సెయింట్ లూయిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెయింట్ లూయిస్ ఆర్చ్
మంచుతెరలలో సెయింట్ లూయిస్

సెయింట్ లూయిస్ ( St. Louise) అమెరికా లోని మిస్సోరీ రాష్ట్రంలో ఉన్న స్వతంత్ర్య ప్రతి పత్తి కలిగిన నగరం. సెయింట్ లూయిస్ తూర్పుసరిహద్దులలో మిసిసీపీ నది ఉత్తర, దక్షిణ, పడమట సరిహద్దులలో సెయింట్ లూయిస్ కంట్రీ ఉన్నది . మిస్సోరీ రాష్ట్రంలోనే ఇది పెద్ద నగరపాలిత ప్రాంతం. ఫ్రెంచ్ రాజు నాల్గవ లూయిస్ గౌరవార్ధం నగరానికి ఈ పేరు వచ్చింది. సెయింట్ లూయిస్ ఫ్రెంచ్, జర్మన్ ఆధిక్యతకు పేరు పొందిన నగరం. 1904లో అమెరికా మొదటి సారిగా నిర్వహించిన ఒలింపిక్ పోటీలు ఇక్కడ జరిగాయి. అదే సంవత్సరంలో వరల్డ్ ఫేర్ (ప్రపంచ సంత) ఇక్కడ నిర్వహించారు. ఇవి సెయింట్ లూయిసెన్లు గర్వకారణంగా భావిస్తారు.21వ శతాబ్దంలో ఔషధ, బయోటెక్నాలజీ, ఇతర సైన్సు సంబంధిత పరిశోధనలో సెయింట్ లూయిస్ అభివృద్ధిని సాధించింది.

సెయింట్ లూయిస్ నగరానికి చాలా మారుపేర్లు ఉన్నాయి. 'గేట్‌ వే నగరం' (ముఖద్వార నగరం) . ఇది అమెరికా పడమటి తూర్పు భాగాల మధ్య భాగంలో ఉంది కనుక ఈ పేరు వచ్చింది. ' గేట్ వే టు ది వెస్ట్' ఇది తూర్పు ప్రాంతాలనుండి పశ్చిమ ప్రాంతానికి మిస్సోరీ నది మీదుగా వలస వెళ్ళే ప్రజల వలన వచ్చింది. 'ది మౌండ్ సిటీ' మౌండ్ అంటే కృత్రిమంగా ఏర్పరచిన కొండలు. ఒకప్పుడు నగర సరిహద్దులలో ఇవి ఎక్కువగా వున్నందున ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం నగర అభివృద్ధిలో వాటిలో ఎక్కువ భాగం తొలగించబడ్డాయి. 'ది ల్యూ', 'సెయింట్ ల్యూ', 'తూర్పు పశ్చిమ నగరం', 'నదీ నగరం 'లేక 'ది 314' (సెయింట్ లూయిస్ సెంటర్ సంకేత సంఖ్య) ఇవి సెయింట్ లూయిస్‌ను ఇక్కడి ప్రజలు పిలుచుకొనే మారు పేర్లు. విమానాశ్రయ సంకేత నామం ఎస్‌టీ ఎల్ (STL).

నగర చరిత్ర[మార్చు]

ఫ్రెంచివారు ఇక్కడకు రాక పూర్వం 'మిసిసీపియన్ మౌండ్ బిల్డర్స్'నివసించిన ప్రాంతం ఇది. వారు నిర్మించిన మౌండ్స్ (కృత్రిమ కొండలు) అనేకం ప్రస్తుతం నిర్మూలించ బడినా నగరానికి 'మౌండ్ సిటీ'అనే సార్థక నామం మాత్రం మిగిలింది. ఈ నగరం స్థాపించిన శతాబ్దం గడచిన పిమ్మట యురోపియన్ల రాక ఆరంభం అయింది. 1673లో ఫ్రెంచి దేశస్థుల రాక ఆరంభం అయింది. 'లూయిస్ జోలియట్', 'జాక్యూస్ మార్క్వెట్టె' అనే ఇద్దరు ఫ్రెంచి యాత్రీకులు 1673 లో మిసిసీపీ నదీ మార్గం గుండా ప్రయాణించి ఇక్కడకు చేరుకున్నారు. 'లా సెల్లే' తరువాతి 5 సంవత్సరరాల కాలంలో ఈ మొత్తం కొడ్ ప్రాంతాన్ని ఫ్రెంచిదేశం కోసం సంపాదించాడు. అతడు 'లూయిస్ 14'రాజు జ్ఞాపకార్ధం ఆ ప్రదేశానికి' లూయిసియానా'గా నామకరణం చేశాడు. ఫ్రెంచ్ వాళ్ళు ఆ ప్రదేశాన్ని ఇల్లినోయిస్గా కూడా పిలుస్తూ వచ్చారు. ప్రస్తుతం సెయింట్ లూయిస్ ఉన్న ప్రాంతంలో 1699లో మిసిసీపీ నదీతీరంలో 'కహోకియా' (Cahokia) ప్రాంతంలో ఒప్పందం చేసుకొని దానిని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. తరువాతి కాలంలో 1703 లో జరిగిన ఒప్పందంలో 'కాస్‌కాస్‌కియా' (Kaskaskia) నదీ దిగువభాగంలో జరిగిన ఒప్పందం తరువాత కాథలిక్ ప్రీస్టులు ప్రస్తుతం సెయింట్ లూయిస్ ప్రాంతంలో చిన్న మిషనరీని స్థాపించారు. తరువాతి కాలంలో దానిని మిసిసీపీ అవతలి తీరానికి మార్చారు.
1763లో 'పియరే లాక్లేడే'అతని తమ్ముడు 'అగస్టే చౌట్యూ'కొంతమంది ఒప్పంద పనిమనుషులను తీసుకొని మిస్సోరీ నదిగుండా ప్రయాణిస్తూ నది దుగువ భాగానికి వచ్చి ఇక్కడ ట్రేడ్ పోస్ట్ (వ్యాపారకూడలి) స్థాపించాడు. తరువాత నవంబరులో కొంచం దిగువ భా గానికి ప్రయాణించి నది తీరంలో ఉన్న 40 అడుగుల ఎత్తైన రాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చూసి అది చలికాలం కావడంతో తిరిగి ట్రేడ్ పోస్టుకు వచ్చారు. తరువాతి ఫిబ్రవరి కాలంలో 'చౌట్యూ'30 మంది మనుషులను పంపించి నిర్మాణాలను ప్రారభించి న్యూఆర్లాండ్‌ను అనుకరిస్తూ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు. నదీ తీరాలలో జరిగిన అనేక ఒప్పందాల్తో అభివృద్ధి చెందిన నగరం కనుక ఇది నదీ నగరం. నగర ఆర్థికాభివృద్ధి నదితో ముడిపడి ఉంది.ఇక్కడి నదీతీరంలోని మెత్తని రాళ్ళు ఏటవాలుగా చెక్కి సరుకు ఎగుమతి, దిగుమతులకు అనుకూలంగా చేయడం వలన న్యూఆర్లిన్ నుండి సరుకులు ఉత్తర భాగానికి చేరవేయడానికి సెయింట్ లూయిస్ ప్రధాన కేంద్రం అయింది.
1763లో జరిగిన 'ట్రీటీ ఆఫ్ పారిస్'ఒప్పందం మిస్సోరీ తూర్పు తీర భాగాం బ్రిటన్‌కు చేరింది.కరోన్డ్‌లెట్, ఫ్లొరి సెంట్, పోర్టేజ్ డిసియోక్స్ ప్రాంతాలకు వెళ్ళారు.ప్రస్తుతం ఇవి సెయింట్ లూయిస్‌లో ఒక భాగం.1765 లో సెయింట్ లూయిస్‌ ఉప్పర్ లూసియానా రాజధాని అయింది.1766 నుండి 1788 వరకు సెయింట్ లూయిస్‌ ప్రజలచే ఎన్నుకొనబడిన ఫ్రెంచ్ లెఫ్టెనెంట్ పాలనలో ఉంది.తరువాతి కాలంలో ఇది ఫ్రెంచ్ గవర్నర్ల పాలనలో ఉంది.1880 లో ఇది రహస్యంగా తిరిగి ఫ్రెంచ్ దేశానికి ఇవ్వబడింది.1803లో ప్రెసిడెంట్ థామస్ జఫర్సన్ ఆధ్వర్యంలో ఇది అమెరికాచే కోరబడింది. స్పైన్ నుండి అధికారం బదిలీ చేయడం ఒక ఉత్సవంలా చేసారు.1804 మార్చి8 న జరిగిన ఆ ఉత్సవాన్ని 'త్రీ ఫ్లాగ్స్ డే' (3 జండాల రోజు) గా అభివర్ణిస్తారు. అందుకు కారణం ముందుగా స్పెయిన్ జండాను దించి ఫ్రెంచ్ జండాను పైకెత్తారు. రెండు రోజుల తరువాత మార్చి 10వ తారీఖున ఫ్రెంచ్ జండాను దించి అమెరికా జండాను పైకెత్తారు. తర్వాతి కాలంలో ఫ్రెంచ్ దేశస్తులు అక్కడే ఉన్నారు.ఆ కారణంగా 1820 వరకూ ఫ్రెంచ్ వ్రాయనూ , చదవనూ తెలిసిన ప్రజలు అధికంగా ఉన్న నగరం సెయింట్ లూయిస్.1809 నవంబరు 9 న సెయింట్ లూయిస్ కార్పొరేషన్ గా మారింది.

