స్టాక్ మార్కెట్

వికీపీడియా నుండి

స్టాక్ మార్కెట్ అనునది కంపెనీ వాటా (స్టాక్) లు కొనుగోలు మరియు అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక సముదాయము. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరకా సంయుక్త రాష్త్రాల లోని న్యూయార్క్ నగరం అందలి ఎన్.వై.ఎస్.ఈ (NYSE). ప్రపంచములో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు, లండన్ , ఆమ్'స్టర్'డామ్, పారిస్, ఫ్రాంక్'ఫర్ట్, హాంగ్ కాంగ్, సింగపూర్, టొక్యొ నందు కలవు. దాదాపు అన్ని స్టాక్ ఎక్ఛేంజీలు ముఖ్యంగా ఈక్విటీ మరియు డెరివేటివ్స్ అనెడి విభాగాలలో లావాదేవీలు జరుపును.

భారత దేశంలో ముఖ్యమైన స్టాక్ ఎక్ఛేంజీలు రెండు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్ఛేంజీ (BSE) మరియు నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ (NSE). వీటినే సెన్సెక్స్ అని మరియు నిఫ్టీ అనికూడా అంటారు. వ్యాపార వేళలు ఉదయం 9.00 నుండి మద్యాహ్నం 3.30 వరకు మరియు శని మరియు ఆదివారాలు శలవు దినాలు.

విషయ సూచిక

లావాదేవీలు[మార్చు]

స్టాక్ మార్కెట్లొ ట్రేడర్లు చిన్న మదుపుదార్ల దగ్గరనుండి, సంస్థాగత మదుపుదార్ల, పెన్షన్ ఫండ్, భీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్ మరియు హెడ్జ్ ఫండ్ ట్రేడర్లు వుండెదరు. కొంతకాలం క్రిందటి వరకు ఈ స్టాక్ మార్కెట్లు పెద్ద పెద్ద భవనాలలో ట్రేడింగ్ జరుపుతూ వుంటిరి. ప్రస్తుతము అంతర్జాల మహిమ వలనూ, సాంకేతిక పరిజ్ఞానము వలన వర్చువల్ పద్దతి ప్రాచుర్యం పొందుతున్నదు.

ఫ్రాముఖ్యత[మార్చు]

వ్యాపార సంస్థలు ద్రవ్యము అప్పు తీసుకొనుటకు, మరియు వాటి వ్యాపార విలువ పెంచుకొనుటకు స్టాక్ మార్కెట్ ఒక ప్రధానమైన వనరు. వ్యాపారములు పబ్లిక్ ట్రేడింగ్ జరుపుటకు, మూలధన రుణమునకు సామాన్యముగా స్టాక్ మార్కెట్ నందు వాటి వాటా (share) లు అమ్మెదరు. ప్రస్తుత ఆర్థిక లావాదేవీలు మరియు దేశ సంపద స్టాక్ మార్కెట్ లపై ఆధారపడివుందంటె అతిసయోక్తి కాదు.

{విస్తరణ చేయవలెను. కొంచెము సమయము కావాలు. మిత్రులు ఎవరైనా సహాయం చేయవలెనన్న దయచేసి చేయండి.}


ఇవి కూడా చూడండి[మార్చు]

స్టాక్ ఎక్స్చేంజ్

బయటి లింకులు[మార్చు]