సూర్య (నటుడు)
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| సూర్య శివకుమార్ | |
| జన్మ నామం | శరవణన్ శివకుమార్ |
| జననం | జూలై 23 1975 (వయసు 36) |
| క్రియాశీలక సంవత్సరాలు | 1997–ప్రస్తుతం |
| భార్య/భర్త | జ్యోతిక (2006–ప్రస్తుతం) |
సూర్య (జననం: జులై 23, 1975) ప్రముఖ తమిళ నటుడు. ఆయన తండ్రి శివకుమార్ నటుడు. 2009 నాటికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు.
[మార్చు] బాల్యం
సూర్య జులై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్ లో పెరిగాడు. ముగ్గురు పిల్లల్లో సూర్య పెద్దవాడు. సూర్య తమ్ముడు కార్తీక్ కూడా నటుడు. చెల్లెలు పేరు బృందా శివకుమార్.
పాఠశాల విద్య చెన్నై కి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు.
[మార్చు] తొలి నటనా జీవితం
1996 -2002 ఇతని మొదటి సినిమా నెరుక్కు నెర్.ఇది వసంత్ గారిచే డైరెక్ట్ చేయబడింది.దీనిని మణిరత్నం గారు నిర్మించారు.తర్వాత ఇతను ప్రముఖ మళయాల దర్శకుడు సిధ్ధిక్ గారి ఫ్రెండ్స్ సినిమాలో నటించారు.ఇతనికి తొలిసారిగా బ్రేక్ నిచ్చిన సినిమా బాలా దర్శకత్వంలో వచ్చిన నందా.దీనికి ఇతను తమిళనాడు ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నాడు. 2003 -2007 2003 లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కాక్కా వాక్కా అనే సినిమా తీశారు.ఇందులో హీరోయిన్ జ్యోతిక.ఈ సినిమా తో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి భార్యాభర్తలయ్యారు. సూర్య 2005 లో మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ హిట్ సినిమాలో గజినీ సినిమాలో నటించారు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
2008 -2011 2008 లో మరలా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాలో నటించారు.ఈ సినిమా లో మూడోసారిగా డ్యూయల్ రోల్ పోషించారు.ఈ సినిమాలో 16 సంవత్సారల యువకుడిగానూ,65 సంవత్సరాల ముసలివాడిగానూ నటించారు.సిక్స్ పాక్ బాడి కూడా వుంది.
2010 లో హరి దర్శకత్వంలో సింగం (యముడు) సినిమాలో నటించారు.ఇందులో అనుష్క నాయిక. ఇవే కాకుండా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రక్తచరిత్ర లో నటించారు. 2011 ఈ సంవత్సరం రెండోసారి మురుగదాస్ దర్శకత్వంలో శ్రుతిహాసన్ కథానాయిక గా సెవెంత్ సెన్స్ అనే హిట్ సినిమా వచ్చింది. 2012 ఈసంవత్సరం కేవీ అనంద్ దర్శకత్వంలో కాజల్ కథానాయిక గా మాట్రన్ అనే తమిళ సినిమా తీస్తున్నాడు. త్వరలో 2010 లో వచ్చిన సింగం (యముడు) కు సీక్వెల్ గా సింగం2 (యముడు2) ను హరి దర్శకత్వంలో తీస్తారని విశ్వసనీయ సమాచారం.