సువర్ణముఖి, చిత్తూరు

వికీపీడియా నుండి

నాగావళి ఉపనదైన సువర్ణముఖి నదిని గురించి ఇక్కడ చూడండి.

స్వర్ణముఖి లేదా సువర్ణముఖి చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ఇది తిరుపతి-చంద్రగిరి మద్య తొండవాడ సమీప కొండప్రాంతం ఈ నది జన్మస్థానం.

పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సుచేసి ఈ నదిని దేవలోకం నుంచి క్రిందికి తెప్పించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తున్నది.


స్వర్ణముఖి నది దక్షిణ కైలాసం అనే పర్వతం నుండి ప్రవహిస్తుంది. ఇది ఉత్తర వాహిని. అగస్త్యముని ఈనది ని భూమి మీదకు తీసుకువచ్చాడు. ఈ నది ప్రసిద్ద శైవ క్షేత్రమైన శ్రీ కాళహస్తి దేవాలయము ప్రక్కగా ప్రవహించుచున్నది.

ఈ నది భీమ, కల్యాణి నదులలో సంగమించి, తొండవాడలో త్రివేణి సంగమంగా మారి, ఉత్తరవాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది.


[మార్చు] మూలాలు

  • శ్రీకాళహస్తి దేవస్థానం వారి శివరాత్రి బ్రహ్మొత్సవాలు ఆహ్వానపత్రిక నుండి సేకరించినది.
పేజీకి సంభందించిన లింకులు