సేబాషియస్ తిత్తి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Sebaceous cyst
వర్గీకరణ & బయటి వనరులు
Inflamed epidermal inclusion cyst.jpg
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 29388
m:en:MedlinePlus 000842
MeSH {{{m:en:MeshID}}}

వెన్ అని కూడా పిలవబడే సేబాషియస్ తిత్తి చర్మం ఉపరితలం క్రింది ప్రదేశంలో హెయిర్ ఫోలికల్ యొక్క అన్నింటి కంటే పై భాగం (ఇన్ఫన్డిబ్యులం)ను పోలినటువంటి అస్తరును కలిగిన ఒక రకమైన ట్రైఖిలెమ్మల్ తిత్తి. తెలుపు వర్ణంలో గల, చిక్కని ద్రవ రూపంలో ఉన్న సీబం అనబడే కొవ్వు పదార్థంతో సేబాషియస్ తిత్తిలు నిండి ఉంటాయి.

సేబాషియస్ తిత్తులు (L72.1) ఎపిడెర్మోఎడ్ తిత్తులు (L72.0) వలె ఉంటాయి.[1] సేబాషియస్ తిత్తిని, తిత్తిలో గల పదార్థాల ఆధారంగా కాక వాటి మూలమైన సేబాషియస్ గ్రంధులు ఆధారంగా నిర్వచించడం జరిగిందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. ఈ నిర్వచనము ప్రకారం చూస్తే ఎపిడెర్మిస్ లో ఉద్భ్హవించిన కారణంగా ఎపిడెర్మోఎడ్ తిత్తి మరియు హెయిర్ ఫోలికల్ నుండి ఉద్భ్హవించిన కారణంగా పైలార్ తిత్తీ కూడా సేబాషియస్ తిత్తులుగా పరిగణింపబడవు.[2] అయినప్పటికీ, తరచుగా వాడుకలో ఈ రెండు పదాలు పరస్పరం ఒక దానికి బదులుగా ఇంకొకటి వాడబడడం జరుగుతూ ఉంటుంది.

"కచ్చితమైన" సేబాషియస్ తిత్తులు సాధారణంగా అరుదు.[3]

ప్రదర్శన[మార్చు]

చెవి తమ్మి వెనుక భాగంలో అంటు వ్యాధి సోకి పుండు పడిన ఒక సేబాషియస్ తిత్తి సమీప దృశ్యం.

అరచేతులు, అరపాదాలు - ఈ రెండు ప్రదేశాలలో తప్ప శరీరంలో ఏ ప్రదేశంలో అయినా సంభవించే అవకాశం గల సేబాషియస్ తిత్తులు తలచర్మం, చెవులు, వీపు, ముఖం మరియు చేతి పై భాగం ఈ ప్రదేశాలలో సర్వ సాధారణం. పురుషులలో ఇవి సాధారణంగా అన్డకోసం మరియు ఛాతీలో వికసించడం జరుగుతుంది.వెంట్రుకలు కలిగినటువంటి ప్రదేశాలలో సర్వసాధారణంగా ఉండే ఇవి, అధిక కాలం ఆ ప్రదేశంలో ఉన్నట్టైతే తిత్తికి సరిగ్గా పైభాగాన గల చర్మం పై వెంట్రుకలు రాలిపోవడం అనే సమస్యకు కారణం అయ్యే అవకాశం ఉంది. తాకేందుకు మృదువుగా ఉండే ఇవి సాధారణంగా గుండ్రని ఆకారం కలిగి వివిధ పరిమాణాలలో ఉంటాయి.