స్టీమ్‌బోట్ శకం[మార్చు]

1817 జూలై 27 సెయింట్ లూయిస్‌లో జెబులన్ మిస్టర్ పైక్ రాకతో స్టీమ్‌బోట్‌ల శకం ఆరంభం అయింది.నదీ వాణిజ్యం ఈ కారణంగా చెప్పుకోదగిన అభివృద్ధి చెందింది. స్టీమ్‌ బోట్లు నది పైభాగానికి కూడా సులువుగా పోవడంతో రవాణా బాగా అభివృద్ధి చెందసాగింది.సెయింట్ లూయిస్ నుండి ఉత్తర అమెరికా దూరతీరాలకు సరుకు రవాణా చేయడానికి వీలుకలగడంతో సెయింట్ లూయిస్ అతి శీఘ్రగతిన అభివృద్ధి చెందింది.1830 నాటికి ఒకే సమయంలో సెయింట్ లూయిస్ రేవులో 150 స్టీమ్‌బోట్లు నిలవడం సాధారణం అయింది.1830 నాటికి అమెరికాలో సెయింట్ లూయిస్ పెద్దనగరాలలో ఒకటైంది.సెయింట్ లూయిస్ రేవు న్యూయార్క్ తరువాతి స్థానానికి చేరింది.
1840 లో జర్మనీ, బొహిమియా, ఇటలీ, ఐర్లాండ్ నుండి ప్రజలు సెయింట్ లూయిస్‌కు వలస రావడం ప్రారంభించారు.ఈ నగరం పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో ఐరిష్‌లో సంభవించిన ఘోరమైన కరువు (పొటాటో ఫామైనె) కారణంగా బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఇక్కడ్కు వచ్చి చేరిన వారి తో నగరం శీఘ్ర గతిన అభివృద్ధి చెందసాగింది.1840 నుండి 1860 నాటికి నగర జనాభా 20 వేలనుండి 77,860 కి చేరింది.అదే సమయంలో ప్రయాణ వసతులలో వచ్చిన మార్పులు నగరానికి కొత్త నివాసితులను విస్తారంగా తీసుకు వచ్చింది.1843 నుండి సెయింట్ లూయిస్లో ఆమనీ బస్సులు తమ సర్వీసులను ఆరంభించాయి. 1859 లో మొదటి స్ట్రీట్ కార్ మార్గం వేశారు.

ప్రకృతి వైపరీత్యాలు[మార్చు]

