స్థానాపతి రుక్మిణమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్థానాపతి రుక్మిణమ్మ
జననం(1915-09-28)1915 సెప్టెంబరు 28
నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా
వృత్తిరచయిత్రి, పండితురాలు
మతంహిందూమతం
భార్య / భర్తస్థానాపతి సత్యనారాయణ
తండ్రిశ్రీకాకుళం పురుషోత్తమరావు
తల్లిగరుడమ్మ

స్థానాపతి రుక్మిణమ్మ (జ: 1915) ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి.[1]

కుటుంబ నేపథ్యం[మార్చు]

ఈమె పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు లో సెప్టెంబరు 28, 1915[2] జన్మించింది. ఈమె తండ్రి శ్రీకాకుళం పురుషోత్తమరావు, తల్లి గరుడమ్మ. రుక్మిణమ్మ వివాహం 1928లో విశాఖపట్నం నివాసి స్థానాపతి సత్యనారాయణతో జరిగింది. వీరు వెలనాటి బ్రాహ్మణులు.

సాహిత్య విశేషాలు[మార్చు]

ఈమెకు చిన్నతనం నుండే కవితలపై ఆసక్తి ఉండేది. ఈమెకు 18 ఏళ్ళ వయస్సులోనే మొదటి కవితా సంపుటి వెలువడింది. ఈమె దేవీ భాగవతాన్ని సామాన్య పాఠకుల కోసం వ్యావహారిక వచనంలో రచించినది. వివిధ ఉపనిషత్తుల నుండి దైవతత్త్వ ప్రతిపాదకాలైన సూక్తులతో నిండిన "దేవుడు" పుస్తకాన్ని రచించినది. వేదాల నుండి, ఉపనిషత్తుల నుండి కొన్ని ఋక్కులను ఎంపికచేసి తాత్పర్య సహితంగా వచనరూపంలో రచించినది. ఈమె రచనలు విశాఖపత్రిక, సత్యవాణి, ఆంధ్రవిద్యార్థి, భారతి, గృహలక్ష్మి, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఈమె రచనలు "వైతాళికులు" సంకలనంలో చోటుచేసుకున్నాయి.

గుర్తింపులు[మార్చు]

తన కృషికి గుర్తింపుగా మార్చి 2, 1952లో ఈమె గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నది.

ప్రముఖుల మాటల్లో[మార్చు]

రుక్మిణమ్మ పాండిత్యం గురించి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ మాటలలో, ఆంధ్రరచయిత్రులు గ్రంథంలో(పు. 272) – “అనన్య సామాన్య ప్రతిభతో నద్వితీయ కవితాప్రకర్షతో కవిత్వమొక యుపాసనగ, రచనయొక పవిత్రదీక్షగ, కావ్యోద్యోగమొక నియత జీవనవిధిగ భావించి, “క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదంతి” యను నానుడికి సార్థకత భజించి సరస్వతీ ప్రియసేవికయై తనరారిన మానెచ్చెలి లేఖిని యమృతనిష్యంది లేఖినియే.” .

రచనలు[మార్చు]

  1. పూలమాల (కవితా ఖండికలు) -1933
  2. దయ్యాలు (కథలు) -1937
  3. నీలాటి రేవు (కథలు)
  4. యుక్తిమాల (కథలు)
  5. దూతఘటోత్కచము (నాటిక)-1940
  6. వత్సరాజు (నాటిక)-1947
  7. చారుదత్త (నాటిక)
  8. దేవీ భాగవత మహాపురాణం (వచనం)
  9. దేవుడు -1938
  10. గోలోకం (వచన పురాణం)
  11. సప్తశతి (పద్యాలు)
  12. కాదంబిని (కావ్యము) -1950

మూలాలు[మార్చు]

  1. రుక్మిణమ్మ, స్థానాపతి, 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, రెండవ భాగము, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ 577.
  2. "[[గృహలక్ష్మి]] మాసపత్రిక మార్చి, 1952 సంచిక". Archived from the original on 2016-03-05. Retrieved 2014-11-20.

బయటి వనరులు[మార్చు]