సూర్య నమస్కారాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సూర్య నమస్కారాలలోని 12 ఆసనాల శిల్పం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ.
హస్త ఉత్తానాసనం: సూర్య నమస్కారాలలో


యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లొకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.

మంత్రాలు[మార్చు]

సూర్య నమస్కారాలలో 12 మంత్రాలు ఉన్నాయి.

మంత్రం చక్రం
బీజం వందనం
1 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం మిత్రాయ నమ: (ॐ मित्रा नमः) అనహత
2 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం రవయే నమః (ॐ रवये नमः) విశుద్ది
3 ఓం హృం (ॐ ह्रूं) ఓం సూర్యాయ నమః (ॐ सूर्याय नमः) స్వాదిష్టాన
4 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం భానవే నమః (ॐ भानवे नमः) అజ్ఞ
5 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం ఖగాయ నమః (ॐ खगाय नमः) విశుద్ది
6 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం పూష్ణే నమః (ॐ पूष्णे नमः) మణిపుర
7 ఓం హ్రాం (ॐ ह्रां) ఓం హిరణ్యగర్భాయ నమః (ॐ हिरण्यगर्भाय नमः) స్వాదిష్టాన
8 ఓం హ్రీం (ॐ ह्रीं) ఓం మరీచయే నమః (ॐ मरीचये नमः) విశుద్ది
9 ఓం హృం (ॐ ह्रूं) ఓం ఆదిత్యాయ నమః (ॐ आदित्याय नमः) అజ్ఞ
10 ఓం హ్రైం (ॐ ह्रैं) ఓం సవిత్రే నమః (ॐ सवित्रे नमः) స్వాదిష్టాన
11 ఓం హ్రౌం (ॐ ह्रौं) ఓం అర్కాయ నమః (ॐ अर्काय नमः) విశుద్ది
12 ఓం హ్రా: (ॐ ह्रः) ఓం భాస్కరాయ నమః (ॐ भास्कराय नमः) అనహతసూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.

ఉపయోగాలు[మార్చు]

సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పద్ధతి[మార్చు]

ఆసనం శ్వాస చిత్రం
1 నమస్కారాసనం
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.
నిశ్వాస 1Pranamasana.JPG
2 హస్త ఉత్తానాసనం
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.
ఉఛ్ఛ్వాశ 2Urdva Hastasana.JPG
3 పాదహస్తాసనం
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.
నిశ్వాస Fb1.jpg
4 ఆంజనేయాసనం
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
ఉఛ్ఛ్వాశ 100px
5 పర్వతాసనం
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
నిశ్వాస
6 సాష్టాంగ నమస్కారం
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
శ్వాస పట్టి ఉంచాలి 6Ashtanga Namaskara.JPG
7 సర్పాసనం
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.
ఉఛ్ఛ్వాశ Suryathon2.jpg
8 పర్వతాసనం
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
నిశ్వాస Suryathon6.jpg
9 ఆంజనేయాసనం
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి
ఉఛ్ఛ్వాశ 100px
10 పాదహస్తాసనం
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.(Standing Forward Bend pose)
నిశ్వాస Fb1.jpg
11 హస్త ఉత్తానాసనం
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.
ఉఛ్ఛ్వాశ 2Urdva Hastasana.JPG
12 నమస్కారాసనం
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి
నిశ్వాస 1Pranamasana.JPG