1846లో సెయింట్ లూయిస్ నగరం రెండు ఘోర ప్రకృతి విపత్తులను చవి చూసింది. నగరంలో కలరా వ్యాధి ప్రబలి నగర జనాభాలో 10% ప్రజలను బలి తీసుకుంది. అదే సంవత్సరం జరిగిన అగ్ని ప్రమాదం అనేక స్టీమ్‌బోట్లను దగ్ధం చేయడమే కాక నగరంలోని చాలా భాగాన్ని బూడిదగా మార్చింది. ఈ ప్రమాదం రాజకీయంగా కూడా మార్పులను తీసుకు వచ్చింది. నగర పునర్నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభం అయింది. ప్రజావసరాలు అభివృద్ధి కాసాగాయి.అగ్ని ప్రమాదం కారణంగా ఇటుకలు, రాళ్ళు మొదలైనవి నిర్మాణంలో చోటు చేసుకున్నాయి.
19 శతాబ్దంలో మిసిసీపీ నది రెండవ కాలువ నిర్మాణం జరిగింది.'సివిల్ వార్' సమయంలో మిసిసీపీ వస్తు రవాణా వ్యాపారం యుద్ధం కారణంగా తగ్గుముఖం పట్టింది.యూనియన్ సైన్యం మిసిసీపీ పై వ్యాపారాన్ని అడ్డగించింది.యుద్ధం జ్జరిగినంత సమయం ఈ నిషేధం కొనసాగింది.మిస్సోరీ ఆఖరి వరకు యూనియన్ దళాలకు విశ్వాసంగా నిలబడింది.యుద్ధసమయంలో ఇక్కడ యుద్ధ నౌకల నిర్మాణం జరిగింది.తరువాతి కాలంలో 20 వ శతాబ్దం వరకు ఇక్కడ నౌకానిర్మాణం కొనసాగింది.1874లో మొట్టమొదటి రోడ్డు మార్గం, రైల్ మార్గం 'ఈడ్స్ బ్రిడ్జ్' (వంతెన) మిసిసీపీ నదిపై నిర్మించబడింది.
1876 ఆగస్టు 26న సెయింట్ లూయిస్ కంట్రీ నుండి విడివడి సెయింట్ లూయిస్ నగరం స్వతంత్ర నగరంగా అవతరించింది.19 నుండి 20 వ శతాబ్ధాల మధ్య నగరం విస్తరించడమే కాక ఆర్థికంగా బలం పుంజుకుంది ‌.అనేకమంది ప్రముఖులకు , రచయితలకు, పారిశ్రామిక వేత్తలకు ఇది కేంద్రం అయింది.ఇక్కడ స్థాపించిన బాస్ ఎరా ఆటోమొబైల్ పరిశ్రమ స్థాపించబడి తక్కువ ధరకు వాహనాలను అందించి విజయం సాధించింది. అయితే ఆ కంపెనీ చాలారోజులు అదే పేరుతో కొనసాగలేదు.

సెయింట్ లూయిస్ లో మొదటి ఆకాశహర్మ్యం నిర్మించబడింది. చెస్ట్‌నట్ వీధిలో ఉన్న 10 అంతస్తుల ఈ భవనంలో ప్రస్తుతం మిస్సోరీ ప్రభుత్వ కార్యాలయం పనిచేస్తుంది.1892లో ఇది 'లూయిస్ సుల్లివన్‌'చే రూపకల్పన చేయబడింది.1893లో 'నికోలా టెస్లా' మొట్టమొదటి ఆకాశవాణి ప్రసంగం వినిపించాడు. సెయింట్ లూయిస్ తూర్పు తీరంలో 1892లో టొర్నాడో ఒక మైలు వెడల్పున నగరాన్ని ధ్వంసం చేసి నగరానికి విపరీతమైన నష్టం కలిగించింది.ఈ తుఫాను ఇళ్ళు, ఆసుపత్రులు, పాఠశాలలు, సెలూన్స్ (మంగలి షాప్), పార్కులు, చర్చి లు, పారిశ్రామిక నిర్మాణాలు, రైలు మార్గాలు తీవ్రంగా ధ్వంసం అయినాయి. $2.9 మిలియన్ల డాలర్ల నష్టాన్ని కలిగించిన ఈ తుఫాను అమెరికా చరిత్ర్లో ఖరీదైన టొర్నాడో (సుడిగాలి).ఈ ప్రమాదంలో 255 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.1927లో వచ్చిన టొర్నాడో (సుడిగాలి) లో చనిపోయినవారు 79 మంది , గాయ పడిన వా రు 550 మంది,1959లో వచ్చిన టొర్నాడోలో చనిపోయినవారు 21 గాయపడినవారు 345.
1916 లో ఎన్నికైన రాష్ట్ర సెనేటర్ 40 సంత్సరాల కాలం నిరంతరంగా విధులు నిర్వహించారు.రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నిభందనలు కొంచం సడలింపబడి నందువలన అమెరికఆఫ్రికనులను రక్షణరంగంలో పనిలో అనుమతించారు.ఈ విధంగా 16,000 మందికి జీవనోపాధి లభించింది.దక్షిణ ప్రాంతం నుండి శ్వేతజాతీయులను పనికోసం తీసుకురావడం తగ్గుముఖం పట్టింది.హక్కుల కోసం జరిగిన పోరాటం తరువాత భూమి హక్కు అందరికీ సమంగా లభించింది. 20 వశతాబ్దంలో నగరం పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించింది.1950 నాటికి నగరంలోని జనసంఖ్య శిఖరాలను తాకింది.ప్రయాణ రద్దీని తగ్గించడానికి ఇంటర్‌స్టేట్ హైవే నిర్మాణం చేపట్టారు.

భౌగోళికం[మార్చు]

సెయింట్ లూయిస్ వైశాల్యం 62.2 చదరపు మైళ్ళు.61.9 చదరపు మైళ్ళు భూభాగం,4.2 చదరపు మైళ్ళు జలభాగాం.మిస్సోరీ దక్షిణతీరంలో మిసిసీపీ నదీతీరంలోెత్తైన ప్రదేశంలో నగర నిర్మాణం జరిగింది.అధిక భాగం వ్యవసాయ భూమి.భూమి మైద్దానాలతో, విశాలమైన చిన్నచిన్న కొండలతో ఉంటుంది.అధిక శాతం రాతినేలలతో అనేక గుహలతో నిండి ఉంటుంది.బొగ్గు, ఇటుకమట్టి మొదలైన గనులు ఉన్నాయి.ఇక్కడ ఉన్న లైమ్‌స్టోన్ ఇక్కడి నిర్మాణానికి ఎంతో ఊపకరించింది.

వాతావరణం[మార్చు]

సెయింట్ లూయిస్ కెనడాదేశ శీతల గాలులు, నగరానికి సరిహద్దులలో ఉన్న రెండు నదుల కారణంగా ఆహ్లాదకారమైన తడి (హ్యూమిడిటీ) శాతం గాలులు ఉంటాయి.సంవత్సరంలో 48 రోజులపాటు హిమపాతం ఉంటుంది.వసంత కాలంలో ఈదురు గాలులు అధికం.సెయింట్ లూయిస్ 'టొర్నాడో 'లను ఎక్కువ మార్లు ఎదుర్కొంది.

వృక్షాలు జంతువులు[మార్చు]

నగరాన్ని స్థాపించడానికి ముందు ఇది అరణ్యాలతోనూ మైదానాలతోనూ ఈ ప్రదేశం నిండి ఉంది.ఈ ప్రదేశంలో ఓఖ్ మాపుల్, హికారీ వృక్షాలు అధికం. ఈస్టర్న్ రెడ్ రెడ్‌బడ్, సర్వీస్ బెర్రీ, ఫ్లవరింఘ్ డాగ్‌వుడ్ చెట్లూ ఉన్నాయి.నగరంలో స్థానికంగా వృక్షాలను ఎక్కువగా నాటబడ్డాయి.ఆకురాలుకాలంలో సమీపంలో రక్షిత వనాలలో కలరింగ్ (రంగు రంగుల ఆకులతో ఉండే వృక్షాలు) ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ తూర్పుదేశాల ఉడుత, తెల్ల తోక జింక, కాట్టన్ టైల్ (పత్తి తోక) కుందేలు మొదలైనవి విస్తారంగా ఉండేవి.కెనడా గూస్ (బాతు, మల్లార్డ్ డక్ (బాతు), నీటి పక్షులు అధికంగా ఉన్నాయి.గడ్డలు, పిచ్చుకలు కూడా అధికం .
లేడీ బగ్, దోమలు, ఈగలు సహజంగా అన్ని ప్రాంతాలలో ఉంటాయి ఈ కారణంగా కిటికీలకు తెరలను వేసి ఉంచుతారు.తేనెటీగలు, వృక్షఆధారిత కీటకాలు అధికం.

