సైంధవుడు
సైంధవుడు లేదా జయధ్రదుడు(సంస్కృతం:जयद्रथ) మహాభారత ఇతిహాసం లొ కౌరవులకు చెల్లెలైన దుస్సల కి పతి. జయధ్రదుడు సింధు దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. సింధు దేశాన్ని పరిపాలించేవాడు కాబట్టి సైంధవుడు అయ్యాడు.
విషయ సూచిక |
సైంధవుడు దుష్ప్రవర్తన-పరాభవం [మార్చు]
పాండవులు జూదం లో ఓడి పోయి మాట ప్రకారం వనవాసం చేస్తుంటే సైంధవుడు పాండవులు వనవాసం చేసే చోటికి వెళ్ళి పాండవులు లేని సమయం లోద్రౌపది ని చేబట్ట ప్రయత్నిస్తాడు. అప్పుడు భీముడు వాడిని చూసి వాడితో యుద్ధం జరిపి ఓడించి చంపబోతాడు. కాని యుధిష్టరుడు మాట ప్రకారం భీముడు జయధ్రదుడుని చంపకుండా వదిలి వేసి పరాభవం క్రింద గుండు గొరిగిస్తాడు.
సైంధవుడు శివుని గురించి తపస్సు [మార్చు]
పరాభవించబడ్డ సైంధవుడుడి చాలా దుఃఖించి పాండవులమీద పగ తీర్చుకోవాలని కోరికతో శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్ష్యం అయి వరాన్ని కోరగా సైంధవుడు పాండవులని సంహరించే వరాన్ని కోరతాడు. దానికి శివుడి అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుడు తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు.
చక్రవ్యూహం పన్నడం సైంధవుడుఅడ్డగించడం [మార్చు]
మహాభారత యుద్ధం లొ భీష్ముడు పతన మై ద్రోణుడు సేనాపతిగా ఉండాగా పాండవులు వీరవిహారం చేస్తుండాగా దుర్యోధనుడి కోరిక మేరపు ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. పద్మవ్యూహ విద్య పాండవులలొ అర్జునుడి కి తప్ప మిగతా ఎవ్వరకి రాదని కౌరవులకు తెలుసు , అర్జునుడిని ప్రక్కకి తప్పించడానికి ఓక ప్రణాళిక వేసి ఇద్దరౌ రాజులను అర్జునుడిని పైకి పంపుతారు. అప్పుడు పాండవ సైన్యం సమాలోచన చేస్తే అభిమన్యుడికి పద్మవ్యూహం లొ కి ప్రవేశించడం మాత్రమే తెలుస్నని బయటకు రావడం తెలియదని అంటాడు. అప్పుడు మిగిలిన పాండావులు తాము వెంటా ఉండి అభిమన్య్డుని కాపాడాతామని అభిమన్యుడీతో పద్మవ్యూహం లొకి ప్రవేశిస్తారు. పద్మవ్యూహం లొకి ప్రవేశించిన వేంటనే సైంధవుడు (జయధ్రదుడు) శివుడు ఇచ్చిన వరం ప్రకారం పాండవూలకు అడ్డం పడి వారీ వ్యూహం లొకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు.ఎంతో వీరోచితంగా పోరాడిన అభిమన్యూదు ఏకాకి కావడం చేత, ఏకాకిగా రథం క్రింద ఉన్న అభిమన్యుడీని కౌరవలు సంహరిస్తారు.సైంధవుడు అడ్డం పడడం వల్లనే అభిమన్యుడు ఏకాకి గా యి సంహరించబడ్డాడాన్న వార్త పాండవ సేన సిబిరాలకు వచ్చినప్పుడు అర్జునుడుకి తెలిసి చాలా చింతించి తరువాతి రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడిని సంహరించక పోతే తాను అగ్నికి ఆహుతి అయి పోతానని ప్రమాణం చేస్తాడు.
సైంధవ వధ [మార్చు]
అర్జునుడు చేసిన ప్రతిన కౌరవసైన్యములొ అందరికి తెలుస్తుంది. సైంధవుడి ని రక్షించడం కోసం కౌరవ సైన్యం ఒక వలయం క్రింద ఏర్పడి అర్జునుడు సైంధవుడీ వద్దకు చేరకుండా చేయాలని అందరూ వ్యూహం పన్నుతారు. అనుకొన్న ప్రణాలిక ప్రకారం కౌరవసైన్యం సైంధవుడీ వద్దకు అర్జునుడిని చేరకుండా చేస్తుంది. అర్జునుడు చాలా చింతుతుడాఇ సైంధవుడిని ఎలా సంహరించాలో ఆలోచిస్తుంటే జగన్నాటక సుత్రధారి శ్రీ కృష్ణుడు తన అసుదర్శన చక్రం తొ సూర్యుడిని అడ్డగుఇంచి సూర్యాస్తమయం అయిపోయిందనే భవన కలిగిఉస్తాడు. అర్జునుడు కూడా ఆ విషయాన్ని గ్రహించలేక సూర్యాస్తమయం అయిపోయింది ప్రాణ త్యాగం చెయ్యాలని ఆలోచిస్తుందగా శ్రీకృష్ణుడు అసలు విషయం తెలిపి తన చక్రాన్ని సూర్యుడి ముండు నుండి తొలగిస్తాడు. సూర్యాస్తమయం జరిగిందని కౌరవసైన్యం అంతా తము పన్నిన వ్యూహం నుండి సడలుతారు. ఆ విధంగా సడలడం వల్ల సైంధవుడిని వద్దకు చేర్డం చాలా తేలీక్వుతుంది. అర్జునుడు సైంద=హవుడీ తో యుద్ధం జరిపి సైంధవుడీ మీదకు పాశుపతాశ్త్రం ప్రయోసిస్తాడు. పాశుపతాస్త్రం సైంధవుడి శిరఛ్చేధం చేస్తుంది. అప్పూడు ఆ శిరస్సు నేలపై పడీ పోతుండాగా శ్రీ కృష్ణుడూ ఆ శిరస్సు నేల పై అపడారాదాని దానిని ఆ అస్త్ర సహాయం తోనే వనంలో తపస్సు చేసుకొంటున్న సైంధవుడి తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతలలొ పడేటట్లు చేయమని చెబుతాడు. సైంధవుడు శిరస్సు ఎవరి చేతులనుండి పడుతుందో వారి శిరస్సు నూరు చెక్కలు అవుతుంది. ఆ విధంగా తన తండ్రి వృద్ధాక్షాత్రుడి చేతులనుండి సైంధువుడీ శిరస్సు పడగానే వృద్ధాక్షాత్రుడు తల నూరు చెక్కలై వృద్ధాక్షాత్రుడు మరణిస్తాడు. ఈ విధంగా సైంధవుడు మాహాభారత కురుక్షేత్ర యుద్ధం లొ మరణిస్తాడు.