సిక్కు గురువులు

వికీపీడియా నుండి

మూస:Sikhi

1700 ప్రారంభ నాటి పది సిక్కు గురువుల వర్ణన

గురునానక్‌ (గురుముఖి: ਗੁਰੂ ਨਾਨਕ) (21 నవంబర్ 1469 - సోమవారం 22 సెప్టెంబర్‌ 1539) సిక్కు మత స్థాపకుడు మరియు సిక్కుల పదిమంది గురువులలో మొదటివాడు. ఆయన తల్వండి అనే గ్రామంలో జన్మించారు. దీనినే రాయ్‌భోయ్‌కి తల్వాండి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు నన్కానా సాహిబ్ అని పిలుస్తున్నారు. ఇది ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌కు సమీపంలో ఉంది. పురాతన సిక్కు ఆధారాల ప్రకారం 1469లో బైశాఖ మాసం(ఏప్రిల్‌-మే)లో మూడోరోజున తెల్లవారుజామున గురునానక్‌ జన్మించారు. దీనిని 1469 ఏప్రిల్‌ 15, శనివారంగా నమ్ముతారు. ఏదేమైనా సిక్కులు మాత్రం ఈ ఆనందకరమైన కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం నవంబర్‌ 24న జరుపుకుంటారు.

గురునానక్‌ దేవ్‌జీ 1539 వరకు జీవించారు. ఆ సమయంలో ఆయన పేరు భారతదేశం నలుమూలలా వ్యాపించింది. అరేబియా, మొసపటోమియా(ఇరాక్‌), సిలోన్‌(శ్రీలంక), ఆప్ఘనిస్తాన్‌, టర్కీ, బర్మా, టిబెట్ ప్రాంతాల్లోనూ ఆయన పేరు ప్రఖ్యాతలు వ్యాపించాయి. ఆయన జన్మదినోత్సవం లూనార్‌తో సంబంధం కలిగి ఉంటుంది. నవంబర్‌లో వచ్చే పౌర్ణమినాడు ఈ వేడుకను జరుపుకుంటారు. 2005లో నవంబర్‌ 15న దీనిని జరుపుకున్నారు. 2006లో నవంబర్ 5, 2007లో నవంబర్‌ 24, 2008లో నవంబర్‌ 13, 2009లో నవంబర్‌2, 2010లో నవంబర్‌ 21న జరుపుకుంటారు. 2011లో నవంబర్‌ 10, 2012లో నవంబర్‌ 28, 2013లో నవంబర్‌ 17, 2014లో నవంబర్‌ 6, 2015లో నవంబర్‌ 25, 2016లో నవంబర్‌ 14, 2017లో నవంబర్‌ 4, 2018లో నవంబర్‌ 23, 2019లో నవంబర్‌ 12, 2020లో నవంబర్‌ 30న దీనిని జరుపుతారు.

సిక్కుల పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్‌లో పవిత్ర వాక్యాలు రాసిన వాళ్లంతా "నానక్‌" అన్న పేరునే ఉపయోగించారు. సిక్కుల రెండో గురువు, గురు అంగద్‌ జీని కూడా "సెకండ్‌ నానక్‌" లేదా "నానక్‌ II" అని పిలుస్తారు. గురునానక్‌ ఉపదేశించిన సందేశాన్నే తరువాతి గురువులంతా ప్రచారం చేశారని సిక్కులు నమ్ముతారు. అందుకే వాళ్ల సొంత పేర్లకు బదులుగా పవిత్ర వాక్యాల్లో నానక్ అన్న పేరునే ఉపయోగించారు. వాళ్లందరినీ లైట్ ఆఫ్ నానక్‌గానే భావిస్తారు.

1469 నుంచి 1708 మధ్యకాలంలో గురునానక్ మరియు ఇతర తొమ్మిది మంది సిక్కు గురువులు సిక్కు మతాన్ని ఏర్పాటు చేశారు. గురునానక్‌ మొదటి గురువు. మరియు గురు గోవింద సింగ్ పదవ (ఆఖరి) గురువు. గురుగోవింద సింగ్ తాను చనిపోవడానికి ముందు, సిక్కుల పవిత్రగ్రంథం గురు గ్రంథ సాహిబ్‌ను సిక్కుమతానికి ఆఖరి గురువుగా ప్రకటించారు. సిక్కులంతా తమ గురువుల యొక్క బోధనలను అనుసరించాల్సిన అవసరముంది, ఆ తరువాత చేసే ధ్యానం ముక్తికి దారి తీస్తుంది.

విషయ సూచిక

అర్థం [మార్చు]

ది షిరోమని గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ వెబ్‌సైట్ స్టేట్స్‌:

Sikhism has a very specific definition of the word 'Guru'. It means the descent of divine guidance to mankind provided through ten Enlightened Masters. This honour of being called a Sikh Guru applies only to the ten Gurus who founded the religion starting with Guru Nanak in 1469 and ending with Guru Gobind Singh in 1708; thereafter it refers to the Sikh Holy Scriptures the Guru Granth Sahib.[1]

సిక్కు గురువుల జాబితా[1] [మార్చు]

2nd guruvu

వీటిని కూడా చూడండి [మార్చు]

  • సిక్కు తత్వ చరిత్ర

సూచనలు [మార్చు]

  1. 1.0 1.1 Shiromani Gurdwara Prabandhak Committee. "Ten Gurus"

మూస:Sikhism