నగర వర్ణన[మార్చు]

సెయింట్ లూయిస్ 79 నగర ప్రాంతాలుగా విభజింపబడ్డాయి.ఇవి అధికారపూర్వ విభజన కాకున్నా ఇక్కడి అసోసేషన్లకు ఆర్థిక పరమైన గ్రాంటులేకాక వాటిని అభివృద్ధి పరచడంలో సంపూర్ణ అధికారాలూ ఉన్నాయి.అంతే కాక ఈ నగర ప్రాంతాల సాఘిక, రాజకీయ పలుకుబడి బలమైనది.కొన్నిఅవెన్యూలలో 1904లో జరిగిన ప్రపంచ వస్తుప్రదర్శన (వరల్డ్ ఫెయిర్) సందర్భంలో కట్టిన ఆకర్షణీయమైన సంప్రదాయక రాసౌధల నిర్మాణశైలిలో నిర్మించిన భవనాలు ఉన్నాయి.మగిలినవి శ్రామికులకోసం నిర్మించిన చిన్న చిన్న భవనాలు.ఇవి సంప్రదాయక సమూహాలను ఇప్పటికీ ఆకర్షిస్తున్నాయి.
వాటిలో సపరిచితమైన, కళాత్మమైన ప్రజలు ఎక్కువగా సంద్ర్శించే ప్రాంతాలు డౌన్‌టౌన్, మిడ్‌టౌన్, బెంటన్ పార్క్, కరోండ్‌లెట్, మధ్య పడమటి ప్రాంతం, క్లేటన్/టామ్ (డాగ్‌టౌన్), డచ్‌టౌన్ సౌత్, ఫారెస్ట్ పార్క్ సౌత్‌ఈస్ట్, గ్రాండ్‌ సెంటర్, ది హిల్, లాఫెట్టే స్క్వైర్, లాసెల్లే పార్క్, ఓల్డ్ నార్త్ లూయిస్, కాంప్టన్ హైట్స్, హెన్రీ షా జ్ఞాపకార్ధం నామాంతరం చెందిన 'షా', సౌత్ హాప్టన్, సౌత్ ఈస్ట్ గార్డెన్, మాడ్రి గ్రాస్ ఫెశ్టివల్కు వేదిక అయిన సౌ లార్డ్, టవర్ గ్రోవ్ ఈస్ట్, టవ్ర్ గ్రోవ్ సౌత్, అనేక పెద్ద మాన్‌షన్ (పురుషుల వసతి గృహం) లు ఉన్నహార్టెన్స్, హోల్య్ హిల్స్, సెయింట్ లూయిస్ హిల్ల్స్, వైడౌన్/స్కిన్‌కర్.
2006-2007 లో నగరప్రాంతలలో సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా 'వరల్డ్ లీడర్ షిప్ అవార్డ్ 'అందుకుంది.ఈ అవార్డ్ అందుకున్న తరువాత నగరవాసుల జీవన ప్రమాణంలో సాధించిన అభివృద్ధికి సెయింట్ లూయిస్ అంతర్జాతీయ గుర్తింపుని పొందింది.

నగర సంస్కృతి[మార్చు]

పర్యాటకరంగం[మార్చు]

సెయింట్ లూయిస్ నగరంలో అనేక మ్యూజియములు ఉన్నాయి.నగరంలోని ప్రీమియర్ పార్క్‌లో సెయింట్ లూయిస్ ఆర్ట్ మ్యూజియం ఉంది.ఫారెస్ట్ పార్క్,1904 లో ఇక్కడ నిర్వహించిన అంతర్జాతీయ వస్తుప్రదర్శన సందర్భంగా గృహాల వరసలు ఆధునిక, ప్రాచీన కళారీతుల చిత్రాలతో ఇప్పటికీ సందర్శకులను ఆకర్షించడం విశేషం.వీటిలో అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన రెమ్‌బ్రెన్ట్, వాన్‌గోఘ్, పిసారో, పికాసో చిత్రాలూ చోటు చేసుకోవడం విశేషం. సెయింట్ లూయిస్ 'ఫారెస్ట్ పార్క్' న్యూయార్క్ లో ఉన్న 'సెంట్రల్ పార్క్' కంటే పెద్దది.ఇక్కడి సిటీ మ్యూజియంలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి.కృత్రిమ గుహలు, ఆట స్థలాలు మొదలై వాటితో నూతన కళాకారుల కూటమికి అనువైన ప్రదేశంగా ఇది ఉపయోగ పడుతుంది.గ్రాండ్ సెంటర్ లో ప్రిత్జకర్ ప్రైజ్ (బహుమతి) ని పొందిన నిర్మాణ రూపశిల్పి 'టడాయో ఆండో'రూపకల్పనలో నిర్మించిన అంతర్జాతీయ ఖ్యాతి చెందిన 'పల్ట్జర్ ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్' భవనంలో ఉన్న కళల శిక్షణాలయం, సెయింట్ లూయిస్ డౌన్‌టౌన్‌‌లో ఉన్న ప్రఖ్యాత బాలల సాహిత్య రచయిత జ్ఞాపకార్ధం మ్యూజియంగా మార్చబడిన 'యూజెనే ఫీల్డ్'నివసించిన ఇల్లు, ఈ ఇంటిని రచయిత జ్ఞాపకచిహ్నంగా మార్చారు.'మిస్సోరీ హిస్టరీ మ్యూజియం'వస్తు ప్రదర్శన మాత్రమే కాక ఇతర చారిత్రక ప్రదర్శనలను నిర్వహిస్తారు.'వరల్డ్ ఫెయిర్', క్లర్క్ నౌకా యాత్ర, లూయిసియానా కొనుగోలు లాంటి చారిత్రక విషయాలకు సంబంధించిన ప్రదర్శనలు జరుగుతుంటాయి. స్థానికులచే ఫాక్స్ ది ఫాక్స్ దియేటర్ అని అభిమాంగా పిలవబడే ఈ దియేటర్, ఆధినిక హోటల్స్, ఆకర్షణీయమైన సరికొత్త షాపు (అంగడి) లతో 'సెయింట్ లూయిస్ యూనియన్ స్టేషను, కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి.