సాధారణంగా ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ప్రయాణించే ఈ గడ్డలు దిగువ తెలిపిన వాటిని కలిగి ఉంటాయి:

 • ఫైబ్రస్ కణజాలాలు మరియు ద్రవములు.
 • కాటేజీ చీజ్ ను పోలి ఉండే (కెరాటినస్)కొవ్వు పదార్థాన్ని కలిగి ఉన్న సందర్భంలో తిత్తిని 'కేరాటిన్ తిత్తి' అని కూడా అనవచ్చు."జున్ను" లేదా "ఫుట్ ఆడర్" వాసన ఈ పదార్థం ప్రత్యేకత.
 • ఒకింత జిగటగా ఉండే సిరో సాన్గ్యినియస్ ద్రవం (చీము, నెత్తురు పదార్థాలు కలిగినది).

సేబాషియస్ తిత్తిలోను, దాన్ని చుట్టి ఉండే కోశంలోను కలిగిన పదార్థాల స్వభావం తిత్తికి ఇది వరకు అంటువ్యాధి సోకిందా లేదా అన్న విషయం పై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా,శస్త్ర చికిత్స ద్వారా తిత్తిని పూర్తిగా తొలగించడం సాధ్యం. నాణ్యత లోపించిన శస్త్ర చికిత్సా పద్దతి లేక ఇది వరకు సోకిన అంటువ్యాధి కారణంగా మచ్చలు ఏర్పడినా లేదా తిత్తి చుట్టుపక్కల గల కణజాలానికి అతుక్కుపోవడం జరిగినా తిత్తిని గాటు పెట్టి తొలగించే సమయంలో తిత్తి పగిలిపోవడం సంభవించవచ్చు. రోగి శరీర స్వభావం తిత్తులు ఏర్పడేందుకు అనువైనది అయినప్పటికీ, అదే సాధారణ ప్రదేశంలో మరలా తిత్తి సంభవించే అవకాశం ఉన్నప్పటికీ పూర్తిగా తొలగించిన తిత్తి మరలా ఏర్పడడం అంటూ జరగదు.

కారణాలు[మార్చు]

పూడుకు పోయిన సేబాషియస్ గ్రంధులు,ఉబ్బిన హెయిర్ ఫోలికల్స్[4] మరియు అధిక మోతాదులో టెస్టోస్టీరోన్ ఉత్పత్తి ఇటువంటి తిత్తులు ఏర్పడేందుకు కారణం అవుతాయి.[5]

డెర్మటోబియా హోమినిస్ కారణంగా సేబాషియస్ తిత్తి ఏర్పడింది అని రుజువు చేసేందుకు ఒక దృష్టాంతం నమోదు చేయబడింది.

వంశపారంపర్యంగా సేబాషియస్ తిత్తులు ఏర్పడేందుకు గల కారణాలలో గార్డెనర్స్ సిండ్రోం మరియు బేసల్ సెల్ నెవ్స్ సిండ్రోం కూడా ఉన్నాయి.

చికిత్స[మార్చు]

మూస:Refimprovesect సాధారణంగా సేబాషియస్ తిత్తులకు వైద్య చికిత్స అవసరం లేదు. అయినప్పటికీ, అవి పరిమాణంలో పెరుగుతూ పోవడం జరిగితే చూసేందుకు ఎబ్బెట్టుగా ఉండడం, నొప్పి కలిగించడం, అంటు వ్యాధి సోకడం వంటి కారణాలలో ఒకటి లేదా అన్నీ సంభవించే అవకాశం ఉంటుంది.

శస్త్ర వైద్య సంబంధిత[మార్చు]

శస్త్ర చికిత్స ద్వారా సేబాషియస్ తిత్తిని తొలగించడం మాత్రమే తిత్తిని అందులోగల పదార్ధాలతో పాటు పూర్తిగా తొలగించేందుకు అనువైన, సులభమైన పద్ద్హతి.[6]

సాధారణంగా మూడు సాధారణ పద్ధతులు ఉపయోగించబడతాయి: సంప్రదాయకమైన వైడ్ ఎక్సిషన్ , మినిమల్ ఎక్సిషన్ మరియు పన్చ్ బయాప్సీ ఎక్సిషన్.[7]

