సి.కృష్ణవేణి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.

మేకా కృష్ణవేణి
Krishnaveni in gollabhama.jpg
గొల్లభామ సినిమాలో కృష్ణవేణి
జననం డిసెంబర్ 24, 1924
పంగిడి గూడెం, కృష్ణా జిల్లా,
మద్రాసు రాష్ట్రం
నివాస ప్రాంతం మద్రాసు (చెన్నై), హైదరాబాదు
ఇతర పేర్లు సి.కృష్ణవేణి, మీర్జాపురం రాణి
వృత్తి తెలుగు చలనచిత్ర నటి,
గాయని,
నిర్మాత
మతం హిందూ మతం
భార్య / భర్త మీర్జాపురం రాజు మేకా రంగయ్య
పిల్లలు మేకా రాజ్యలక్ష్మి అనూరాధ

సి.కృష్ణవేణి లేదా ఎం.కృష్ణవేణీ (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని మరియు నిర్మాత

జీవిత చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసినది. 1936లో సతీఅనసూయ /ధ్రవ చిత్రముతో బాలనటిగా సినీ రంగము ప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ మరియు కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించంది.

కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత అయిన మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)ను వివాహమాడి ఆ తరువాత ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మంచింది. ఈమె తన సినిమాలలో తెలుగు సంప్రాదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, మరియు నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసింది. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు మరియు సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసింది.

పురస్కారాలు[మార్చు]

కృష్ణవేణి నటించిన సినిమాలు[మార్చు]

  1. సతీ అనసూయ -ధృవ (1936)
  2. మోహినీ రుక్మాంగద (1937)
  3. కచ దేవయాని (1938)
  4. మళ్లీ పెళ్ళి (1939)
  5. మహానంద (1939)
  6. జీవనజ్యోతి (1940)
  7. దక్షయజ్ఞం (1941)
  8. భీష్మ (1944)
  9. బ్రహ్మరథం(1947)
  10. మదాలస (1948)
  11. మన దేశం (1949)
  12. గొల్లభామ

నిర్మాతగా కృష్ణవేణి[మార్చు]

కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు[మార్చు]

  • భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాత కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
  • సొంత సంస్థ - తన కుమార్తె మేక రాజ్యలక్షీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్

కృష్ణవేణి నిర్మించిన సినిమాలు[మార్చు]

గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైనది

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]