నగర వెలుపలి ప్రాంతాలలో పర్యాటక ఆకర్షణలు[మార్చు]

  • సెయింట్ లూయిస్ కౌంటీలో ఉన్న బట్టర్‌ఫ్లై హౌస్.
  • సెయింట్ లూయిస్ సమీపంలో కిర్క్ వుడ్ ఉన్న మ్యూజియమ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్.
  • అధికంగా ఉన్న స్టీమ్ లోకోమోటివ్స్, సంప్రదాయక కార్లు, అరుదైన క్రిస్లర్ టర్బైన్ కార్, బోట్ లాంటివి ఆకర్షణీయమైన వాటిలో కొన్ని.
  • కిర్క్ వుడ్ లో ఉన్న ది మ్యాజిక్ హౌస్, వరల్డ్ వేస్ చిల్డరన్స్ మ్యూజియమ్, ఎక్ష్ప్లొరేషన్ మ్యూజియమ్లో ఉన్న చిన్న పిల్లల చేతులు, చిన్న పిల్లల సాంస్కృతిక మ్యూజియమ్ .
  • సెయింట్ లూయిస్‌కు పడమట యూనివర్సిటీ సిటీలో ఉన్న వినోదానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు, రెస్టారెంట్లకు ప్రసిద్ధి చెందిన డెల్మర్ లూప్ .ఇది 2007 డేశంలోని ప్రసిద్ధ పది వీదులలో ఒకటిగా గుర్తింపు పొందింది.ఇది పిన్ బౌల్, ది పేజెంట్ లాంటి అనేక రెస్టారెంటులను నిర్మిస్తూ సెయింట్ లూయిస్ వైపు విస్తరిస్తూ ఉంది.
  • దక్షిణ సెయింట్ లూయిస్ కౌంటీ ఉన్న గ్రాంట్స్ ఫామ్ నగరంలో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాలలో ఒకటి.ఇది ఒకప్పుడు ఉల్సెస్ ఎస్.గ్రాంట్‌ కు స్వంతమైంది.ఈ తోట ఇప్పుడు అన్హ్యూసర్-బచ్ బ్రీవింఘ్ కంపనీ స్వందారులైన బచ్ కుంటుంబానికి స్వంతం.తోటను ప్రతి ఆదివారం ప్రజలు సందర్శనార్ధం తెరచి ఉంచుతారు.
  • సెయింట్ లూయిస్ లో ప్రతి సంవత్సరం నవంబరు 11 న జరిగే "ది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(అంతర్జాతీయ చలన చిత్రోత్సం)దేశంలోని చలన చిత్రోత్సవాలలో ఒకటి.
  • 1971 సెయింట్ లూయిస్‌‌లో ఆరంబించిన సెయింట్ లూయిస్ సిక్స్ ఫ్లాగ్స్ అమ్యూజియమ్ పార్క్.
  • మిస్సోరీ మొదటి ముఖ్యపట్టణం సెయింట్ చార్లెస్ .
  • సెయింట్ లూయిస్ తూర్పు ప్రాంతంలో 13 కిలోమీటర్ల దూరంలో కొలిన్స్ వెల్లీ లో ఉన్న చహోకియా మౌండ్స్.ఇవి ప్రాచీన మిస్సిసీపీ ప్రజల చిహ్నంగా జీర్ణావస్థలో ఉన్నాయి.18వ శతాబ్దంలో వీటిని నిర్మానంలో ఉపయోగించారు.ఇవి ఈ నగరానికి మౌండ్ సిటీ అనే మారుపేరు రావటానికి

కారణమైనవి.

  • ఉత్తర సరిహద్దులలో ఉన్న ఆల్టన్,ఇల్లినోయిస్ వైన్ తయారీ,గోల్ఫ్ కోర్సు, ప్రాచీన వస్తువిక్రయశాలలు.

ఉద్యానవనాలు ఇతర విహారకేంద్రాలు[మార్చు]

సెయింట్ లూయిస్ ఫారెస్ట్ పార్క్

నగరంలో ప్రభుత్వపర్యవేక్షణలో 105 పార్కులు ఉన్నాయి.అవి సమీప ప్రజలకు కూడలి ప్రదేశాలుగానూ,పుల్లలకు ఆటస్థలాలుగానూ,సమ్మర్ కసర్ట్(సంగీత కార్యక్రమాలకు)వేదికలుగానూ,టెన్నిసు, బేస్ బాలు శిక్షణా కేంద్రాలుగానూ ఉపకరిస్తున్నాయి.

  • సెయింట్ లూయిస్ పడమటి అంచులలో ఉన్న ఫారెస్ట్ పార్క్ నగరప్రాంటాలలో ఉన్న పెద్దపార్కులలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

ఇందులో అనేక ప్రత్యేక ఆకర్షణలూ చోటుచేసుకున్నాయి.వాటిలో కొన్ని.

  • సెయింట్ లూయిస్ జూలాజికల్ పార్క్.
  • మున్య్గా గుర్తింపు పొందిన ముసిపల్ దియేటర్ .ఇది దేశంలోనే అతి పెద్ద బహిరంగ సంగీత వేదికలలో ఒకటి.
  • సెయింట్ లూయిస్ సైన్స్ సెంటర్ దీనిలో ప్ర్త్యేక నిర్మాణ శైలిలో కట్టబడిన మెక్ డోనాల్డ్ ప్లానిటేరియమ్ ఒక భాగం.
  • సెయింట్ లూయిస్ ఆర్ట్ మ్యూజియమ్.
  • మిస్సోరీ హిస్టరీ మ్యూజియమ్ (మిస్సోరీ చారిత్రక ప్రదర్శనశాల).
  • సరసులు,సైన్స్, బహిరంగ ప్రదేశాలు.
  • షాస్ గార్డెన్గా గుర్తింపు పొందిన ది మిస్సోరీ బొటానికల్ గార్డెన్ అంతర్జాతీయ ప్రఖ్యాత వృక్షశాస్త్ర పరిశోధనలకు వేదికగా గుర్తింపు పొందింది.ఇందులో అందమైన పూల చెట్ల సమీకరణ,పొదలూ,వృక్షాలేకాక జపానీ పూదోట కూడా దీనిలో భాగమే.
  • 1964 స్థాపించబడిననాటినుండి సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ నదీ సమీపంలో ఉన్న జఫర్సన్ నేషనల్ ఎక్స్‌పోరియమ్ 90.96 ఎకరాల విస్తరించి

