సైనికుడు (2006 సినిమా)

వికీపీడియా నుండి
సైనికుడు (2006)
TeluguFilmPoster Sainikudu 2006.jpg
దర్శకత్వం గుణశేఖర్
నిర్మాణం సి. అశ్వినీదత్
రచన గుణశేఖర్,
పరుచూరి బ్రదర్స్
తారాగణం మహేష్ బాబు,
త్రిష కృష్ణన్,
ఇర్ఫాన్ ఖాన్,
ప్రకాష్ రాజ్
సంగీతం హరిశ్ జయరాజ్
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
విడుదల తేదీ నవంబరు 30,2006
భాష తెలుగు
పెట్టుబడి 18 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సైనికుడు 2006లో విడుదలైన ఒక తెలుగు సినిమా. అంతకు ముందే మహేశ్ బాబు హీరోగా సంచలనాత్మకమైన విజయం సాధించిన పోకిరి చిత్రం వెంటనే ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలయ్యింది కాని బాక్సాఫీసు వద్ద పూర్తిగా విఫలమయ్యంది.

విషయ సూచిక

[మార్చు] కధాగమనం

సిద్దార్ద (మహేష్ బాబు) ఒక స్టూడెంట్. అతడు అతని స్నేహితులు సామాజిక సేవా కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. ఒక ఘోరమైన తుఫాన్ తాకిడికి వరంగల్ పరిసరప్రాంతాలు పూర్తిగా జలమయమౌతాయి. సిదార్ద అతని స్నేహితులు చాలా మందిని రక్షిస్తారు. తుఫాను భాదితులకు ప్రభుత్వ సహాయం అందలేదని తెలుస్తుంది. ఆహార పొట్లాల పంపిణీలో ఒక కుర్రవాడు చనిపోతాడు. ఆ దృశ్యాన్ని చూడలేక పోతాడు సిద్దార్ద. అయితే తుఫాను బాధితులకు ఏడు కోట్లు విరాళంగా ఇస్తున్నానని ఆ ఏరియాలో పెద్ద దాదా అయిన పప్పూయాదవ్ (ఇర్ఫాన్ ఖాన్) చీప్ మినిస్టర్ (కోట శ్రీనివాసరావు)తో చెపుతాడు. త్వరలో జరగ బోయే ఎలక్షన్లలో నిలబడాలనే అయిడియాతో విరాళం ప్రకటిస్తాడు. పప్పూయాదవ్ తో గొదవ పెట్టుకొని అతనికి పోటీగా తన స్నేహితుడు అజయ్ ను పోటీగా నిలబెడతాడు సిద్దార్ద. తానో పెద్ద రౌడీనని తన దారికడ్డువస్తే అడ్డంగా నరికేస్తానని సిద్దార్ద గ్యాంగును బెదిరిస్తాడు పప్పూయాదవ్. అయినా పోటీనుంది విరమించుకోక పోవడంతో తన బావమరిది అయిన మొండినాని (ప్రకాష్ రాజ్) తో కలసి తనపైనే బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ చేసుకొని అది సిద్దార్ద గ్యాంగ్ చేసారని అతడిని జైలుకు పంపిస్తాడు. తరువాత ఎలక్షన్లలో గెలిచి హోం మినిస్టర్ అయిపోతాడు పప్పూ యాదవ్. పప్పూయదవ్ వరలక్ష్మి అనే అమ్మాయిని (త్రిషా) ప్రేమిస్తుంటాడు. వాళ్ళిద్దరకూ పెళ్ళి కుదిరి తాళి కట్టే సమయానికి సిద్దార్ద వరలక్ష్మిని కిడ్నాప్ చేసి ఎత్తుకు పోతాడు. అతనిపై కేసు నమోదు చేసి అతన్ని వెతుకుతుంటారు పప్పూయాదవ్ మనుషులు. ఆమెను అడ్డు పెట్టుకొని పప్పూయాదవ్ ద్వారా అతని ఎలక్షన్ వాగ్దాలను ప్రజలకు ఉపయోగపడే మంచిపనులను జరిపిస్తూ ఉంటాడు సిద్దార్ద. ముందు సిద్దార్దను అసహ్యించుకొన్న వరలక్ష్మి తరువాత మెల్లగా అతడిని ఇస్ట పడుతుంది. ఆవిషయం తెలిసిన పప్పూయదవ్ ఆమెను అడ్డు పెట్టుకొని సిద్దార్దను అంతమొందించాలనుకొంటాడు. వరలక్ష్మి ద్వారా కిడ్నాప్ కేసు విత్ డ్రా చేయించి తరువాతి ఎలక్షన్లలో పప్పూ యాదవ్‌ను విధ్యార్దుల సహాయంతో అడ్డగించి అజయ్ను గెలిపిస్తాడు సిద్దార్ద. నీ ఒక్క స్నేహితునితో నన్ను అడ్డగించడం నీవల్ల ఏమవుతుంది అన్న పప్పూ యాదవ్ మాటలకు ఒక్కడు బయలు దేరాడు వాడి వెనుక మరొకడు వెనుక మరొకడు ఇలా అందరూ వస్తారు నీలాంటి రౌడీలను తొక్కేస్తారు అంటాడు సిద్దార్ద సినిమా ముగింపులో.

[మార్చు] చిత్ర విశేషాలు

  • ఈ సినిమాలో కెమెరా పనితనం బాగుంది. ముఖ్యంగా భారీగా వేసిన వరద దృశ్యాల చిత్రీకరణ సినిమా యొక్క టెక్నికల్ విలువలను తెలియజేస్తుంది. సంగీతం ఈ సినిమాకు మరొక ప్లస్ పాయింట్. పాటలు అన్నీ హిట్టయ్యాయి. గ్రాఫిక్ పరంగా మేఘాలతో చిత్రీకరించిన ఎంతెంత దూరం అనే గీతం అద్భుతంగా ఉంటుది.
  • ఆంధ్ర ప్రదేశ్‌లో సంచలనం కలిగించి పరిటాల రవి హత్య కేసుకు సంబంధం కలిగి ఉన్నారని వాఱ్తలలో చెప్పబడే వ్యక్తుల పేర్లు, ఘటనలు కొన్ని (ఉదాహరణ - మొద్దు శీను బదులు మొండినాని) ఈ సినిమాలో అన్యాపదేశంగా చూపారు.

[మార్చు] పాటలు

  • 'బైలా బైలామో - లెస్లీ లూయిస్, అనుష్కా మంచందానీ (వివా బాండ్), సునీతా సారథి
  • ఓరుగల్లుకే పిల్లా - కారుణ్య, మాలతి, కార్తీక్, హరిణి
  • గో గో అదిగో - కేకే

ఈ సినిమా పాటలు ఐదు దేశాలలో (భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, దుబాయ్) 10 స్థానాలలో ఒకేమారు ఒక్టోబర్ 21, 2006న అవిష్కరిపబడ్డాయి. ఇందుకు ప్రత్యేకంగా ఉపగ్రహం లింకు వాడారు. [1]. పాటలు జనప్రియమయ్యాయి.[2].

[మార్చు] మూలాలు, వనరులు

  1. Ashwini Dutt Innovations. Idlebrain. తీసుకొన్న తేదీ: 23 November, 2006.
  2. "Sainikudu" slated for Nov. 30. IndiaGlitz. తీసుకొన్న తేదీ: 24 November, 2006.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు