సెప్టెంబర్ 9
సెప్టెంబర్ 9, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 252వ రోజు (లీపు సంవత్సరము లో 253వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 113 రోజులు మిగిలినవి.
| << | సెప్టెంబర్ | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు[మార్చు]
- 1908 - ఆంధ్రపత్రిక ప్రారంభించబడినది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1 ఏప్రిల్ 1914 నాడు దినపత్రిక గా మారింది మద్రాసు లో (చెన్నై)
జననాలు[మార్చు]
- 1914: ప్రముఖ తెలుగు కవి, తెలంగాణావాది, కాళోజీ నారాయణరావు
- [(1895)] ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ
విశ్వనాథ సత్యనారాయణ (1895-1976) "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు.- కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఆయన మాటలలోనే "నేను వ్రాసిన పద్యముల సంఖ్య , ప్రకటింప బడినవాని సంఖ్య, సుమారు ఇరువది వేలుండ వచ్చును. నేను చింపివేసినవి ఏబది వేలుండవచ్చును " . ఆయన రాసిన రచనలన్నీ కలిపితే లక్షపుటలుండవచ్చును [1].
విశ్వనాధ మాట్లాడే వెన్నెముక అని శ్రీశ్రీ వర్ణించాడు. జి.వి. సుబ్రహ్మణ్యం ఇలా చెప్పాడు - "ఆధునికాంధ్ర జగత్తులో విశ్వనాధ ఒక విరాణ్మూర్తి. వచన కవిత్వం వినా ఆయన చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు. పట్టింది బంగారం చేయని పట్టూ లేదు. గేయం వ్రాసినా, పద్యం రచించినా, ముక్తం వ్రాసినా, మహా కావ్యాన్ని రచించినా విశ్వనాధ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. వాక్కులో, వాక్యంలో, శబ్దంలో, సమాసంలో, భావంలో, భావనంలో, దర్శనంలో, విమర్శనంలో, భాషణంలో, భూషణంలో ఒక వైలక్ష్యం వెల్లివిరుస్తుంది. మహాకవిగా మనుగడ సాగించడానికి ఉండవలసిన మొదటి లక్షణం ఈ వ్యక్తిత్వం."[2]
మరణాలు[మార్చు]
- 1978 : జాక్ ఎల్. (లియోనార్డ్) వార్నర్ (ఐషెల్ బామ్) , చిత్రాల రారాజు. హాలీవుడ్ లో ప్రఖ్యాత వార్నర్ బ్రదర్స్ ఒకటి. (జ. 2 ఆగష్టు 1892)
- 1989 - తెలుగులో సుప్రసిద్ధ సినీ రచయిత ఆచార్య ఆత్రేయ.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
సెప్టెంబర్ 8 - సెప్టెంబర్ 10 - ఆగష్టు 9 - అక్టోబర్ 9 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |