సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ

వికీపీడియా నుండి
సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ
Salar (2).jpg
దారుస్సలాం మజ్లిస్ పార్టీ కార్యాలయం
Succeeded by అసదుద్దీన్ ఒవైసీ (కుమారుడు)
Constituency హైదరాబాదు
Personal details
Born 14 ఫిబ్రవరి, 1931
హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
Died 29.9.2008
Political party ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
Children 3 కుమారులు మరియు 1 కుమార్తె.
Religion ఇస్లాం
Website లేదు
As of October 17, 2006
Source: [1]

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ (ఫిబ్రవరి 14, 1931 - సెప్టెంబర్ 29,2008) హైదరాబాదు నగరానికి చెందిన రాజకీయనాయకుడు. మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు.

విషయ సూచిక

రాజకీయ జీవితం [మార్చు]

1960 లో మల్లేపల్లి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 1962, 67, 78, 83 లలో ఎమ్మెల్యే గా 1984 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. ఆయన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికైనంత వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. హైదరాబాద్ నగర మేయర్లుగా ఇద్దరు హిందువులను దళితులను మజ్లిస్ పార్టీ తరపున గెలిపించారు. ఈయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు[1][1]. అక్బరుద్దీన్ ఒవైసీ ఆయన రెండవ కుమారుడు. అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఆంధ్రప్రదేశ్ లో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు[2]. సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ యొక్క తండ్రి కూడా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కు అధ్యక్షునిగా పనిచేశారు.

1976 లో ఆయన తండ్రి మరణానంతరం మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క అధ్యక్ష బాధ్యతలను సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ స్వీకరించారు.

సలాహుద్దీన్ ఒవైసీ "సలార్-ఇ-మిలాత్" గా కూడా అందరికీ తెలుసు. ఆయన తన ఉపన్యాసాలలో ఈవిధంగా చెప్పేవాడు. " భారత దేశం ముస్లిం లను వారి అదృష్టానికి వదిలి వేసింది. అందువలన ముస్లిములు ప్రభుత్వం యొక్క సహాయానికి ఎదురు చూడకుండా వారి కాళ్లపై వారు నిలబడాలి" . ఒవైసీ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన రాజకీయ వేత్త. ఆయన ఖ్యాతి రాష్ట్ర సరిహద్దుల వరకు పాకింది. ముస్లిం ప్రజలు ఆయన వెనుకే ఉన్నారని , ముస్లిం ఓటు బ్యాంకుకు ఆయన ప్రధానమైన వాడని అందరూ విశ్వసించేవారు. ఆయన హైదరాబాద్ నందు ముస్లిం నాయకులలో ప్రసిద్ధమైనవాడు.

సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ అతి పిన్న వయసులోనే ఆయన తండ్రి జైలు పాలయ్యే సమయంలో రాజకీయ జీవితం ప్రారంభించారు.

అభివృద్ధి [మార్చు]

ముసిం ల ఆర్థిక మరియు విద్యాభివృద్ధికి ఒవైసీ మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీ, ఫార్మసీ, డిగ్రీ కళాశాల మరియు కాలేజ్ ఫర్ హాస్పటల్ మేనేజ్ మెంట్, ఎం.బి.ఎ, ఎం.సి.ఎ మరియు నర్సింగ్, కోపరేటివ్ బ్యాంకు, ఐ.టి.ఐ, రెండు ఆసుపత్రుల ను స్థాపించాడు. ఉర్ధూ పత్రిక ఎటెమాడ్ ను ప్రారంభించారు.

ఎన్నికల సమాచారము [మార్చు]

  • 1978 అసెంబ్లీ ఎన్నికలలో 51.98% ఓట్ల తో స్వతంత్ర పార్టీ అభర్థిగా చార్మినార్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి గెలిచారు.
  • 1983 అసెంబ్లీ ఎన్నికలలో 64.05% ఓట్ల తో స్వతంత్ర పార్టీ అభర్థిగా చార్మినార్ అసెంబ్లీ నియోజక వర్గం నుండి గెలిచారు.
  • 1984 పార్లమెంట్ ఎన్నికలలో 38.13% ఓట్లతో స్వతంత్ర పార్టీ అభర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 1989 పార్లమెంట్ ఎన్నికలలో 45.91% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 1991 పార్లమెంట్ ఎన్నికలలో 46.18% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 1996 పార్లమెంట్ ఎన్నికలలో 34.57% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 1998 పార్లమెంట్ ఎన్నికలలో 44.65% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
  • 1999 పార్లమెంట్ ఎన్నికలలో 41.36% ఓట్లతో AIMIMపార్టీ అభర్థిగా హైదరాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.

ఇతర పాత్రలు [మార్చు]

  • 1985–96— హోం మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యులు.
  • 1996–97—హోం మంత్రిత్వ శాఖ కమిటీ సభ్యులు.
  • 1996–97—పరిశ్రమల శాఖ కమిటీ సభ్యులు.
  • 1996–97—ఆర్థిక కమిటీ సభ్యులు.
  • 1998–99— రక్షణ శాఖ కమిటీ సభ్యులు మరియు అందలి సబ్ కమిటీ సభ్యులు.

సూచికలు [మార్చు]

  1. 1.0 1.1 Andhra Pradesh / Hyderabad News : A veteran of many battles. The Hindu (2008-09-30). Retrieved on 2012-05-05.
  2. MIM president Salahuddin Owaisi passes away | Indian Muslims. Indianmuslims.info. Retrieved on 2012-05-05.

బయటి లింకులు [మార్చు]