సుద్దాల అశోక్ తేజ
| సుద్దాల అశోక్ తేజ | |
![]() సుద్దాల అశోక్ తేజ |
|
| జన్మ నామం | సుద్దాల అశోక్ తేజ |
|---|---|
| జననం | |
| నివాసం | సుద్దాల గ్రామం., నల్గొండ జిల్లా |
| వృత్తి | సినిమా పాటల రచయిత కథా రచయిత |
| మతం | హిందూ |
| భార్య/భర్త | నిర్మల |
| సంతానం | జ్వాలా చైతన్య, అర్జున్ తేజ, & స్వప్న |
| తండ్రి | సుద్దాల హనుమంతు, ప్రముఖ తెలుగు కవి |
| తల్లి | జానకమ్మ |
| వెబ్‌సైటు | http://www.suddalaashokteja.in/ |
సుద్దాల అశోక్ తేజ తెలుగు సినిమా కథ మరియు పాటల రచయిత. ఠాగూర్ (2003) చిత్రం లో ఆయన రచించిన నేను సైతం అనే పాట ద్వారా జాతీయ ఉత్తమ పాటల రచయిత పురస్కారం పొందాడు. ఆయన నల్గొండ జిల్లా సుద్దాల గ్రామంలో పుట్టాడు. ఆయన తండ్రి ప్రముఖ తెలుగు కవి సుద్దాల హనుమంతు మరియు తల్లి జానకమ్మ.
విషయ సూచిక |
తొలి జీవితం[మార్చు]
నమస్తే అన్న చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్ కు మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. అయితే ఆలస్యమైంది. తనికేళ్ళ భరణి లాంటి వారి ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించారు. అయితే ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం దర్శకరత్న దాసరి నారాయణరావుని కలవడం. కృష్ణవంశీ లాంటి దర్శకుల సినిమాల్లో మంచి మంచి పాటలు రాశారు. తోలుత సుద్దాల హనుమంతు గారి కుమారుడు కావడం వల్లనో ఏమో... అన్ని విప్లవగీతాలే రాయాల్సి వచ్చింది. కృష్ణవంశి లాంటి దర్శకుల ప్రోద్బలంతో తన పాటల్లో అన్ని రసాలు ఒలికించారు.
రచనలు[మార్చు]
కవిత్వం[మార్చు]
ప్రసిద్ధి చెందిన పాటలు[మార్చు]
- ఆలి నీకు దండమే,అర్దాంగి నీకు దండమే
- నేను సైతం
- నేలమ్మ నేలమ్మ నేలమ్మా....
- దేవుడు వరమందిస్తే... నే నిన్నే కోరుకుంటానే
- నువు యాడికేళ్తే ఆడికోస్త సువర్ణా
- ఏం సక్కగున్నావో నా సోట్టసేంపలోడా - ఝుమ్మంది నాదం
- మీసాలు గుచ్చకుండా - చందమామ
పుస్తకాలు, ప్రచురణలు[మార్చు]
పురస్కారాలు[మార్చు]
2003 సంవత్సరానికి అశోక్ తేజకు (ఠాగూర్ సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు శ్రీశ్రీకి (అల్లూరి సీతారామరాజు సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు), వేటూరి సుందరరామమూర్తికి (మాతృదేవోభవ సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి.
బయటి లింకులు[మార్చు]
[[<object width="425" height="344"><param name="movie" value="http://www.youtube.com/v/SUenHBgZRas&hl=en&fs=1"></param><param name="allowFullScreen" value="true"></param><param name="allowscriptaccess" value="always"></param><embed src="http://www.youtube.com/v/SUenHBgZRas&hl=en&fs=1" type="application/x-shockwave-flash" allowscriptaccess="always" allowfullscreen="true" width="425" height="344"></embed></object>]]వీడియోలు : సుద్దాల అశోక్ తేజతో ముఖాముఖి.
