స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్, భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అనుబంధ బ్యాంకులలో ఒకటి. అన్ని అనుబంధ బ్యాంకుల వలనే ఇది కూడా స్టేట్ బ్యాంకుకు చెందిన ఉమ్మడి లోగోనే ఉపయోగిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ బ్యాంకు శాఖలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ లలో పెద్ద సంఖ్యలో ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ మాల్వా రీజియన్‌కు చెందిన బ్యాంకు.దీనిని ఇండోర్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండోర్ లిమిటెడ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతానికి అప్పటి పాలకుడు హిజ్ హైనెస్ మహారాజా తుకోజిరావ్ హోల్కర్ - 3 ప్రత్యేక చార్టర్ కింద ఏర్పాటు చేయబడింది. బ్యాంక్ ఆఫ్ ఇండోర్ లిమిటెడ్ 1960 జనవరి 1 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సబ్సిడియరీ బ్యాంక్స్) చట్టం, 1959 ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థగా మారింది.అప్పటి నుండి ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ గా పేరు మార్చబడింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ బ్యాంక్ 1962 లో ది బ్యాంక్ ఆఫ్ దేవాస్ లిమిటెడ్, 1965 లో ది దేవాస్ సీనియర్ బ్యాంక్ లిమిటెడ్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంది.1971 లో క్లాస్ 'ఎ' గ్రేడ్ కేటగిరీకి చెందిన బ్యాంకుగా గుర్తించబడింది.అప్పటినుండి బ్యాంక్ స్థిరమైన పురోగతి సాధించింది. 2009 మార్చి చివరిలో, వ్యాపార టర్నోవర్ రూ .50,000 కోట్లు దాటింది.[1]

ఎస్.బి.ఐ.లో విలీనం[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రధాన కార్యాలయం, ముంబాయి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్ అన్ని శాఖలు 2010 ఆగష్టు 27 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి.[2]

మూలాలు[మార్చు]

  1. https://in.linkedin.com/company/state-bank-of-indore[permanent dead link]
  2. India, Press Trust of (2010-08-24). "State Bank of Indore to become SBI branches from Aug 27". Business Standard India. Retrieved 2020-07-07.

బయటి లింకులు[మార్చు]