(
సూఫీ తత్వం నుండి దారిమార్పు చెందింది)
సూఫీ తత్వము (ఆంగ్లం : Sufism ( అరబ్బీ : تصوّف - తసవ్వుఫ్ , పర్షియన్ భాష :صوفیگری సూఫీగరి, టర్కిష్ భాష : తసవ్వుఫ్, ఉర్దూ భాష : تصوف ) : ఇస్లాం మతము లో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[1] ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం షరియా మరియు ఫిఖహ్ లు ఇస్లామీయ ప్రధాన మార్గాలైతే, సాధారణ ముస్లిం సమూహాల ప్రకారం సూఫీ తత్వము ఒక ఉపమార్గము. ఈ సూఫీ తత్వము, దిశ, దశ, దార్శనికత మరియు మార్గ దర్శకత్వము లేని కారణంగా 'గాలివాట మార్గం' గా ముస్లింలు అభివర్ణిస్తారు. మరియు దీనిని ఉలేమాలు, బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మార్గం, మార్గ దర్శకత్వం లేనికారణంగా, అంధమార్గంగానూ, అంధవిశ్వాసాల మయంగానూ, గమ్యంలేని, స్థిరత్వంలేని మార్గంగానూ అభివర్ణించబడుతుంది. ఇవి అక్షర సత్యాలే, కాని, ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే. [2]
- 'సూఫీ' అంటే 'కంబళి బట్ట' అని అర్థం.సూఫీ తత్వవేత్తలు భౌతిక సౌఖ్యాలకు లోనుకాక, నిరాడంబరమైన కంబళి బట్టలు ధరించడం వల్ల ఈ మతానికి 'సూఫీ' అని పేరొచ్చింది.'సూఫీ' అంటే- పవిత్రతకు, (భౌతికబంధాల నుంచి) స్వేచ్ఛకు సంకేతం! సూఫీ యోగి అంతర్దృష్టితో ధ్యానతత్పరుడై, సత్యాన్వేషకుడై ఉంటాడు.ధ్యాన దైవిక ప్రేమ భావనతోపరమాత్మ లో లీనం కావడమే సూఫీ సిద్ధాంతం.ఆడంబరాలకూ దూరంగా పవిత్రంగా యోగులుగా, సన్యాసులుగా, స్వాములుగా జీవితాన్ని గడిపే వ్యక్తులు 'సూఫీలు.
- పరమాత్ముడైన శ్రీకృష్ణుని పతిగా తలచి, జీవాత్మలైన గోపికలు అతడిని విడిచి మనలేక,మధురభక్తి తో తమ మాన ప్రాణాలు అర్పించి కృష్ణుడి సాన్నిధ్యాన్ని పొందుతారు.భగవంతుడు పరమాత్మ కాగా, భక్తుడు (జీవి ) జీవాత్మ . ఈ రెండింటి అనుసంధానం జరిగేది భక్తితో. అదీ మధురమైన భావనతో. 'సూఫీ'లో నిగూఢమై ఉన్న సత్యమిదే! దీనిని సూఫీ యోగులు 'ఇష్క్ హక్కికీ' అంటారు.భారతీయ భక్తి సంప్రదాయంలో జయదేవుడు , మీరాబాయి , అన్నమాచార్య ,తులసీదాసు , చైతన్య మహాప్రభు , క్షేత్రయ్య ఈ కోవకు చెందినవారే!
- ఇస్లాం నుంచి ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన సూఫీ తత్వం కేవలం ఒక మతం కాదు. అది మత పరిధులను దాటి విశ్వచైతన్యాన్ని, భగవత్తత్వాన్ని నింపుకొన్న విశాల మధురభక్తి సిద్ధాంతం.భారతీయ సూఫీ యోగుల్లో ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ , షా హుస్సేన్ , సయ్యద్ అలీ హైదర్ , ఫర్ద్ ఫకీర్ , ఖలందర్ హజ్రత్ సాయి ఖుతాబ్ అలీ షా , హజ్రత్ సాయి రోషన్ అలీ షా , హదీబక్ష్ లు ప్రముఖులు.
