సైకిల్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
సైకిల్ (Cycle) ఒక సాధారణమైన రవాణా సాధనము. ఇవి మానవ శక్తితో నడపబడే రెండు చక్రాల వాహనము. వీనిని 19వ శతాబ్దంలో ఐరోపాలో మొదటిసారిగా ఉపయోగించారు. ప్రపంచంలో ప్రస్తుతం చైనా లో సైకిల్ ఉపయోగం ఎక్కువగా ఉన్నది. విశ్వవ్యాప్తంగా ఇంచుమించు ఒక బిలియను సైకిళ్ళు ఉపయోగంలో ఉన్నట్లు అంచనా[1] ఇవి మనుషులకు బొమ్మలు, వ్యాయామంలో, మిలటరీ, పోలీస్, సమాచార సరఫరా మొదలైన వివిధరకాలుగా ఉపయోగపడుతున్నాయి. సైక్లింగ్ ఒక రకమైన క్రీడ. రిక్షా ఒకరకమైన మూడు చక్రాల సైకిల్.
విషయ సూచిక |
[మార్చు] సైకిలుకు 312 ఏళ్ళు
ప్రముఖ చిత్రకారుడు లియొనార్డొ డావిన్సీ సైకిలును పోలిన రఫ్ స్కెచ్లు కొన్ని గీశాడు. 1690లో ఫ్రాన్స్ జాతీయుడు దిసివ్రాక్ సైకిలులాంటి వాహనాన్ని కతొలిసారిగా రూపొందించాడు. దాన్ని "హాబీ హార్స్" అని పిల్చేవారు. దానికి పెడల్స్ లేవు. 1840లో స్కాట్లాండ్ జాతీయుడైన కిర్క్ పాట్రిక్ మాక్మిలన్ పెడల్స్ ను జతచేసి నిజమైన సైకిలు రూపును కల్పించాడు. తర్వాత కొన్ని మార్పులకు గురి 1900 సంవత్సరంలో ఆధునికమైన సైకిలు తయారైంది. ఇది ఇప్పటి సైకిల్ మాదిరే ఉండేది.
[మార్చు] చట్టం ప్రకారం
ఐక్యరాజ్య సమితి లోని వియన్నా కన్వెన్షన్, 1968 ప్రకారం సైకిల్ ను ఒక వాహనంగా, నడిపేవాన్ని చాలకునిగా గుర్తించారు. చాలా దేశాలలో దీనిప్రకారం లైసెన్సులు కూడా అమలులో ఉన్నాయి. చీకటిలో రహదారి మీద వెళ్ళేటప్పుడు ముందు, వెనక డైనమో సహాయంతో వెలిగే దీపాలు ఉండాలి. కొన్ని దేశాలలో పాదచారులు, బండ్లు మరియు ఇతర వాహనాల కోసం గంట కూడా తప్పనిసరి.
[మార్చు] ఇతర విషయాలు
- సైకిల్ బొమ్మను ఒక ఎన్నికల గుర్తుగా భారతదేశంలో ఎన్నికల సంఘం వాడుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టేగా తెలుగుదేశం పార్టీ కు ఎన్నికల గుర్తుగా సైకిల్ బొమ్మ ఇవ్వబడినది.
[మార్చు] మూలాలు
- ↑ DidYouKnow.cd. ప్రపంచంలో బిలియను సైకిళ్ళు ఉన్నాయని మీకు తెలుసా. Retrieved 30 July 2006.