సీతాకల్యాణం
వికీపీడియా నుండి
మరికొన్ని ఇటువంటి పేరులు గల వ్యాసాల కోసం సీతా కళ్యాణం అయోమయ నివృత్తి పేజీ కూడా చూడండి.
| సీతాకల్యాణం (1976) | |
| దర్శకత్వం | బాపు |
|---|---|
| నిర్మాణం | పింజల ఆనందరావు, పి.సుబ్బారావు |
| కథ | సంప్రదాయ గాధ |
| తారాగణం | రవి, జయప్రద |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నేపథ్య గానం | బి.వసంత, ఎస్.జానకి, వాణీ జయరాం,, పి.బి.శ్రీనివాస్, , ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, , పి.సుశీల, వి.రామకృష్ణ |
| నృత్యాలు | పారుపల్లి శేషు, రాజు, శివ, దుర్గ |
| సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
| ఛాయాగ్రహణం | రవికాంత్ నగాయిచ్, కె.ఎస్.ప్రసాద్ |
| నిర్మాణ సంస్థ | ఆనందలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్స్, చిత్రకల్పన |
| అవార్డులు | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమచిత్రం |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
సీతాకల్యాణం, 1976లో వెలువడిన ఒక తెలుగు సినిమా. ప్రసిద్ధ దర్శకుడు మరియు చిత్రకారుడు అయిన బాపు దర్శకత్వంలో వెలువడిన ఉత్తమ కళా చిత్రాలలో ఇది ఒకటి. తెలుగువారికి సుపరిచితమైన ఈ రామాయణ కధాంశాన్ని కన్నులపండువుగా బాపు చిత్రీకరించాడు.
1978లో చికాగోలోను, 1979లో బెర్లిన్, సాన్‌రినో, డెన్వర్ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శింపబడి ఈ చిత్రం విమర్శకుల మన్నలందుకొంది. ఇది చూడడం కనుల పండువనీ, దీనిలోని సంగీతం వీనుల విందనీ ప్రేక్షకులు ప్రశంసించారు. [1] [2]
విషయ సూచిక |
కధ [మార్చు]
ఇందులో కధాంశం క్రొత్తదేమీ కాదు. కధలో చూపిన ముఖ్యాంశాలు
- రామావతారం ఎలా సంభవించింది
- పుత్రకామేష్టి ద్వారా దశరధునికి పుత్రులు జన్మించడం, జనకునికి సీత లభించడము
- విశ్వామిత్రుడు తన యాగ రక్షణకు రామ లక్ష్మణులను తన తోడు తీసుకొని వెళ్ళడము
- అస్త్రోపదేశం
- తాటకి సంహారం
- యాగ రక్షణ
- అహల్యా శాప విమోచనం
- గంగావతరణం
- శివ ధనుర్భంగం
- సీతారామ కళ్యాణం
- పరశురామ గర్వ భంగం
ఇతర విశేషాలు [మార్చు]
- "గంగావతరణం" సన్నివేశ చిత్రీకరణ ఈ సినిమాకు తలమానికం వంటిది. సాంకేతిక నైపుణ్యం, పాట, కళ అందరి మన్ననలూ పొందాయి.
- ఈ సినిమా నాటికి నందమూరి తారక రామారావు వయసు ఎక్కువ కావడం వలన యువ రాముడి పాత్రకు సరిపోడు. కాని రాముని పాత్రలో మరొకరిని చూడడానికి తెలుగువారు అలవాటు పడలేదు. రవి అనే కొత్త యువకునిచే ఈ వేషం వేయించడం చర్చనీయమయ్యింది. ఆర్ధికంగా సినిమా అంతగా విజయవంతం కాకపోవడానికి ఇది కూడా ఒక కారణమని అభిప్రాయ పడ్డారు.
- సీత పాత్రలో అప్పుడే సినిమా రంగంలోకి వచ్చిన జయప్రద నటించింది.
- సినిమాలో రామునికి పాత్రకు రెండు మూడు సంభాషణలు మాత్రమే ఉన్నాయి.
పాత్రధారులు [మార్చు]
- రవికుమార్ - శ్రీరాముడు, విష్ణువు
- జయప్రద - సీత, లక్ష్మి
- గుమ్మడి వెంకటేశ్వరరావు - దశరథుడు
- మిక్కిలినేని - జనకుడు
- సత్యనారాయణ - రావణుడు
- నాగయ్య - వశిష్ఠుడు
- ముక్కామల - విశ్వామిత్రుడు
- హేమలత - కౌసల్య
- జమున -కైక
- పి.ఆర్.వరలక్ష్మి - సుమిత్ర
- త్యాగరాజు - పరశురాముడు
- ప్రభ - మండోదరి
- ఇతరులు
- కళా దర్శకుడు -పిలకా లక్ష్మీనరసింహ మూర్తి
- సహాయ సంగీత దర్శకుడు - పుహళేంది
మూలాలు [మార్చు]
- ↑ "It is one of the most extravagantly beautiful films I have seen, done with real taste, an amalgam of lyricism, poetry and spectacle achieved with rare authenticity... done with gravita and dignity.." - Derek Malcolm of the Guardian, London non of the vulgarity.. the film has jewel like precision of decor and scenic effect..."
- ↑ Nigel Andrews of the Financial Times, London " the biggest single treat of the London Film Festival" David Robinson of The Times, London " it is a wondrous film of great visual beauty.." Ken Wlaschin of the London Film Festival.