సీతారామ కళ్యాణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతారాముల కళ్యాణం

శ్రీ రామ నవమి కథ . శ్రీ రాముడు మర్యాద పురుషోత్తముడు. సకల గుణాభి దేముడు. అయోధ్య పతి దశరథుని పుత్రునిగా ఈ ప్రుద్వి మండలాన్ని ఏలిన జగదభి దేముడు శ్రీరాముడు. రామ అని శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగు తాయని పురాణ ప్రసిద్ధి . అట్టి శ్రీ రాముని కళ్యాణం మన అందరికి మహా పర్వదినం .

ఈ రోజును శ్రీ రామ నవమిగా జరుపుకోవడం మన ఆనవాయితీ . దేశంలో నవమి రోజున నలు మూలల విషేషంగా పూజలు నిర్వహిస్తారు . మన రాష్టం ఖమ్మం జిల్లా భద్రా చలంలో శ్రీ రామ నవమి కడు రమ్యంగా జరుపుతారు. ఆ దేవ దేవుని కళ్యాణంలో మన రాష్టం ప్రతినిదులు పాల్గొని శ్రీ రామునికి ముత్యాలు, పట్టువస్త్రాలు అందిస్తారు. శ్రీ రామనవమి వేడుకలలో కొన్ని లక్షల మంది పాల్గొని స్వామి క్రుపకు పాత్రులగుదురు. శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు ఇది మన అరోగ్యాన్నికి చాలా మంచిది. మనం ప్రతి రోజు "శ్రీ రామ జయ రామ జయజయ రామ" అనే విజయ మహా మంత్రాన్ని 108 సార్లు స్మరించుకొవడం మన పూర్వజన్మ పుణ్యఫలం.

భారతీయ సంస్కృతిలో సీతారామ కళ్యాణానికి భార్యాభర్తల సంసారానికి చాలా గొప్పతనం ఉన్నది.

సీతాకళ్యాణం కథతో రూపొందిన తొలి తెలుగు సినిమా 'సీతాకళ్యాణం (1934 సినిమా)'. పినపాల వెంకటదాసు మద్రాసులో వేల్ పిక్చర్స్ బేనర్ ని నెలకొల్పి దానిపై సినిమాలు నిర్మించారు. దక్షిణభారత సాంకేతిక నిపుణులతో తయారైన తొలి తెలుగు సినిమాగా 'సీతా కల్యాణం' పేరు తెచ్చుకొంది సీతారామ కళ్యాణం (1961 సినిమా) తెలుగు సినిమాగా 1961 లో చిత్రీకరించబడి ప్రజాదరణ పొందినది. ఇందులో ఎన్.టి.రామారావు రావణునిగా పాత్రపోషించాడు. 1976లో బాపు దర్శకత్వంలో ఒక కళాత్మక దృశ్యకావ్యంగా సీతాకళ్యాణం రూపొందించబడినది.