Coordinates: 15°50′55″N 80°32′02″E / 15.848703°N 80.533755°E / 15.848703; 80.533755

సూర్యలంక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూర్యలంక
—  రెవెన్యూయేతర గ్రామం  —
సూర్యలంక వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖావారి కుటీరాలు
సూర్యలంక వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖావారి కుటీరాలు
సూర్యలంక వద్ద ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి శాఖావారి కుటీరాలు
సూర్యలంక is located in Andhra Pradesh
సూర్యలంక
సూర్యలంక
అక్షాంశరేఖాంశాలు: 15°50′55″N 80°32′02″E / 15.848703°N 80.533755°E / 15.848703; 80.533755
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం బాపట్ల
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సూర్యలంక బాపట్ల జిల్లా లోని బాపట్ల నుండి 9 కి.మీ.ల దూరంలో సముద్రతీరంలోనున్న ఒక పల్లె, ఇది ఒక పర్యాటక ప్రాంతం. [1] ఒకటప్పటి ప్రాచీన ఓడరేవు. ఇది మత్యకారుల పల్లె, బాపట్ల మండలం లోనిది. వీరి ప్రధాన వృత్తి చేపలవేట. ఇది సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఇక్కడ అత్యంత విశాలంగా పరుచుకుని సూర్యలంక బీచ్ ఉంది. ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచే సుమత్రా, జావా, ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారు. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కవగా బెస్తవారు నివసిస్తున్నారు. సుమారు రెండువేల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాయి. సూర్యలంకకు బాపట్లకు మధ్య భారత వాయుసేన వారి కేంద్రం (ఎయిర్‌బేస్), నివాసాలకు కాలనీలు ఉన్నాయి.

సూర్యలంక బీచ్[మార్చు]

సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబరు నెలలో తీరం వెంబడి డాల్ఫిన్‌లు కూడా చూడవచ్చు. సూర్యలంక బీచ్‌ వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటుంది. పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహం, కాటేజీలు ఉన్నాయి. ఇక్కడే ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి. సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో వాడరేవు బీచ్‌ ఉంది.సూర్యలంక వద్ద నున్న బీచ్ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహం కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "AP Tourism Authority". aptourism.gov.in. Archived from the original on 2022-09-23. Retrieved 2022-09-23.
"https://te.wikipedia.org/w/index.php?title=సూర్యలంక&oldid=3895679" నుండి వెలికితీశారు