1803 నుండి 1890 మధ్య దేశం పడమటి దిశగా విస్తరించడాన్ని గుర్తుచేస్తూ ఉంది.పార్క మధ్య భాగంలో ఉన్న స్టైన్ లెస్ స్టీల్ ఆర్చ్ ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపు.965 అక్టోబర్ 28 పూర్తి చేయబడిన ఈ నిర్మాణం ప్రఖ్యాత భవనిర్మాణ నిపుణుడు ఎయిరో సారినెన్ రూపకల్పన చేసారు.అమెరికాలోని మానవనిర్మాణాలలో ఇది ఎత్తైన జ్ఞాపక చిహ్నం.ఆర్చ్ దిగువ భాగంలో ఉన్న వెస్ట్‌వార్డ్ ఎక్స్‌పెన్‌షన్ లో విస్తారమైన కళాచిహ్నాలతో వేలాది 19 వ శతాబ్దం నుండి ఇక్కడ నివసించి స్థిరపడిన దేశం పడమటి భాగాలలో ప్రముఖుల వివరాలు భద్రపరచబడ్డాయి.సమీపంలో ఉన్న పాత కోర్ట్ భవనం 1839 నుండి ఉన్న నగరంలోని పురాతన భవనాలలో ఒకటి.సెయింట్ లూయిస్ సంత, జూలై 4 సంబరాలు ఈ పార్కులో చోటుచేసుకోవడం విశేషం.

వినోద కార్యక్రమాలు[మార్చు]

  • దేశంలోనే రెండవ పురాతన సంగీత బృందంగా పేరుపొందిన సంగీతబృందం సెయింట్ లూయిస్‌లో 1880 సెయింట్ లూయిస్ సిమ్ఫోనీ ఆర్కెస్ట్రాగా స్థాపించబడింది.

ఈ సంగీతబృందం ప్రపంచంలోనే ప్రధాన సంగీత పురస్కారంగా గుర్తింపు పొందిన గ్రామీ అవార్డుకు 56 మార్లు ప్రతిపాదించబడి ఆరుమార్లు పురస్కారాన్ని అందుకుంది.

  • నార్త్ గ్రాండ్‌లో బౌల్‌వర్డ్‌లో ఉన్న చారిత్రాత్మక ది పావెల్ సిమ్ఫోనీ హాల్ల్ 1968 నుండి సెయింట్ లూయిస్ సిమ్ఫోనీ ఆర్కెస్ట్రాకు స్థిరంమైన స్థానంగా ఉంది.
  • ది ర్యాగ్ టైమ్,జాజ్, బ్లూస్ నృత్యాలకీ ఆరంభంనుండి సెయింట్ లూయిస్‌తో అనుబంధం ఉంది.రాక్&రోల్ కళాకారుడు చక్‌బెర్రీ స్వస్థలం సెయింట్ లూయిస్.ఇతడు ప్రతి సంవత్సరం ఇక్కడ అనేక ప్రదర్శనలిస్తుంటాడు.సౌల్‌మ్యూజిక్ కళాకారుడు ఇక్ టర్నర్, లీనా టర్నర్,జాజ్ నృత్యరీతిని రూపకల్పన చేసిన మైల్స్ డేవిస్ వారి మొదటి ప్రదర్శనను తూర్పు సెయింట్ లూయిస్ పరిసరాలలో ప్రారంభించారు.
  • గ్యాస్ లైట్ స్క్వేర్‌ 1950 నుండి 1960 వరకు సంగీతానికి వినోదానికీ శిఖరాగ్రంలో ఉండి ప్రస్తుతం నివాస గృహాలుగా మార్పుచెందటం విసేషం.
  • ప్రఖ్యాత సంగీత కళాకారులు అనేకమంది సెయింట్ లూయిస్ నుండి వచ్చినవారే.లివింగ్ తింగ్స్, షెరిల్ క్రో, గ్రావిటీ కిల్స్, స్టోరీ ఆఫ్ ది ఇయర్, మోడ్రెన్ డే జీరో, స్టిర్, స్ట్రా ఫూట్, గ్రీన్ వీల్, ల్యఊడో,7షాట్ స్క్రీమర్స్, ఎమ్‌యు330లీ, ఉర్జ్ వీరిలో ముఖ్యులు.
  • ఫారెస్ట్ పార్క్లో ఉన్న ముని దియేటర్‌లో 13,000 ఒకే సమయంలో చూసే అవకాశం కలిగి ఉంది.2007 వేసవిలో ఇది తన ఎనభై తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంది.
  • 1981 లో రూపు దిద్దుకున్న ఫాక్స్ అసోసియేషన్ దేశంలోని పెద్ద దియేట్రికల్ నిర్మాణ వ్యవస్థలలో ఒకటిగా గుర్తింపి పొందింది.ఈ సస్థ 1978లోమూసివేసిన సెయింట్ మిస్సోరీలో ఉన్న ఫాక్స్ దియేటరుని కొని దానిని 4,500 ప్రేక్షకులు వీక్షించేలాఅభివృద్ధి చేసింది.1982లో నిర్మాణపు పనులు ముగించుకొని బ్రాడ్వే నిర్మాణాలకు ప్రముఖ కేంద్రంగా మారింది.కంట్రీ స్టార్స్, రాక్, పాప్, జాజ్ కాళాకారులకు ఇది కేంద్రం.ప్రస్తుతం ఇది బ్రాడ్వే విజయవంతమైన నిర్మాణాలకు

కేంద్రమై సెయింట్ లూయిస్‌లో ప్రాముఖ్యత కలిగిన దియేటర్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది.

ఆర్ధిక రంగం[మార్చు]

  • దేశలోని అనేక ప్రముఖ సంస్థలు సెయింట్ లూయిస్ తమ కేంద్రంగా చేసుకున్నాయి.అన్హ్యూసర్-బస్చ్ బ్రివరీస్ వాటిలో ఒకటి.
  • ప్రాంతీయ బ్రోకరేజస్ అయిన స్టిఫెల్ నికోలస్, ఎడ్వర్డ్‌జోన్స్, వికోవియా కార్పొరేషన్ మొదలైనవి సెయింట్ లూయిస్ ఉన్నజాతీయ ఆర్థిక సంస్థలలో కొన్ని.
  • బ్యాటరీ తయారీ కర్మాగారం ఎనర్జిజర్.
  • ముందు రసాయనిక పరిశ్రమాగా ఆరంభమై ప్రస్తుతం జన్యు సంభతిత పంటల వైపు దృష్టి సారించిన మాన్‌శాంటో.దానిలో ఒక భాగంగా ఉండి ప్రస్తుతం విడిపోయి 1997 నుండి కొత్త పరిశ్రమగా రూపు దిద్దుకొన్న సొల్యూషియా.
  • ఔషధ కార్మాగారం ఎక్స్‌ప్రెస్ స్క్రిఫ్ట్‌‌స్ కర్మాగారం దాని వ్యాపార సంబంధిత కార్యాలయాలు సెయింట్ లూయిస్‌లో ఉన్నాయి.ఇది యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీ -

సెయింట్ లూయిస్‌ కేమ్పస్ సమీపంలో తన కొత్త కార్యాలయాం కట్టడానికి సన్నాహాలు చేస్తుంది.

