయాలకూ చాలా దూరంగా ఉండేవారు. వూపిరి సలపని వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉండటానికి రాజకీయాల నెపంతో మూడు రోజులు హిసార్‌ నియోజకవర్గంలో గడిపేవారు. ఇప్పుడు ఆమె బోర్డు మీటింగుల్లో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

తన భర్త ఓపీ జిందాల్‌ 2005లో విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం హిసార్‌ నియోజకవర్గం నుంచి సావిత్రి జిందాల్ ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఆమె 2009లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 29 అక్టోబర్ 2013న హర్యానా ప్రభుత్వంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ, విద్యుత్, గృహనిర్మాణం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి 2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది.[3][4]

ఆమె సంస్థలు చేస్తున్న పనులు[మార్చు]

  • ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. వివిధ వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరలనూ నియంత్రించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు వ్యాపార రంగానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. మనదేశంలో ప్రముఖ వ్యాపారాలన్నీ కొన్ని కుటుంబాలకే పరిమితం అయ్యాయి.

అలాకాకుండా వ్యాపారం చేయాలనుకునే ఉత్సాహవంతులకు ప్రోత్సాహకర పరిస్థితులు కల్పించాలి. అప్పుడు స్వయం ఉపాధికి అవకాశాలూ పెరుగుతాయి.

  • విద్య, ఉద్యోగ, ఆరోగ్య రంగాల్లో ఆ సంస్థలు ఎంతోకాలంగా సేవలందిస్తున్నాయి. 2007లో ఒ.పి.జిందాల్‌ పేరిట ఒ.పి.జిందాల్‌ పౌండేషన్ వారు ఒక కమ్యూనిటీ కాలేజీని స్థాపించారు. దీంట్లో వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందిస్తారు. ఒకవ్యక్తి సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించడానికి కావాల్సిన శిక్షణంతా ఇక్కడ లభిస్తుంది. ప్రతిభ కనబరిచినవారికి స్కాలర్‌షిప్‌ సౌకర్యమూ ఉంది.
  • సుమారు యాభైమూడు వేలకోట్ల రూపాయల సంపదతో దేశంలోని సంపన్నుల్లో ఏడో స్థానం పొందారు. ప్రపంచ సంపన్నుల్లో యాభై ఆరో స్థానం సాధించడం, ఇంకా ఆసియా లోనే అత్యంత సంపన్న మహిళగా ఎంపిక కావడమూ సంతోషంకరమైన విషయం. అయితే, ఇవేమీ ఆమె వ్యక్తిగత జీవితంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నిరాడంబరంగా జీవించడానికే ఇష్టపడతారు. ఆమె పగ్గాలు చేపట్టిన తర్వాత సంస్థ ఆదాయం మూడు రెట్లు పెరిగింది.
  • ఒ.పి. జిందాల్‌ గ్రూప్‌ సంస్థ 1952లో ప్రారంభమైంది. అత్యధికంగా ఇనుమును ఉత్పత్తిచేసే సంస్థల్లో ప్రపంచంలోనే ఇది మూడోది. దీంట్లో స్టీల్‌, పవర్‌, మైనింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌కు సంబంధించిన నాలుగు విభాగాలున్నాయి. నలుగురు అబ్బాయిలూ ఒక్కొక్కరూ ఒక్కో విభాగ బాధ్యతలు చేపట్టారు. అయితే, ఎవరికి ఏ సమస్య వచ్చినా నలుగురూ ఒకచోట కూర్చుని జాగ్రత్తగా చర్చించిమరీ నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తామంతా అన్నదమ్ములమేనన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. ఇదంతా తండ్రి నుంచి వచ్చిన క్రమశిక్షణే. నా పిల్లలకు కుటుంబ వారసత్వంగా ఆస్తిపాస్తులే కాదు, నీతి నిజాయతీలూ, కష్టపడేతత్వం, చక్కటి వ్యక్తిత్వం కూడా వచ్చాయి.
  • బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వర్తించడంలోనే నిజమైన ఆనందం దొరుకుతుంది. ఆ సంస్థ ఉద్యోగులను కేవలం ఉద్యోగుల్లా చూడరు, కుటుంబ సభ్యుల్లానే చూస్తాను. వారి సమస్యలను శ్రద్ధగా వింటాను. 'కుటుంబం అంటే నువ్వూ, నేనూ, పిల్లలు మాత్రమేకాదు, మన ఉద్యోగులు కూడా' అని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటలను నేను ఎప్పటికీ మర్చిపోను.
  • నేటి మహిళా వ్యాపారవేత్తలకు ఆమె చెప్పేది ఒక్కటే.. కష్టపడి పనిచేయండి. శ్రమజీవికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మార్కెట్లో గట్టి పోటీ ఎదురైనా, అవరోధాలు కలిగినా బెదిరిపోకండి. వ్యాపార ప్రపంచంలో అవన్నీ సహజం. ధైర్యంగా ముందడుగు వేస్తే ఫలితం ఎప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటుంది.
  • అభిరుచుల విషయానికి వస్తే... సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఇష్టంగా పాల్గొంటారు. ఏకాస్త సమయం దొరికినా పుస్తకాలు చదువుతాను, పిల్లలకు కమ్మగా వండిపెడతారు.

సూచికలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Haryana Vidhan Sabha MLA
  2. "అంబానీ, అదానీ కాదు ఈ ఏడాది సావిత్రిదే |". web.archive.org. 2023-12-20. Archived from the original on 2023-12-20. Retrieved 2023-12-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. NT News (28 March 2024). "కాంగ్రెస్‌కు మరో షాక్‌..! పార్టీకి మాజీ మంత్రి సావిత్రి జిందాల్‌ రాజీనామా". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  4. Eenadu (28 March 2024). "భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్‌ ఎంపీ". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.