సుహాసిని
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
సుహాసిని (జ. 15 ఆగష్టు, 1961) ప్రముఖ దక్షిణ భారత నటి. ప్రముఖ దర్శకుడు మణిరత్నంను వివాహమాడింది. తమిళనాడులో గల చెన్నై పట్టణంలో జన్మించింది. నటనలోనే కాకుండా కధకురాలిగా, నిర్మాతగా అనుభవముంది. ఈవిడ తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో నటించింది.
సుహాసిని, ప్రసిద్ధ భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ కూతురు. 1988లో ఈమె ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నంను పెళ్ళిచేసుకున్నది. వీరికి 15 యేళ్ళ వయసున్న కొడుకు ఉన్నాడు.
1996లో, దర్శకత్వములో అడుగుపెట్టి, జి.వి.ఫిల్మ్స్ నిర్మించిన ఇందిర సినిమాకు దర్శకత్వం వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే కూడా సుహాసినినే సమకూర్చింది. ఈమె మరియు ఈమె భర్త, తమ సొంత చిత్ర నిర్మాణ సంస్థ, మద్రాస్ టాకీస్ యొక్క నిర్వహణా పనులు చూసుకుంటూ ఉంటారు. మద్రాస్ టాకీస్ లో మణిరత్నం సోదరుడు కీశే.జి.శ్రీనివాసన్ కూడా ఉండేవారు. సుహాసిని 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మక జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమనటి) అవార్డు అందుకున్నది.
ఈమె తమిళ, తెలుగు మరియు కన్నడతో పాటు మళయాళము భాషా చిత్రాలలో కూడా నటించినది. 1999లో ఎ.ఎఫ్.ఐ చిత్రోత్సవముకు ఎన్నికైన వానప్రస్థమ్ సినిమాలో సుహాసిని తన నటనకుగాను ప్రశంసలందుకున్నది.
విషయ సూచిక |
చిత్రసమాహారం [మార్చు]
నటిగా [మార్చు]
తెలుగు [మార్చు]
|
|
|
ఇతర భాషలు [మార్చు]
|
|
|
దర్శకురాలిగా [మార్చు]
- ఇందిర (1996)
కధకురాలుగా [మార్చు]
నిర్మాతగా [మార్చు]
- ఇద్దరు (1997)
బాహ్య లంకెలు [మార్చు]
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుహాసిని పేజీ