  • హార్డీస్ వ్యాపార సంబంధిత కార్యాలయాలు నగర ప్రధాన ప్రదేశంలో ఉంది.
  • క్లేటన్‌లో ఎంటర్ ప్రైస్ రెంట్ ఎ కార్ సంస్థ కార్యాలయం ఉంది.
  • ఎమర్సన్ ఎలక్ట్రిక్ ప్రధాన కార్యాలయం సెయింట్ లూయిసస్‌ ఉంది.
  • సెయింట్ లూయిస్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న చార్టర్ కమ్యూనికేషన్స్ దేశంలోని బ్రాడ్వే సమాచార సంస్థలలో ఒకటి.
  • అంతర్జాతీయ ఔషధ విక్రయ సంస్థ కాట్జ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యాపార సంబంధిత కార్యాలయం సెయింట్ లూయిస్ పడమటి సరిహద్దులలో ఉంది.
  • క్లైమర్ తయారీ అయిన 20 వ శతాబ్ధపు ఆరంభంలో ప్రజాదరణ పొందిన బ్రాస్ ఎరా ఆటో మొబైల్స్‌కు సెయింట్ లూయిస్ నరం కేంద్రస్థానం.

విద్య[మార్చు]

యూనివర్శిటీ నిర్వాహక భవనం
బ్రూకింగ్ హాల్

ప్రసార రంగము[మార్చు]

జనాభా[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నివాసగృహాలకు ఏర్పడిన కొరత కారణాంగా ప్రజలు నగరానికి వెలుపలి ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకొని తరలి వెళ్ళసాగారు. ముఖ్యంగా శ్వేతజాతీయులు నగరం వెలుపలి ప్రాంతాలకు ఎక్కువగా తరలి వెళ్ళారు.ఈ కారణంగా నగర జనాభా 1950 నుండి 2000 నాటికి సగభాగం అయింది. 1980లో8,56,796 గా ఉన్న జనసంఖ్య 2000 నాటికి 348,189 గా క్షీణించింది.అయినప్పటికీ ప్రస్తుతం నగర జనాభా క్రమంగా అభివృద్ధి కాసాగింది.
2000 జనాభా లెక్కలననుసరించి నగర జనసంఖ్య 3,48,189.నివాసిత గృహాలు 1,47,076, నగరంలో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య 76,920.ఒక చదరపు మైలు జన సాంద్రత 5,622.9.ఒక చదరపు మైలు నివాస గృహాల సాంద్రత 2,847.9.నగరంలోని నివాస గృహ సమూహాలు 176, అమెరికన్ ఆఫ్రికన్లు 354.51.20%, శ్వేతజాతీయులు 43.85%, ఆసియన్లు 1.89%, స్థానిక అమెరికన్లు 0.27%, పసిఫిక్ ఐలాండర్లు 0.03%'ఇతర సంప్రదాయుకులు 0.08%, మిశ్రిత జాతీయులు 1.88%.హిస్పానికులు లేక లాటిన్లు 2.02%.నగర ఉత్తర భాగంలో అమెరికన్ ఆఫ్రికన్లు అధికం.దక్షిణ ప్రాంతంలో యురోపియన్ అమెరికన్లు అధికం.1990 నుండి 35,000 - 45,000 బోస్నియన్లు ఇక్కాడకు వలస వచ్చి స్థిరపడ్డారని అంచనా.
నగరంలో నివసిస్తున్న 147,076 కుటుంబాలలో 18 వయసు పిల్లలు నివసిస్తున్న కుటుంబాలు 25.4%, వివాహం చేసుకొని ఒకటిగా జీవిస్తున్న జంటలు 26.2%, స్త్రీలు మాత్రమే ఒంటరిగా నిర్వహిస్తున్న కుటుంబాలు 21.3%.కుటుంబాలు కాకున్నా ఒకటిగా నివసిస్తున్నా వారు47.7%.40.3% ఏకాంత వాసులు.65 వయసు పైబడి ఓంటరిగా నివసిస్తున్నవారు 12.9%.సరాసరి గృహ సభ్యులు 2.30.సరాసరి కుటుంబ సభ్యులు 3.9. జనాభాలో యువత 18 వ్యసు లోపు వారు 25.7%,18 నుండి 24 వయసు వారు 10.6%,25 నుండి 44 వయసు వారు 30.9%,45 నుండి 64 వయసు వారు 19.1%,65 వయసు పైబడిన వారు13.7%.సరాసరి వివాహ వయసు 34.ప్రతి 100 మంది స్త్రీలకు పురుషులు 88.6.18 వయసున్న ప్రతి 100 మంది స్త్రీలకు 84.2 పురుషులు.
గృహ సరాసరి ఆదాయం $29,156, సరాసరి కుటుంబ ఆదాయం $32,585, పురుషుల సరాసరి ఆదాయం $31,106, స్త్రీల సరాసరి ఆదాయం $26,987, తసరి ఆదాయం $18,108.

చట్టం ప్రభుత్వం[మార్చు]

సెయింట్ లూయిస్ ప్రభుత్వం మేయర్-కౌన్సిల్ పద్ధతి ప్రభుత్వం.బోర్డ్‌ఆఫ్ ఆల్డర్‌మెన్, మేయరులు నగర పాలన భాత్యతలు నిర్వహిస్తారు.28 వార్డ్ మెంబర్స్ కలసి ఒక బోర్డ్ మెంబర్ని ఎన్నుకుంటారు.నగర మంతటి నుండి ఎన్నుకొనబడిన స్వతంత్ర అధికారుల సహాయంతో మేయ్‌ర్‌చే మరికొన్ని విశేష బాధ్యతలు నిర్వహించ బడతాయి.నిధి, ఆర్థిక వ్యహారాలు, పన్ను వసూలు మొదలైన బాధ్యతలు వీటిలో చేరుతాయి.ఆల్డర్‌మెన్ వాడుల మంచి చెడ్డలు చూస్తుంటాడు.
అమెరికా ప్రెసిదెంట్ ఎన్నిక తరువాత మేయర్ ఎన్నిక మార్చి‌లోనూ, జనరల్ ఎన్నికలు ఏప్రిల్ లోనూ జరుగుతాయి.సెయింట్ లూయిస్ మునిసిపల్ ఎన్నికలలో డెమాక్రట్లదే పై చేయి.1949 నుండి ఇక్కడ రిపబ్లికన్ మేయర్‌గా ఎన్నుకొన బడలేదు.28 ఆల్డర్మెన్ లలో 27 సభ్యులు డెమాక్క్రటిక్సే.

