సౌరవ్ గంగూలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సౌరవ్ గంగూలీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సౌరవ్ చండీదాస్ గంగూలీ
పుట్టిన తేదీ (1972-07-08) 1972 జూలై 8 (వయసు 51)
కొలకత్తా, పశ్చిమ బెంగాల్, , భారతదేశం
మారుపేరుదాదా, కొలకత్తా యువరాజు, బెంగాల్ టైగర్, మహారాజా
ఎత్తు5 ft 11 in (1.80 m)
బ్యాటింగులెఫ్ట్-హాండెడ్
బౌలింగుకుడిచేయి (ఫాస్ట్ బౌలింగ్, మీడియం)
పాత్రబాట్స్‌మన్
బంధువులుస్వేహాశీష్ గంగూలీ (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 207)1996 జూన్ 2 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2008 6 నవంబర్ - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 84)1992 జనవరి 11 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2007 15 నవంబర్ - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1989/90–2006/07బెంగాల్
2000లాంకషైర్
2005గ్లామొర్గాన్
2006నార్తాంప్‌షైర్‌
2008–ప్రస్తుతంకొలకత్తా నైట్ రైడర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్ట్ క్రికెట్ వన్ డే క్రికెట్ FC List A
మ్యాచ్‌లు 113 311 241 423
చేసిన పరుగులు 7,212 11,363 14,864 15,161
బ్యాటింగు సగటు 42.17 41.02 43.84 41.53
100లు/50లు 16/35 22/72 31/84 31/93
అత్యుత్తమ స్కోరు 239 183 239 183
వేసిన బంతులు 3,117 4,561 10,920 7,949
వికెట్లు 32 100 164 168
బౌలింగు సగటు 52.53 38.49 36.66 38.41
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 4 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 3/28 5/16 6/46 5/16
క్యాచ్‌లు/స్టంపింగులు 71/– 100/– 166/– 129/–
మూలం: CricketArchive, 2008 15 నవంబర్

1972 జూలై 8 న జన్మించిన సౌరవ్ గంగూలీ (Sourav Chandidas Ganguly) (Bengali: সৌরভ গাঙ্গুলী) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. కోల్‌కతకు చెందిన ఈ క్రీడాకారుడు టెస్ట్ కెప్టెన్ గా భారత్ కు పలు విజయాలు అందించాడు. ఎడమచేతితో బ్యాటింగ్, కుడిచేతితో మీడియం పేస్ బౌలింగ్ చేయగల గంగూలీకి బెంగాల్ టైగర్, కోల్‌కత యువరాజు, దాదా అనే ముద్దుపేర్లు ఉన్నాయి. 2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. 2003 ప్రపంచ కప్ క్రికెట్ లో ఫైనల్ చేరిన భారత జట్టుకు నాయకుడు కూడా అతనే. 2006 ప్రారంభంలో భారత జట్టునుంచి దూరమైననూ మళ్ళీ డిసెంబరులో జట్టులోకి ప్రవేశించి 2006-07 దక్షిణాఫ్రికా పర్యటనలో తన ప్రతిభను నిరూపించాడు. 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ గతి నుండి రిటైర్ అయ్యారు. గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB)కు ఐదేళ్లు, 2019 నుండి 2022 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశాడు.

బాల్యం[మార్చు]

చండీదాస్, నిరూపా గంగూలీ దంపతులకు కనిష్ఠ పుత్రుడిగా 8జులై,1972 న కోల్ కతాలో గంగూలీ జన్మించాడు. అతని తండ్రి ముద్రణా వ్యాపారం చేసేవారు. అప్పట్లో కోల్ కతాలో అత్యంత ధనవంతుల్లో అతని తండ్రి ఒకరు. గంగూలీ బాల్యం విలాసవంతంగా గడిచింది. అప్పుడే అతనికి మహారాజా అని ముద్దు పేరు వచ్చింది. గంగూలీ క్రికెట్ ఆడటం అతని తల్లిదండ్రులకు ఇష్టం లేనప్పటికి అతని అన్నయ్య స్నేహశీష్ గంగూలీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆట కొనసాగించాడు . స్నేహశీష్ అప్పటికే మంచి పేరున్న ఎడమచేతి వాటం బెంగాల్ ఆటగాడు. నిజానికి గంగూలీ కుడిచేతి వాటం వాడు అయినప్పటికీ తన అన్న పరికరాలు ఉపయొగించుకోవడం కోసం ఎడమ చేతి వాటంతో సాధన మొదలు పెట్టాడు. బ్యాట్స్ మెన్ గా గంగూలీ అద్భుత ప్రతిభ కనపర్చటంతో అతనిని క్రికెట్ అకాడమీలో చేర్చారు. సౌరవ్, అతని అన్న కోసం వారి తండ్రి ఇంట్లోనే ఒక వ్యాయామశాల ఏర్పాటు చేయించారు. తొలినాళ్ళలో గంగూలీ ఎక్కువగా ఇంగ్లాడుకు చెందిన ఎడమ చేతి వాటం ఆటగాడు డేవిడ్ గోయర్ ఆటను తిలకించే వాడు. అండర్-15 జట్టు తరుపున ఒడిషా జట్టు మీద గంగూలీ సెంచురీ సాధించటంతో అతనిని సెయింట్ జేవియర్స్ పాఠశాల జట్టుకు నాయకుడిగా నియమించారు. అయితే అతని దుందుడుకు ప్రవర్తనతో విసిగిన అనేకమంది జట్టు సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది.