- సూఫీ యోగులందరూ భగవంతునిపై ఆధారపడి జీవనం సాగించారు. నవాబులు, ప్రభువులు అందించిన కానుకలను సున్నితంగా తిరస్కరించారు. ఆర్భాటాలకు తావివ్వకుండా, అహంకార రహితులై, నామసంకీర్తనం చేస్తూ భక్తులకు సందేశాలు అందిస్తూ, సత్యాన్వేషణలో ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారు. సూఫీ వేదాంత సోపానాల్లో ఈ దశను 'ఫనా-ఫి-అల్లాహ్' అంటారు.తురీయావస్థ , సమాధి స్థితులను అంగీకరించిన సూఫీ యోగులు నిశ్చల భక్తి భావంతో, భగవత్ ప్రణయ సౌందర్యంలో తన్మయీభూతులై తమ జీవాత్మలను పరమాత్ముడైన అల్లాహ్ లో ఐక్యం చేసుకున్నారు.[3]
[మార్చు] సూఫీ తరీఖా
చైనా, కాష్గర్ లోని ఖోజా ఆఫాఖ్ సమాధి.
సూఫీ తరీఖాలు నాలుగు.
[మార్చు] కొన్ని విశేషాలు
- డబ్బు ముట్టుకోరాదు.పేదరికమే సుగుణం.
- బ్రహ్మచర్యం తప్పనిసరి కాదు.ఆధ్యాత్మిక పురోగతికి, కుటుంబ జీవితం ఆటంకం కాదు.ప్రపంచాన్ని త్యజించి క్రియారాహిత్యంతో జీవించవద్దు..భౌతిక శ్రమ తో జీవనోపాధి కల్పించుకుంటూనే భగవంతుడిని అన్వేషించాలి. రైతులుగా , నేతపని వారుగా, కసాయి పనివారుగానైనా సరే శ్రమించాలి.
- భగవంతుని పట్ల ప్రేమ, భక్తి ప్రపత్తులే మోక్షాన్ని ప్రసాదిస్తాయి.జీవాత్మ పరమాత్మతో సమైక్యమవ్వాలి.(వహదతుల్ వజుద్ ).
- భగవంతునికి, మానవులకు మధ్య ప్రేమికుల సంబంధం కాకుండా యజమాని - బానిసల సంబంధం ఉండాలి.(వహాదతుల్ షుద్ ) -- నక్షబందీ శాఖకు చెందిన షేక్ అహ్మద్ సర్హిందీ
- మక్కా, గంగ మోక్షాన్ని ఇవ్వలేవు.అహాన్ని పరిత్యజించడమే మోక్ష మార్గము.-- బుల్లేషా .
- శ్రీరాజ్ అనే హిందువును మహ్మద్ బిన్ తుగ్లక్ వజీరు గా నియమించాడు. మొఘలులు రాజపుత్రులను, మరాఠీలను ఉన్నత పదవుల్లో నియమించారు.
- కాశ్మీర్‌ను పాలించిన ‘జైనులాబిదిన్ ’ హిందూ మతాన్ని ఆదరించాడు.
- అక్బర్ అన్ని మతాలు సమానమే అన్నాడు.
- హారతి ని నిసర్ గా. దిష్టి ని నజర్ గా ముస్లింలు స్వీకరించారు. హిందువులను చూసి అత్యధిక ముస్లింలు బహుభార్యత్వాన్ని త్యజించి ఏకపత్నీవ్రతం అవలంబించారు.
- జీవాత్మ, పరమాత్మ ఐక్యమవ్వాలనే అద్వైత భావనను సూఫీలు స్వీకరించారు. బెంగాల్‌లోని సూఫీ ముస్లింలు.. సీతా, కాళీ వంటి హిందూ దేవతలను ఆరాధించారు.
- సంస్కృతంలోని వైద్య రచనలను ‘టిబ్బి - ఇ - సికిందరి’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
- ముస్లింల నుంచి రసాయన శాస్త్ర పరిజ్ఞానాన్ని, ‘జిచ్’ అనే క్యాలెండర్‌కు సంబంధించిన అంశాలను, ‘తాజిక్’ అని పిలిచే జ్యోతిష్య శాస్త్ర విభాగాన్ని హిందువులు స్వీకరించారు.