నేరాలు[మార్చు]

ప్రస్తుత 14వ వీధి

సెయింట్ లూయిస్ నగరంలో నేరాలు అత్యధికం.అమెరికాలో అత్యధికంగా నేరాలు జరిగే నగరాలలో మొదటి 10 స్థానాలలో సెయింట్ లూయిస్‌కూ స్థానం ఉంది. 2005 ఎఫ్‌‌బిఐ (FBI) లెక్కలను అనుసరించి సెయింట్ లూయిస్ నేరాలస్థాయి మూడవ స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది.2005 లో సెయింట్ లూయిస్ జరిగిన హత్యలు 25 వేలు. అత్యంత ప్రమాదకర నగరంగా మొదటి స్థానం ఉన్న సెయింట్ లూయిస్ మూడవ స్థానానికి వచ్చింది .2006లో నేరాలు పెరగంతో నగరం మరలా రెండవ స్థానానికి చేరుకుని అత్యంత అమెరికాలోనే ప్రమాదకర నగరంగా గుర్తించ బడింది.2007 నాటికి 15.6% నేరాలు తగ్గటంతో సెయింట్ లూయిస్ నేరాల స్థాయి 35 సంవత్సరాల తక్కువ స్థాయికి చేరుకుంది.కానీ కుటుంబ హత్యలు (హోమీ సైడ్)7 నుండి 138 కి చేరింది.ఈ వివరాలు సెయింట్ లూయిస్ నగరం ఎక్కువ నేరాలు జరుగుతున్న ప్రదేశంగా చెప్తున్నాయి.నేరలను ఇలా వివరించి స్థాయిని నిర్ణయించడాన్ని ఎఫ్‌‌బిఐ (FBI, నేరపరిశోదక సంస్థల మధ్య వివాదాస్పదమైంది.నగరాల మధ్య నేరాల స్థాయి నిర్ణయించడం కష్టమని వారి అభిప్రాయం.

నగర నిర్మాణం[మార్చు]

ప్రయాణ వసతులు[మార్చు]

సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ హైవే

నగరంలో ప్రయాణ వసతుల్లో ప్రధానమైంది ఆటోమొబైల్స్.ఈ కారణంగా నగరంలో అనేక ఇంటర్‌స్టేట్ ఫ్రీవే (రహదార్లు) లు ఉన్నాయి.అవి వరసగా ఐ-70, ఐ-55, ఐ-44, ఐ-64, ఐ-225, ఐ-170 మరియుఐ -270.అవే కాక రాష్ట్ర ప్రభుత్వ, కౌంటీ (సామంత రాజ్యం) రోడ్డు మార్గాలు ఉన్నాయి.2006 వరకు చాలా అద్వానంగా ఉన్నాయని పేరుపొందిన సెయింట్ లూయిస్ రోడ్డుమార్గాలు 2008 నాటికి అభివృద్ధి దశకు వచ్చాయి.2006-2007ల మధ్య కొన్ని సెయింట్ లూయిస్ రోడ్డుమార్గాలు పునర్నించబడ్డాయి.

విమానాశ్రయాలు[మార్చు]

సెయింట్ లూయిస్‌కు స్వంతమైన 'లాబర్ట్ సెయింట్ లూయిస్ ఇంటర్ నేషనల్ విమానాశ్రయం' సెయింట్ లూయిస్ కౌంటీ వాయవ్యంలో ఉంది.అమెరికన్ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్ లైన్స్ సర్వీసులు అధికంగా ఈ విమానాశ్రయం నుండి నిర్వహిస్తుంటారు.2003 నుండి 'అమెరికన్ ఎయిర్‌లన్స్"టి.డబ్ల్యూ.ఎ' ని కోరడం వలన విమాన సర్వీసుల సంఖ్య గుర్తింప తగినంత తగ్గుముఖం పట్టాయి. 'అమెరికన్ ఎయిర్ లైన్'కు 'లాబర్ట్ సెయింట్ లూయిస్ ఇంటర్ నేషనల్ విమానాశ్రయం' అంతర్జాతీయం కేంద్రంగా నాల్గస్థానంలో ఉన్న విమానాశ్రయం.2007 నుండి విమాన సర్వీసులు పునరుద్దరింప బడటం వలనెస్.టి.ఎల్ తిరిగి ముఖ్యత్వం సంపాదించుకుంది.ప్రస్తుతం ఇక్కడినుండి దేశీయంగా 90 నగరాలకు అనేక అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి.సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్, గ్రేట్ లేక్స్ ఎయిర్ లైన్స్ ఇక్కడినుండి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి.

ప్రభుత్వ ప్రయాణ వసతులు[మార్చు]

బై-స్టేట్ డెవలప్మెంట్ ఏజన్సీ చే నడపబడే 'మెట్రోలింక్' బస్సులు, లైట్- రైల్ ట్రైన్లు సెయింట్ లూయిసియన్లకు సేవలందిస్తున్నాయి.'మెట్రోలింక్ ' బస్సులను రెండు మార్గాలలో సర్వీసులను నడుపుతుంది.లాంబర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంనుండి సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ వరకు, సెంట్రల్, సెయింట్ లూయిస్ వెలుపలి ప్రాంతంలో ఉన్న చ్లేటన్, మిస్సోరీ, ఇల్లినోయిస్ వరకు ఈ సర్వీసులు ఉంటాయి.'మాడిసన్ కౌంటీ ట్రాన్స్‌సిస్ట్' మాడిసన్ నుండి సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ వరకూ సర్వీసులు నడుపుతుంటారు.
యూనియన్ స్టేషను‌కు ఈశాన్యంలో ఉన్న'సెయింట్ లూయిస్ అమ్‌ట్రాక్ స్టేషను 'నుండి అమ్‌ట్రాక్ నుండి చికాగో, కసాస్ సిటీ, టెక్సాస్ వరకు రైల్ సర్వీసులు నడుస్తుంటాయి.అమ్‌ట్రాక్ సర్వీసులు ఇల్లినోయిస్ లోని కిర్క్ వుడ్, ఆల్టన్ వరకు రైల్ సర్వీసులను నడుపుతుంటాయి.రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు ఇక్కడ స్ట్రీట్ కార్లు నడుపుతుండే వారు.1966 నుండి ఈ సర్వీసులు ఆపివేయబడ్డాయి.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  • మెరామిక్ జలాంతర్గత గుహలు సెయింట్ లూయిస్ నగరంలో తప్పక చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. మిస్సోరీ నది జలాల వలన భూఅంతర్భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుహలు చూపరులకు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి.