సిద్ధాంత శిరోమణి
వికీపీడియా నుండి
సిద్ధాంత శిరోమణీ, ప్రాచీన భారతీయ గణితవేత్త రెండవ భాస్కరుని ప్రధాన రచన. 36 సంవత్సరాల వయసులో (అనగా క్రీ.శ 1150) రాయబడిన ఈ ఉద్గ్రంధంలో మూడు సంపుటాలుగా, సుమారు 1450 శ్లోకాలు ఉన్నాయి. [1]
విషయ సూచిక |
భాగాలు [మార్చు]
లీలావతి [మార్చు]
ఇది భాస్కరుడు, తన కుమార్తె లీలావతి పేర రాసాడని ప్రసిద్ధి. ఇది సిద్ధాంత శిరోమణిలోని మొదటి భాగం. 13 అధ్యాయాలు, 278 శ్లోకాలు ఉన్న ఈ గ్రంధం అంకగణితం, కొలతలు గురించి చర్చిస్తుంది.
బీజగణితం [మార్చు]
సిద్ధాంత శిరోమణిలోని రెండవ భాగం బీజగణితం. ఇది 6 అధ్యాయాలుగా, 213 శ్లోకాలుగా ఉండి బీజగణితం () గూర్చి చర్చిస్తుంది.
గణితాధ్యాయం మరియు గోళాధ్యాయం [మార్చు]
సిద్ధాంత శిరోమణిలోని మూడవ భాగమైన గణితాధ్యాయం మరియు గోళాధ్యాయం, జ్యోతిష్య గ్రంధం. ఇది సుమారు 900 శ్లోకాలతో కూడి ఉన్నది. [2]