సౌదా బింత్ జమా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సౌదా బింత్ జమా (అరబ్బీ: سودة بنت زمعة‎) ప్రవక్త ముహమ్మద్ గారి భార్య. ముస్లింలు ఈవిడని విశ్వాసుల తల్లిగా పరిగణిస్తారు.

చరిత్ర[మార్చు]

సౌదా బింత్ జమా తండ్రి జమా ఇబ్న్ ఖయ్స్. ఈయన మక్కా లోని అమీర్ ఇబ్న్ లువాయ్ అనే ఖురేషి తెగకు చెందినవారు. తల్లి అల్-షముస్ బింత్ ఖయ్స్. ఈవిడ మదీనాలోని బను నజ్జర్ అనే బను ఖజరాజ్ తెగకు చెందినవారు.[1] ఈవిడ వివాహం మెదట అస్-సక్రన్ ఇబ్న్ అమ్ర్ తొ జరిగింది. వీరికి కుమారుడు అబ్దుర్ రహ్మాన్ ఇబ్న్ సక్రన్ 637 సంవత్సరంలో జరిగిన జలులా యుద్ధంలో మరణించాడు.[2]

అబిసీనియాకు వలస[మార్చు]

మక్కా లోని బహుదైవారాధకులు హింసించటంతో సౌదా, అస్-సక్రన్ అబిసేనియాకు వలస వెళ్లారు.[1] అస్-సక్రన్ అబిసేనియా నుండి వకాస్ వెళ్లి అక్కడ బోధించారు. అయితే మక్కాకు తిరిగి రావటంతో ఆయన మరణించాడు.[3]

ప్రవక్తతో వివాహం[మార్చు]

సౌదా బింత్ జమా, అల్లాహ్ మార్గంలో అబిసీనియాకు వలస వెళ్ళిన మొదటి మహిళ. భర్త మరణంతో తన తండ్రి వద్ద జీవించ సాగింది. మధ్య వయస్కురాలు, దయాగుణం కలిగి ప్రవక్త కుటుంబ వ్యవహారాలను జాగ్రత్తగా చూసుకోవల వ్యక్తి.[4]

ప్రవక్త మొదటగా వివాహ విషయం అబూ బకర్, సౌదాతొ మాట్లాడ వలసిందిగా ఖవ్లా బింట్ హకీమ్ కు అనుమతించారు. ఖవ్లా నేరుగా సౌదా దగ్గరకు వెళ్లి "సౌదా, అల్లాహ్ నీకు గొప్ప అదృష్టం కలిగించాడు" అని చెప్పగా సౌదా "అది ఏమిటి?" అనెను. అప్పుడు ఖవ్లా "దైవ ప్రవక్త వివాహ ప్రతిపాదన నా ద్వారా తెలియ చేయమన్నారు" అని చెప్పగానే సౌదా తననుతాను నిలువరించుకుని తనకు ప్రతిపాదన ఇష్టమే అని, తన తండ్రితో మాట్లాడవలసినదిగా కోరినారు. ఖవ్లా సౌదా తండ్రితో "ముహమ్మద్, అబ్దుల్లా గారి తనయుడు, అబ్దుల్ ముతాలిబ్ గారి మనుమడు సౌదా కొరకు వివాహ ప్రతిపాదన పంపారు" అని చెప్పగా ఆయన వెంటనే "గొప్ప సంభంధం, సౌదా ఏమని అన్నది" అన్నారు. ఖవ్లా సౌదా అభిప్రాయం తెలియచేయడంతో వెంటనే సౌదాను అక్కడకు పిలిపించి ఇలా అన్నారు "సౌదా, ఈ మహిళ అబ్దుల్లా గారి తనయుడు, అబ్దుల్ ముతాలిబ్ గారి మనుమడు అయిన ముహమ్మద్ తరపున నీకోసం వివాహ ప్రతిపాదన తీసుకువచ్చింది. ఇది గొప్ప సంభంధం. ఆయనతో పెళ్లి జరిపించామంటవా". సౌదా ఒక గొప్ప గౌరవంగా భావించి పెళ్ళి ప్రతిపాదనను అంగీకరించింది.[4]

వీరి వివాహం 620వ సంవత్సరం రంజాన్ మాసంలో జరిగింది.[5] వివాహానంతరం సౌదా ప్రవక్త గారి పిల్లలు, ఇల్లు యొక్క బాధ్యతలు నిర్వర్తించింది. అప్పటికి అయేషా బింట్ అబు బకర్ తొ వివాహ నిశ్చితార్ధం జరిగింది. సౌదా తను నమ్మిన విశ్వాసం కోసం ఇల్లు, ఆస్తి వదిలి, ఎడారులు, సముద్రం దాటి అబిసీనియాకు వలస వెళ్ళింది[4] హిజ్రా సంవత్సరం తరువాత ముస్లిం సమాజం త్వరగా వృద్ధి సాధించింది.[4]

వైధవ్యం[మార్చు]

ప్రవక్త మరణం తరువాత సంక్రమించిన ఆస్తిని దాన ధర్మాలకు వినియోగించారు. మొదటి ఖలీఫా ఉమయ్యద్ వంశానికి చెందిన మువయ్యా మదీనాలోని సౌదా గృహాన్ని 180,000 దిరాలు వెచ్చించి కొన్నారు. సౌదా ఆయేషతో చాలా దగ్గరగా వుండేవారు.[4] సౌదా సెప్టెంబర్ లేక అక్టోబర్ 674 న మదీనాలో మరణించారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Tabari, Tarikh al-Rusul wa’l Muluk. Translated by Landau-Tasseron, E. (1998). Biographies of the Prophet’s Companions and Their Successors vol. 39 p. 169. New York: SUNY Press.
  2. Vacca, V. "Sawda Bint Zamʿa." Encyclopaedia of Islam, First Edition (1913-1936). Brill Online, 2012. Reference. 2 October 2012.
  3. Tabari, Tarikh al-Rusul wa’l Muluk. Translated by Landau-Tasseron, E. (1998). Biographies of the Prophet’s Companions and Their Successors vol. 39 pp. 169-170. New York: SUNY Press.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 "Ibn Kathir, Wives of the Prophet Muhammad (SAW).". Archived from the original on 2013-08-02. Retrieved 2014-05-22.
  5. Tabari, Tarikh al-Rusul wa’l Muluk. Translated by Landau-Tasseron, E. (1998). Biographies of the Prophet’s Companions and Their Successors vol. 39 p. 170. New York: SUNY Press.

బయటి లింకులు[మార్చు]