- బదౌని రామాయణాన్ని పర్షియన్‌లోకి అనువదించగా ,ముస్లిం పండితులు మహాభారతాన్ని ‘రమ్జానామా’ పేరుతో పర్షియన్‌లోకి అనువదించారు.
- అమీర్‌ఖుస్రో భారతదేశాన్ని తన మాతృభూమిగా భావిస్తూ హిందీ భాషాభివృద్ధికి కృషి చేశాడు. కవిత్వంలో భారతీయ శైలి(సబక్ -ఇ - హింద్)ని ప్రోత్సహించాడు.పర్షియన్ సంగీత సంప్రదాయాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ సంగీతం అభివృద్ధి చెందింది. అమీర్ ఖుస్రో, జైపూర్ పాలకుడు హుస్సేన్ షా షర్కీ వంటి వారు ఎన్నో కొత్త రాగాలను సృష్టించారు.
- ముస్లింలు భారతీయ వాస్తు కళలకు కమాన్, గుమ్మటం, మీనార్ (స్తంభాలు) లను జోడించారు. రంగురాళ్లను వినియోగించారు.ఉద్యాన కళను అభివృద్ధి చేశారు.బృందావనంలోని ఆలయాల్లో మొగల్ శైలి కనిపిస్తుంది. అక్బర్ నిర్మించిన ఫతేపూర్ సిక్రీలో హిందూ-ఇస్లామిక్ శైలి కనిపిస్తుంది.
- నిర్గుణ వాదుల్లో రామానందుడి శిష్యుల్లో కబీర్ ప్రసిద్ధుడు. ఆయన భగవంతుడిని రామ్, రహీమ్, అల్లా అన్నాడు..
- కాశ్మీరులోలల్లా అనే శైవయోగిని ‘రుషి’ ఉద్యమాన్ని నడిపారు.హిందువులు సూఫీ మహనీయుల సమాధులను దర్శించి నేటికీ ఆరాధిస్తున్నారు.
- సూఫీలు అద్వైత భావనతో యోగ సాధన చేశారు.‘అమృతకుండ’ అనే హర్షయోగ గ్రంధాన్ని పర్షియన్‌లోకి అనువదించుకున్నారు.నిజాముద్దీన్ చిస్తీ ఆలియా యోగ సాధన చేసి సిద్ధుడు అయ్యాడు.
మనసులో అల్లాహ్ పేరు ముద్రించి వుంటుందనే విషయాన్ని సూచించే చిత్రం. ఖాదిరి అల్-మున్‌తహీ తరీఖాకు చెందిన విశ్వాసం.
[మార్చు] సూఫీ కవిత్వం
- తనకటుగాని, ఇటుగాని సైతానుకి ఎవరన్నా పరిశుద్ధంగా కనిపిస్తే ఓర్వలేక జ్వరంతో మంచమెక్కుతాడు దుష్టుడైనా సరే తనగడ్డి వామి తగలబడితే, ఇంకవాడు ఎవడింట్లోనూ దీపం వెలిగేటందుకిష్టపడడు -- దీవి సుబ్బారావు
- నీలో ఉన్న ప్రతి భాగానికి ఒక రహస్య భాష వుంది.నీ చేతులు, కాళ్లు నువ్వేం చేశావో చెబుతాయి.-- మౌలానా రూమీ
- దిగుడుబావి నుండి ఏతంతో నీళ్లను పైకి తోడినట్లు పరుపుతో నీ కళ్లను నీటితో ఉబికిపోనీ నీ హృదయపు మాగాణి పొలంలో పచ్చటి చివురులు మొలకెత్తనీ కన్నీరు కావలిస్తే కన్నీరు కార్చేవాళ్లతో దయగా వుండు దయ కావాలిస్తే నిస్సహాయుల పట్ల దయ చూపు -- మౌలానా రూమీ
- అల్లాను ప్రేమిస్తున్నావా?' అంటే ఔను అహర్నిశలూ మరి సైతాన్ని ద్వేషిస్తున్నావా? లేదు, అందుకు సమయం ఎక్కడిది?-- రబియా
- పంచవన్నెల పింఛమే నెమలికి శత్రువు/ చాలా మంది రాజులు తలలు పోగోట్టుకోటానికి కారణం/ వారు తాల్చిన రత్నఖచిత కిరీటాలు -- హాఫిజ్ షీరాజీ
- సూఫీయోగి ఈ క్షణానికి చెందిన వారు. 'రేపు' అనటం సుతరామూ గిట్టదు.... ఫరీవుద్దీన్ అత్తార్.
[మార్చు] సూఫీ తత్వ ఆచరణా విధానాలు
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] సూఫీల జాబితా
- రాబియా బస్రీ - బస్రా, ఇరాక్ (8వ శతాబ్దము)
- బహాఉద్దీన్ నఖ్ష్ బంద్ బుఖారి 14వ శతాబ్దం, ఉజ్బెకిస్తాన్
- అల్ ఖాకిమ్ అత్-తిర్మజి 8వ శతాబ్దం, ఉజ్బెకిస్తాన్
- ఖ్వాజా అహ్మద్ యాసవి 12వ శతాబ్దం, తుర్కెస్తాన్
- ఫరీదుద్దీన్ అత్తార్ పర్షియా
- అబూ సయ్యద్ అబుల్-ఖైర్ , పర్షియా
- ఇబ్న్ అరబి , 1165- 1240
- మహ్ మూద్ షబెస్తరి , పర్షియన్ (హిజ్రీ శకం 687 - 720)
- జునైద్ బగ్దాది పర్షియన్
- బాయజీద్ బుస్తామీ , పర్షియా
- మన్సూర్ అల్-హల్లాజ్ , పర్షియా
- అబ్దుల్ ఖాదిర్ జీలాని , సున్ని, హంబలి, పర్షియన్, బాగ్దాద్ (ఇరాక్) లో సమాధి గలదు
- నజ్ముద్దీన్ కుబ్రా , పర్షియా
- జుల్-నూన్ మిస్రి , 9 వ శతాబ్దం, నుబియా (ఈజిప్టు)
- జలాలుద్దీన్ ముహమ్మద్ రూమి - 1207, పర్షియా, దర్వేషీ తరీఖా స్థాపకుడు
- అల్-సఖ్వి 831— 902
- ముల్లా నస్రుద్దీన్ , పర్షియా
- గులామ్ ముస్తఫా ఖాన్ ముజద్దిద్ 1912-2005,ఆసియా, పాకిస్తాన్
- అహ్మద్ రజా ఖాన్ 1856-1920, ఆసియా, బరేలీ మదరసా స్థాపకుడు
- ముహమ్మద్ తాహిరుల్ ఖాద్రి
- సయ్యద్ ఫైజుల్ హసన్ షా
- హజరత్ జామి - 1414, పర్షియా
- సయ్యద్ ముహమ్మద్ నఖీబ్ అల్ అత్తాస్
- ముహమ్మద్ ఇలియాస్ - 1885
- ఖలందర్ బాబా
* * ఇస్లాం సంబంధిత వ్యాసాలు * *  |
|
|
|
 |
|
- ↑ Trimingham (1998), p.1
- ↑ See: భారతదేశంలోకి ఎందరో సూఫీ సన్యాసుల ప్రవేశం పదమూడో శతాబ్దం నుంచి మొదలైంది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సూఫీ వాదాన్ని ప్రచారం చేశాడు. ఆ తర్వాత ఎన్నో సూఫీ శాఖలు (సిల్‌సిలాలు) భారతదేశంలో ప్రవేశించాయి. సాంస్కృతిక సమైక్యతకు సూఫీలు దోహద పడ్డారు.
- Esposito (2003), p.302
- Malik (2006), p.3
- B. S. Turner (1998), p.145
- Afghanistan: A Country Study. Country Studies 150. U. S. Library of Congress (Federal Research Division). తీసుకొన్న తేదీ: 2007-04-18.
- ↑ www.eenadu.net/antaryami/antarmain.asp?qry=310508anta
[మార్చు] బయటి లింకులు