వ్యక్తిగతం[మార్చు]

అతను భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి డోనా గంగూలీని వివాహం చేసుకున్నాడు. వారికి సన అనే కుమార్తె 2001లో జన్మించింది.[1]

అంతర్జాతీయ జీవితం[మార్చు]

గంగూలీ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ బై ఇన్నింగ్స్ బ్రేక్డౌన్ చూపిస్తూ పరుగులు సాధించాడు (ఎర్ర గీతలు), చివరి పది ఇన్నింగ్స్ సగటు (నీలి గీత).

అరంగేట్రం[మార్చు]

1990-91 రంజీ సీజన్ లో అనేక పరుగులు సాధించటంతో వెస్టిండీస్ తో జరగనున్న వన్డే సిరీస్ కు గంగూలీ ఎంపిక అయ్యాడు. ఆడిన మొదటి ఆటలో కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఆట పట్ల అతని తీరు మీద వచ్చిన విమర్శలతో జట్టులో స్ఠానం పోగొట్టుకున్నాడు. గంగూలీ తిరిగి దేశవాళీ క్రికెట్ 1993-94, 1994-95 సీజన్ లో అనేక పరుగులు సాధించాడు.1995-96 దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 171 పరుగుకు సాధించటంతో తిరిగి జాతీయ జట్టుకు పిలుపు వచ్చింది. ఒకే వన్డే ఆడినప్పటికీ మొదటి టెస్టులో గంగూలీకి స్థానం లభించలేదు. అయితే అదే సమయంలో కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తో వివాదం ఏర్పడటంతో నవజ్యొత్ నిద్దూ యాత్ర నుండి విరమించుకున్నాడు. అలా రెండవ టెస్టులో రాహుల్ ద్రావిడ్ తో కలిసి గంగూలీ అరంగేట్రం చేయడం జరిగింది. ప్రఖ్యాత అంపైర్ డికీ బర్డ్ కు ఇదే చివరి టెస్టు. ఈ ఆటలో గంగూలీ సెంచురీ సాధించి లార్డ్స్ లో అరంగేట్రం లోనే సెంచురీ సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డుకెక్కాడు.లార్డ్స్ అరంగేట్రంలో అత్యధిక పరుగుల రికార్డు (131) ఇంకా గంగూలీ పేరు మీదే ఉంది. టెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తరువాతి ఆటలో మళ్ళీ సెంచురీ (136) సాధించటంతో క్రికెట్ చరిత్రలో అలా చేసిన కేవలం మూడవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ తో కలిసి భాగస్వామ్యంలో చేసిన 255 పరుగులు ఆ సమయానికి భారత్ తరుపున, భారత్ బయట ఏ వికెట్ కి అయినా ఏ దేశం పై అయినా అత్యధిక పరుగుల రికార్డు.

ఆడిన మ్యాచ్లు[మార్చు]

ప్రతిపక్ష జట్టు ద్వారా టెస్ట్ మ్యాచ్ కెరీర్ ఆటతీరు బ్యాటింగ్ గణాంకాలు
ప్రతిపక్షం మ్యాచ్లు రన్లు యావరేజ్ అత్యధిక స్కొరు 100 / 50
ఆస్ట్రేలియా ఆస్టేలియా 24 1403 35.07 144 2 / 7
బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 5 371 61.83 100 1 / 3
ఇంగ్లాండ్ ఇంగ్ల్యండ్ 12 983 57.82 136 3 / 5
న్యూజీలాండ్ న్యుజీలాండ్ 8 563 46.91 125 3 / 2
పాకిస్తాన్ పాకిస్తాన్ 12 902 47.47 239 2 / 4
దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్ర్రికా 17 947 33.82 87 0 / 7
శ్రీలంక శ్రీలంక 14 1064 46.26 173 3 / 4
వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ 12 449 32.07 75* 0 / 2
జింబాబ్వే జింబబ్వె 9 530 44.16 136 2 / 1
మొత్తం 113 7212 42.17 239 16 / 35
ప్రతిపక్ష జట్టు ద్వారా వన్డే కెరీర్ ఆటతీరు బ్యాటింగ్ గణాంకాలు
ప్రతిపక్షం మ్యాచ్లు రన్లు యావరేజ్ అత్యధిక స్కొరు 100 / 50
ఆస్ట్రేలియా ఆస్టేలియా 35 774 23.45 100 1 / 5
బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 10 459 57.37 135* 1 / 4
ఇంగ్లాండ్ ఇంగ్ల్యండ్ 26 975 39.00 117* 1 / 7
న్యూజీలాండ్ న్యుజీలాండ్ 32 1079 35.96 153* 3 / 6
పాకిస్తాన్ పాకిస్తాన్ 53 1652 35.14 141 2 / 9
దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్ర్రికా 29 1313 50.50 141* 3 / 8
శ్రీలంక శ్రీలంక 44 1534 40.36 183 4 / 9
వెస్ట్ ఇండీస్ వెస్ట్ ఇండీస్ 27 1142 47.58 98 0 / 11
జింబాబ్వే జింబబ్వె 36 1367 42.71 144 3 / 7
ICC World XI 1 22 22.00 22 0 / 0
ఆఫ్రికా XI 2 120 60.00 88 0 / 1
 బెర్ముడా 1 89 89.00 89 0 / 1
 ఐర్లాండ్ 1 73 73* 0 / 1
కెన్యా కెన్యా 11 588 73.50 111* 3 / 2
నమీబియా నమీబియా 1 112 112* 1 / 0
నెదర్లాండ్స్ నెథర్లాండ్స్ 1 8 8.00 8 0 / 0
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూ.ఏ.ఈ 1 56 56.00 56 0 / 1
మొత్తం 311 11363 41.02 183 22 / 72

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Biography of Sourav Ganguly". Official website of Sourav Ganguly. Souravganguly.net. Archived from the original on 30 May 2008. Retrieved 19 May 2008.

బయటి లింకులు[మార్చు]