స్త్రీ

వికీపీడియా నుండి


Truth, 1870 by Jules Joseph Lefebvre

స్త్రీ లేదా మహిళ (Woman) అనగా ఆడ మనిషి. ఈ పదం సాధారణంగా పెద్దవారికి మాత్రమే ఉపయోగిస్తారు. యుక్తవయసు వచ్చేంతవరకు ఆడపిల్లలను బాలికలు అనడం సాంప్రదాయం. మహిళా హక్కులు (Woman Rights) మొదలైన కొన్ని సందర్భాలలో దీనిని వయస్సుతో సంబంధం లేకుండా వాడతారు.

విషయ సూచిక

[మార్చు] జీవశాస్త్రంలో స్త్రీ

స్త్రీ లింగ సూచన

జీవశాస్త్రం ప్రకారం, స్త్రీ జననేంద్రియాలు ప్రత్యుత్పత్తి కోసం ఉపయోగపడతాయి. అండాశయాలు హార్మోనులను తయారుచేస్తాయి మరియు అండాలు విడుదలచేస్తాయి. ఫలదీకరణంలో అండాలు పురుష శుక్ర కణాలతో సంయోగం చెంది కొత్త తరం జీవులను తయారుచేస్తాయి. గర్భాశయం పెరుగుతున్న పిండాన్ని రక్షించి కొంత పెరుగుదల వచ్చిన తర్వాత కండరాల సహాయంతో బయటకు పంపిస్తుంది. యోని పురుష సంయోగానికి మరియు పిండం జన్మించడానికి తోడ్పడుతుంది. వక్షోజాలు వంటి ద్వితీయ స్త్రీలింగ లక్షణాలు పిల్లల పోషణలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చర్మ గ్రంధుల నుండి అభివృద్ధిచెందిన పాల గ్రంధులు క్షీరదాల ముఖ్యమైన లక్షణము.

ఎక్కువమంది స్త్రీల కారియోటైపు 46,XX, అదే పురుషుల కారియోటైపు 46,XY. ఇందువలన X క్రోమోసోము మరియు Y క్రోమోసోములను క్రమంగా స్త్రీ, పురుష క్రోమోసోములు అంటారు.

మానవ స్త్రీల కారియోటైపు.


అయితే కొజ్జాలలో (Intersex) ఈ విధమైన జీవ లక్షణాలు మాత్రమే సరిపోవు. జన్యు నిర్మాణం, జననేంద్రియ నిర్మాణాలతో సహా వారి సాంఘిక, వ్యక్తిగత విషయాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వివిధ కారణాల మూలంగా చాలా దేశాలలో స్త్రీల జీవితకాలం (Life span) పురుషుల కంటే ఎక్కువగా ఉంటుంది.

చాలా మంది స్త్రీలు ఋతుచక్రం ప్రారంభమైన సమయం (రజస్వల) నుండి గర్భం దాల్చగలరు.[1] ఇది సామాన్యంగా పురుషుని వీర్యకణాల వలన జరిగినా, శాస్త్ర అభివృద్ధి వలన ఆధునిక కాలంలో కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా కూడా గర్భం దాల్చే అవకాశం కలిగింది. ఋతుచక్రాలు పూర్తిగా ఆగిపోయిన మెనోపాస్ తర్వాత అండాల తయారీ ఆగిపోయి స్త్రీ గర్భం దాల్చే అవకాసం ఉండదు. స్త్రీల వ్యాధుల శాస్త్రాన్ని గైనకాలజీ (Gynaecology) మరియు గర్భ సంబంధమైన శాస్త్రాన్ని ఆబ్స్టెట్రిక్స్ (Obstetrics) అంటారు.

స్త్రీ పురుషులిద్దరూ ఒకే రకమైన వ్యాధులు వస్తాయి. అయితే కొన్ని రకాల వ్యాధులు స్త్రీలలో ఎక్కువగా వస్తాయి. ఉదా: అవటు గ్రంధి సంబంధ వ్యాధులు.

[మార్చు] సమాజంలో స్త్రీల పాత్ర

ముదిత అనగా స్త్రీ . ముదితల్ నేర్వగా రాని విద్య కలదే ముద్దర నేర్పించినన్ ఎక్కడితే స్త్రీలు గౌరవించబడతారో ఆ దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలోన్ జతగా స్నేహితురాలవయ్తివి....కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి....వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన బార్యవైతివి....పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి.....అని అన్నారు. కష్టంలో ముందుండి.... సుఖంలో క్రిందుండి....విజయంలో వెనకుండి ....ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.స్త్రీని పూర్వ కాలంలో అబల అనగా బలం లేనిది అనేవారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు.

[మార్చు] స్థానిక సంస్థల్లో స్త్రీలకు 50 శాతం సీట్లు

స్థానిక సంస్థల్లో యాభై శాతం స్థానాలు మహిళలకు కేటాయిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల్లో ఉన్న33 శాతం స్థానాలను యాభై శాతం వరకు పెంచే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాలు 33 శాతం కంటే ఎక్కువగా పెంచాయి.

[మార్చు] తగ్గుతున్న స్త్రీల జనాభా

మాతృస్వామ్యంలో అవతరించి పితృస్వామ్య వ్యవస్థకు మారింది దేశీయ సంస్కృతి. మహిళల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. పురుషాధిక్యత పెరుగుతోంది. గతంలో ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని సంబరపడిపోయేవారు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటి భావిస్తున్నారు. ఆడపిల్లలైతే చదువులు, కట్నాలు ఇచ్చి వివాహం చేయాలని అనంతరం ఏ సమస్య తలెత్తినా తామే పరిష్కరించాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావించడంతో ఆడపిల్లల పై ప్రేమానురాగాలు తగ్గాయి. ఇదే తరుణంలో మగపిల్లల పై మోజు పెరిగింది. విద్యాబుద్దులు నేర్పిస్తే ఉద్యోగం చేసి తమను పోషిస్తాడని అంతేకాక లక్షలాది రూపాయల కట్నం తెస్తాడని, తమను పున్నామ నరకం నుండి రక్షిస్తాడని భావించారు. దీంతో తల్లి గర్బంలోనే పిండం ప్రాణం పోసుకుంటున్న దశలో స్కానింగ్‌లు తీయించి పాప అయితే గర్భవిచ్ఛిన్నం చేయించుతున్నారు.

  • ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను క లిగి ఉన్న భారత్‌... స్త్రీ, పురుషులను సమానంగా చూసేవిషయం లో మాత్రం అట్టడుగున ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన సూచి వెల్లడించింది. భారత్‌లో ఆడ శిశువుల ను గర్భంలోనే చంపేస్తున్నారని, 2.5 కోట్ల మంది ఆడపిల్లలు భూ మ్మీదకు రాకముందే హత్యకు గు రయ్యారని నోబెల్‌ బహుమతి గ్ర హీత అమర్త్యసేన్‌ వెలిబుచ్చిన ఆందోళనలను ఇది నిర్ధారించింది. 134 దేశాలపై రూపొందించిన ఈ సూచిలో భారత్‌ 114వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌, శ్రీలంక, నే పాల్‌ దేశాలు సైతం ఈ సూచీలో భారత్‌ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.(ఆంధ్రజ్యోతి11.11.2009)

[మార్చు] మూలాలు

  1. Menarche and menstruation are absent in many of the intersex and transgender conditions mentioned above and also in primary amenorrhea.
"http://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు