సైతాను వచనాలు

వికీపీడియా నుండి

ఖురాన్ మరియు హదిస్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలకి Satanic Verses (సైతాను వచనాలు) అని పేరు పెట్టారు. ముహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించేటప్పుడు తాను కొత్త మతాన్ని సృష్ఠిస్తున్నట్టు చెప్పుకోలేదు. అబ్రహాం (ఇబ్రహీం), మోషే (మూసా), యేసు క్రీస్తు (ఈసా) వంటి పూర్వపు ప్రవక్తల బోధనలనే బలపరిచాడు. ఖురాన్ వచనాలను ముహమ్మద్ సహచరులు రచించగా హదిస్ లని పెర్షియన్ మరియు అరబ్ చరిత్రకారులు ముహమ్మద్ ప్రవక్త చనిపోయిన తరువాత సంకలనం చెయ్యడం జరిగింది. ఖురాన్ మరియు హదిస్ ప్రవచనాలలో పొంతన లేనివి, ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైనవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఖురాన్ మరియు హదిస్ ల నుంచి తొలిగించడం కూడా జరిగింది. ఉదాహరణ: ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. ఈ దేవతల పేర్లు అల్లాత్, ఉజ్జా మరియు మనాత్. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు సల్మాన్ రష్దీ అనే రచయితను హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడం జరిగింది. ముస్లింలు ఏకేశ్వరోపాసకులు. వారు అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతారు. అష్ హదు అన్ లా ఇలహ ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం. బైబిల్ లో తొక్కి పెట్టబడిన గ్రంథములు (Apocryphal books) ఉన్నట్టే ఖురాన్ లో కూడా నిరాకరించిన ప్రవచనాలున్నాయని పూర్వపు ముస్లిం చరిత్ర కారులు వ్రాసిన నిజాల్ని నేటి ముస్లిం పండితులు నమ్మడం లేదు. ఆ ప్రవచనాలు సైతాను ప్రవచనాలు (Satanic Verses) అని ముస్లిం పండితుల వాదన. ఈ వచనాలను మొదట సేకరించినది ముస్లిం చరిత్రకారులైన అల్-వకీదీ, ఇబ్న్ సా'ద్, అత్-తబారి మరియు ఇబ్న్ ఇషాక్. వీరి చారిత్రక రచనల ఆధారంగా "ది శటానిక్ వర్సెస్" అనే నవల వ్రాసి ఖురాన్ లోని అసంగత విషయాలను బయట పెట్టినందుకు ఆ నవల రచయత సల్మాన్ రష్దీని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడంతో పాటు అతని నవలని అనేక ఇస్లామిక్ దేశాలలో నిషేదించడం జరిగింది.

పరిశీలకుల వివరణ

ఇతర మతాలకి చెందిన ఇస్లాం పరిశోధకులు ఇస్లాం మత పరిణామంలో పూర్వపు మక్కాలోని విగ్రహారాధకుల నమ్మకాల ప్రభావాలు కూడా కలిసాయని అంగీకరిస్తున్నారు. విల్లియం మాంట్ గోమరీ వాట్ (William Montgomery Watt) మరియు ఆల్ఫ్రెడ్ గిల్లామ్ (Alfred Guillaume) ఇలా వివరణలు ఇస్తున్నారు "ముస్లింలు తమ మత గ్రంథాన్ని తామే వక్రీకరించి వ్రాయడం లేదా తమ ప్రవక్తని తామే అప్రతిష్ట పరచడం నమ్మశక్యం కాదు అన్న విషయం ఆధారంగా కూడా నిజాల్ని పరిశీలించాలి. ఆ సైతాను వచనాలని ఖురాన్ లో భాగాలుగా ముహమ్మదే ప్రవచించి ఉంటాడు. ఆ కథని ముస్లింలు కనిపెట్టడం లేదా ఇతర మతస్తులు ముస్లింల పై రుద్దడం ఊహలో కూడా జరిగే పని కాదు".[1] ఈ వివరణని అంగీకరించని వారు కూడా ఉన్నారు. ఎందుకంటే తొలితరం ముస్లింలలో ఎక్కువ మంది ఆ ఆడ దేవతల కథని అంగీకరించారు. వారు ఆ కథని అశుభ సందేశంగా భావించలేదు.

ఇస్లాం సంప్రదాయపు సృష్టికర్తలు కావాలని ఖురాన్ మొత్తాన్ని అప్రతిష్ట పరిచే అంతరార్థాల్ని చేర్చడం జరగదనే విశ్వాసంతోనే తొలినాటి ముస్లింలు ఈ కథని నమ్మేవారని ఫ్రెంచ్ చరిత్రకారుడు మాక్సిమ్ రోడిన్సన్ (Maxime Rodinson) అన్నారు. మొదట వారు మక్కా పాగన్ దేవతలని తక్కువ స్థాయి దేవతలుగా భావించే వారు కానీ ఆ దేవతలని పూర్తిగా తిరస్కరించ లేదు. కాల క్రమంలోనే వారు తమ పాత సంప్రదాయాల్ని వదిలి పెట్టి వాటిని పాగన్ సంప్రదాయాలుగా పరిగణించారు. ఖురాన్ రచించినది ముహమ్మద్ అనుచరులే కాబట్టి ముహమ్మద్ ప్రమేయం గానీ అనుమతి గానీ లేకుండా ఆ కథ ఖురాన్ లో ఎలా చేరుతుందని ప్రశ్నించేవారు ఉన్నారు. కానీ ఈ తరం ముస్లిం పండితులు మాత్రం ఈ వచనాలని ముహమ్మద్ గానీ దేవుడు గానీ ప్రవచించే అవకాశం లేదని వాదిస్తున్నారు. పరిశీలకులు ముస్లిం పండితుల సమాధానాలని అంగీకరించడం లేదు. హదీసులు చారిత్రకమైనవని అనుకున్నా ఈ సందర్భంలో ముహమ్మద్ ప్రవర్తనని పరిశీలిస్తే అతను ఇంతకు ముందు చేసిన ప్రవచనాలు కూడా అబద్దాలని అనుకోవలసి వస్తుందని అంటున్నారు.

ఇవి కూడా చూడండి


మూలాలు

  1. Watt, Muhammad at Mecca