సౌరమండలము
సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష పదార్ధాల సముదాయమే సౌరమండలం, లేదా సౌరకుటుంబం (Solar system). ఇందులో సూర్యుడు మరియు ఇతర అంతరిక్షపదార్థాలు తమలోతాము గురుత్వాకర్షణ శక్తికిలోబడి వుంటాయి: 8 గ్రహాలూ, వాటి 166 ఉపగ్రహాలూ,[1] 3 మరుగుజ్జు గ్రహాలు (సెరిస్, ప్లూటో మరియు ఎరిస్ మరియు వాటి నాలుగు చంద్రులు) మరియు బిలియన్ల కొద్దీ చిన్నశరీరాలు. ఆఖరు వర్గం గ్రహ శకలాలు, క్యూపర్ బెల్ట్ పదార్థాలూ తోకచుక్కలు ఉల్కలు మరియు గ్రహాంతర ధూళి (అంతరిక్ష ధూళి).
సంగ్రహంగా చెప్పాలంటే, సౌరమండలంలో సూర్యుడు, నాలుగు ఈవలి గ్రహాలు, ఒక గ్రహ శకలాల పట్టీ, దీనియందు చిన్న రాళ్ళ శరీరాకృతులూ, నాలుగు వాయు రాక్షస ఆవలి గ్రహాలు, మరియు రెండవ పట్టీ, క్యూపర్ బెల్ట్, వీటియందు మంచుతో కూడిన శరీరాకృతులూ. క్యూపర్ బెల్ట్ ఆవల విసరబడ్డ డిస్క్, హీలియోపాజ్, మరియు ఆఖరున ఊర్ట్ మబ్బు కలవు.
సూర్యుని నుండి దూరాన్ని బట్టి ఈవలి గ్రహాలు:
ఆవలి వాయు రాక్షసులు (జోవియన్లు) :
- బృహస్పతి, లేక గురుడు
- శని,
- యురేనస్,
- నెప్ట్యూన్.
మూడు మరుగుజ్జు గ్రహాలు :
- సెరిస్, గ్రహ శకలాల పట్టీలో అతిపెద్ద శకలం;
- ప్లూటో, క్యూపర్ పట్టీలోని తెలిసిన శరీరం; మరియు
- ఎరిస్, ఈ మూడింటిలోనూ పెద్దది మరియు విసరబడ్డ డిస్క్ లో గలదు.
ఆరు గ్రహాలకునూ రెండు మరుగుజ్జు గ్రహాలకునూ వీటి చుట్టూ పరిభ్రమించే సహజసిద్ధ ఉపగ్రహాలు సాధారణంగా వీటికి "చంద్రులు" అంటారు, మరియు ప్రతి ఆవలి గ్రహానికి కి ధూళితో కూడిన "రింగు" మరియు రేణువులు కలవు.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] మూలాలు
- ↑ Scott S. Sheppard. The Jupiter Satellite Page. University of Hawaii. తీసుకొన్న తేదీ: 2006-07-23.
[మార్చు] బయటి లింకులు
- Solar System Profile by NASA's Solar System Exploration
- NASA's Solar System Simulator
- NASA/JPL Solar System main page
- The Nine Planets – Comprehensive Solar System site by Bill Arnett
- SPACE.com: All About the Solar System
- Illustration of the distance between planets
- Illustration comparing the sizes of the planets with each other, the sun, and other stars
- Solar System Live (an interactive orrery)
- Solar System Viewer (animation)
|
||||||||||||||