సర్వ సాధారణం అయిన అవుట్ పేషెంట్ శస్త్ర వైద్య విధానంలో తిత్తిని తొలగించేందుకు , తిత్తి చుట్టూ గల ప్రదేశానికి లోకల్ అనస్థీశియా ఉపయోగించి తిమ్మిరి కలుగజేసి , స్కాల్పెల్ సహాయంతో తిత్తి మధ్య భాగానికి క్రిందుగా ఒకే ఒక గాటు పెట్టడం, లేదా కేంద్ర బిందువుకు ఇరు వైపులా కోడి గ్రుడ్డు ఆకారంలో గాట్లు పెట్టడం జరుగుతుంది. ఇందుకు బదులుగా, తిత్తి పరిమాణంలో చిన్నదిగా ఉన్నట్టు ఐతే దాన్ని పొడిచి తెరవడం జరుగుతుంది. శస్త్ర చికిత్స చేసే వ్యక్తి తిత్తి చుట్టూ పేరుకున్న కేరాటిన్ (ముఖ్యంగా సీబం, చనిపొయిన చర్మ కణాలు కలిగిన చిక్కని ద్రవ పదార్థం)ను బయటకు పిండివేసి, ఆ తర్వాత పదునుగా లేని కత్తెర లేక వేరే ఇతర పరికరం సహాయంతో గాటును బాగా తెరిచి పట్టుకుని చేతి వేళ్లు లేదా పటకారు సహాయంతో తిత్తిని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నం చెయ్యడం జరుగుతుంది. తిత్తిని ఒకే పళంగా తీసివెయ్యడం జరిగినట్టు ఐతే "స్వస్థత పరిమాణం" 100% ఉంటుంది.[citation needed] ఆ విధంగా కాక ఒక వేళ తిత్తి ముక్కలై, పూర్తిగా తొలగించడం కుదరకపోతే శస్త్ర చికిత్స చేసే వ్యక్తి కనిపిస్తూ ఉన్న మిగిలిన ముక్కలను గోకి వేసి, వాటిని ఎలెక్ట్ర్రో కాటరైజేషన్ పరికరం సహాయంతో అదే ప్రదేశంలో నాశనం చేసే ప్రయత్నంలో క్యూరట్టాజ్ (గోకుట}సహాయం తీసుకునే అవకశం ఉంది. అటువంటి సందర్భాలలో తిత్తి మరలా సంభవించవచ్చు లేదా సంభవించకపొవచ్చు. ఆ రెండు సందర్భ్హాలలోను గాటును శుభ్రపరచడం చేసి, అవసరం ఐతే గాయం పైన చర్మం మరలా దగ్గరకు కుట్టివేస్తారు. మచ్చ ఏర్పడే అవకాశాలే ఎక్కువ. కొన్ని సందర్భ్హాలలో, అంటే "స్వస్థత పరిమాణం" 100% లేనివాటిలో,గాయాన్ని అయోడిన్ ద్రావణంతో కడిగి ఏంటి సెప్టిక్ రిబ్బన్ తో నింపడం జరుగుతుంది. ఆ తర్వాత దాన్ని ఫీల్డ్ డ్రెస్సింగ్ తో కప్పి వెయ్యడం జరుగుతుంది. 7 నుండి 10 రోజులపాటు, ప్రతి రోజూ, రోజుకు ఒక పర్యాయం లేదా రెండు పర్యాయాలు రిబ్బన్ మరియు డ్రెస్సింగ్ లను మార్చాల్సి ఉంటుంది. ఆ తర్వాత గాటును కుట్టివేయడమో లేక సెకండరీ ఇన్ టెన్షన్, అంటే "క్రింది నుండి పైకి" గ్రాన్యులేషణ్ కణజాలం ఏర్పడి, తద్వారా సహజంగా పూడుకుపోయేలా విడిచి పెట్టడం చేస్తారు.

అంటు వ్యాధి సోకిన తిత్తి విషయంలో ఐతే తొలగించక మునుపూ, తొలగించిన తర్వాతా కూడా నోటి ద్వారా లోపలి తీసుకునే ఆంటిబయాటిక్స్ తీసుకోవలసి ఉంటుంది లేదా వేరే చికిత్స ఏదైనా తీసుకోవలసి ఉంటుంది.

తొలగించే విధానానికి బదులుగా గంటు పెట్టే విధానం కూడా ప్రతిపాదించబడింది.[8]

శస్త్ర వైద్య సంబంధితం కాని[మార్చు]

మరొక సాధారణమైన మరియు ఉపయుక్తమైన చికిత్సా పద్దతిలో పది రోజుల పాటు, రోజుకు రెండు పర్యయాలు తిత్తికి సరిగ్గా పైన ఒక పదిహేను నిముషాల పాటు హీటింగ్ ప్యాడ్ ను ఉంచాల్సి ఉంటుంది (తిత్తి పరిమాణం, అది ఉన్న ప్రదేశం ఆధారంగా).[9] ఈ గృహ వైద్యం కారణంగా పూర్వం ఏ అంటు వ్యాధి సోకని తిత్తికి కూడా అంటువ్యాధి సోకే అవకాశం ఉంది అన్నందుకు కొన్ని సంఘటనలు ఆధారంగా ఉన్నాయి.[citation needed] ఇందుకు కారణం అత్యధికమైన వేడి కలిగిన హీటింగ్ ప్యాడ్లు లేదా సరిగ్గా శుభ్ర పరచని హీటింగ్ ప్యాడ్లు కావచ్చు.

ఈ పద్దతిలో, తిత్తిలోగల కొవ్వు లాంటి పదార్థం వేడి కారణంగా కరిగి, శరీరం ద్వారా లోపలికి పీల్చుకోబడి కొద్ది పాటి నూనె వంటి ద్రవంగా మార్చబడుతుంది.[citation needed] శస్త్ర చికిత్స ఖర్చుతో కూడుకుని ఉన్నది, అలాగే అందులో హాని కలిగే అవకాశం కూడా ఉన్నందున శస్త్ర చికిత్సకు బదులు ఈ పద్ధతినే ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది.[by whom?] అయినప్పటికీ, నాన్ సేబాషియస్ తిత్తుల విషయంలో ఈ పద్దతిని ఉపయోగించడం వీలు కాదు ఎందుకంటే ఇతర రకాల తిత్తులు అదే విధమైన గట్టి సీబం నిల్వలు కలిగి ఉండని కారణంగా వేడికి కరిగి శరీరం ద్వారా లోపలి గ్రహించబడడం జరగదు.

చిత్రాలు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Sebaceous cysts: Causes - MayoClinic.com". సంగ్రహించిన తేదీ 2007-11-14. 
 2. "Epidermoid and Pilar Cysts Sometimes Called Sebaceous Cysts - Patient UK". సంగ్రహించిన తేదీ 2007-11-14. 
 3. "cysts - British Association of Dermatologists". సంగ్రహించిన తేదీ 2007-11-14. 
 4. మూస:MedlinePlus
 5. Zuber TJ (2002). "Minimal excision technique for epidermoid (sebaceous) cysts". Am Fam Physician 65 (7): 1409–12, 1417–8, 1420. PMID 11996426. 
 6. Klin B, Ashkenazi H (1990). "Sebaceous cyst excision with minimal surgery". American Family Physician 41 (6): 1746–8. PMID 2349906. 
 7. Moore RB, Fagan EB, Hulkower S, Skolnik DC, O'Sullivan G (2007). "Clinical inquiries. What's the best treatment for sebaceous cysts?". The Journal of family practice 56 (4): 315–6. PMID 17403333. 
 8. Nakamura M (2001). "Treating a sebaceous cyst: an incisional technique". Aesthetic plastic surgery 25 (1): 52–6. doi:10.1007/s002660010095. PMID 11322399. 
 9. "Sebaceous Cyst - Yahoo! Health". సంగ్రహించిన తేదీ 2010-08-23. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Disorders of skin appendages